వ్యాహ్యాళి
గతమో పరిమళ వీచిక
వ్యాపకాలు లేనివేళ
జ్ఞాపకాలు
శీతాకాలం చల్లగాలిలా
అల్లుకుంటాయి
అలక పాన్పుఎక్కిన మనసుకు
చందన హారతినిస్తాయి
చెలి చక్కిలిగింతలా
చలి శరీరాన్ని నిమురుతుంటే
గతంలోకి విహరించటమే ఓ వ్యాపకం
స్వగతాన్ని స్వాగతించటమే
వర్తమానపు వ్యాహ్యాళి
సి.యస్.రాంబాబు