Month: February 2022

“ఒంటరి” నవల సమీక్ష

"ఒంటరి" నవల సమీక్ష కొన్ని పుస్తకాలు కొందామని, NTR స్టేడియం హైదరాబాద్లో 2019 డిసెంబర్లో జరిగిన పుస్తక ప్రదర్శనకు వెళ్ళడం జరిగింది. అక్కడ అనుకోకుండా ఒక షాపులో 'ఒంటరి' నవల చూడటం, కొన్ని పేజీలు చదవడం.... చదివిన దగ్గరనుండి ఎప్పుడెప్పుడు మొత్తం చదువుదాం అనే అతృతతో పుస్తకం కొనుక్కొని వచ్చి నిరంతరాయంగా చదవడం అలా జరిగిపోయింది. నేను చదివిన కొన్ని నవలలో, ఏకబిగిన పట్టుబట్టి మొత్తం అయిపోయెవరకు చదివేలా చేసిన గొప్ప నవలలో ఒంటరి ఒకటి అని అనడానికి ఎటువంటి సందేహం లేదు. ఈ నవల రెండు భాగాలుగా సాగింది, ఒకటి - పేరు ప్రఖ్యాతలు, కావల్సినంత ధనం గడించిన ఒక డాక్టర్.. ఆరోగ్యపరంగా ఇబ్బందికి లోనై, ఆ క్రమంలో తన ఆరోగ్యం బాగు దృష్ట్యా అంతరించిపోతున్న ధాన్యపు జాతి కోసం ఆరు నెలల అన్వేషణ. రెండవది - తన ప్రాణవాయువుతో పొలాన్ని బుజ్జగించి, సమస్త జీవకోటితో అత్యంత సహజంగా ప్రకృతిలో…
Read More

మాతృత్వం

మాతృత్వం *అమ్మ రుణం తీర్చలేనిది* *అమ్మ త్యాగం మరువలేనిది* *మరో జన్మంటూ ఉంటే* *అమ్మలా పుట్టాలని* *అమ్మలోని మాతృత్వపు అనుభూతి పొందాలని ఆశ* - అంకుష్
Read More

అమ్మే దైవం

అమ్మే దైవం కన్నతల్లి... వెలకట్టలేని దైవం... ఋణం తీర్చుకోలేని దైవస్వరూపిణి... మానవతకు దైవస్వరూపం... కరుణాకటాక్షములకు తిరుగులేని శక్తి స్వరూపిణి... ఓర్పులో భూదేవి సమానురాలు... పట్టుదలలో నిలువెత్తు శిఖరం... హృదయం గర్భగుడి... త్యాగానికీ పుటినిల్లు... మమతానురాగాలకు అసలైన రూపం... బిడ్డకు రక్షణ మొదటి ప్రాధాన్యం... బిడ్డకు మాతృశాల... బిడ్డకు అక్షరాలయం... బిడ్డే ప్రాణంగా... బిడ్డల గెలుపును... బిడ్డల సంతోషమే... తనకు ముఖ్యంగా భావిస్తూ... బిడ్డల కోసం తన సర్వస్వాన్ని అర్పిస్తూ... తన సంతోషాలను తన బిడ్డలలో చూసుకుంటూ... తన గెలుపులను తన బిడ్డలలో చూసుకుంటూ... బిడ్డలను కంటికీ రెప్పగా కాపాడుకుంటూ... మురిసిపోతుంటుంది ''కన్నతల్లి'' అమ్మ నీకు శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ - కన్నతల్లినే దైవంగా భావించే ఓ కుమారుడు(గోగుల నారాయణ) 
Read More

అమ్మ నవ్వింది

అమ్మ నవ్వింది అమ్మ అనే కమ్మనైన పిలుపు కన్నా తియ్యని పిలుపు ఏది లేదీ లోకం లో, అమ్మ అనే పదానికి ఎంతో శక్తి ఉంది. అమ్మ అనే పదానికి ఎంతో ప్రేమ, మమకారం, ఆప్యాయత అనురాగం కలగలిపిన ప్రతి రూపం అమ్మ. కన్న తల్లిని ఎవరూ ఎప్పటికీ మర్చిపోలేరు. ఒక వేళ మర్చిపోయారు అంటే వాళ్ళ కంటే నికృష్టులు ఎవరూ ఉండరు. అమ్మను కష్టపెట్టే వాడు అసలు మనిషే కాదు. కొందరు తల్లిని అనాధ శరణాలయం లో వదిలేస్తారు. నవమాసాలు మోసి, కని, మల ముత్రాలు తీసేసిన తల్లిని కాదనుకుంటారు. కానీ ఆ తల్లి మాత్రం తన పిల్లలు బాగుండాలి అని కోరుకుంటుంది. అలాంటి వాళ్ళు నా దృష్టిలో నికృష్ట హీనులు. కుక్క కంటే కూడా హీనమైన వారు. అంత నికృష్టులు అయినా ఆ తల్లి మాత్రం నా పిల్లలు బంగారం అనే అంటుంది తప్ప వాళ్ళు వెధవలు అని…
Read More

ప్రాణం

ప్రాణం ప్రాణం అంటే తీపి ఉండును కదరా అందరికి. కన్న తల్లి ని చేర్చకురా ఈ జాబితా లోకి ! అమ్మకి ప్రాణం అంటే తనది కాదురా ! పురిటి నొప్పులు ఊపిరులు తీస్తుండగా ఊపిరులు పోసుకున్న నువ్వురా, ఆమె ప్రాణం. కంట్లో పడిన నలుసు క్షణ కాలం కవ్వించునురా. నీ అసహనాన్ని ఎరుపెక్కిన నీ కళ్ళు చూపునురా చెప్పకనే ---! కడుపులో పడిన నలుసు కవ్వించునురా, ఆఁ తల్లిని, నవమాసాలు. ముసి, ముసిగా మురుస్తున్న ఆఁ కళ్ళ సహనం నీ కొరకేరా ! అది నిలుచునురా ఆఁ తల్లి కడదాకా ! - వాసు
Read More

తల్లి

తల్లి కన్నతల్లిని వున్న ఊరిని మరచినవాడు మరుజన్మలో రాక్షసుడిగా పుడతారు అని పెద్దల మాట. బ్రతుకును ఇచ్చేది కన్నతల్లి. సుందర రూపం అని భావించేది కన్నతల్లి. తొలిపలుకు పలికించేది, తొలి అడుగు నడిపించేది కరుణ నిండుగ నింపేది కమ్మని మాటల మూటలు చెప్పేది. అంతరంగాల అక్షరాలు నీతిని క్యాతిని తెలిపేది కన్నతల్లి. తరగని ఆస్తులైన వదలని భారమైన సమతూకంలో తూచేది కన్నతల్లి. కాలం మారినా కారణం ఏదైనా నీ కోసమై దిగివచ్చిన దేవత కన్నతల్లి. - జి.జయ
Read More

దైవం

దైవం కడుపున పడినప్పటి నుంచి, తన కట్టె కాలేవరకూ  కన్నపిల్లలను కంటికి రెప్పలా, కష్టం లేకుండా కాపాడుకోవాలనుకుంటుంది. నీతి, నిజాయితీతో జీవించాలని, క్రమశిక్షణ, కర్తవ్యాలను బోధిస్తుంది. ఎన్నో అనుభవాలు, ఎన్నో పరిస్థితులు తెలియజేస్తూ పిన్న వయసు నుంచి పెద్ద వాళ్ళుగా పెంచే క్రమంలో తను ఎంత కష్ట పడినా, ఎన్ని అడ్డంకులు అధిగమించైనా, ఒంటరిగానైనా, ఇంటి భారాన్ని, బాధ్యతను నిర్వహిస్తుంది కట్టుకున్న వాడిని సైతం కన్న పిల్లలకోసం ఎదురిస్తుంది. ఎవ్వరూ నమ్మకపోయినా, కన్నతల్లి మాత్రం పిల్లల మీద నమ్మకం ఉంచుతుంది. వారి అలోచనలకు, అభిప్రాయాలకు గౌరవిస్తుంది. తన పిల్లల్ని ఉక్కు మనుషుల్లా, సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగే మనసున్న మనిషిగా పెంచుతుంది సహనంలో ధరిత్రి , భువిలోని దేవతామూర్తి కన్నతల్లే. తల్లిని మించిన దైవం లేదు. - బి. రాధిక
Read More

అమ్మ

అమ్మ పిల్లలకైనా.. పిల్లలను కన్న తల్లిదండ్రుల కైనా గుర్తొచ్చే పదం అమ్మ.. కష్టాలకు కావలి కాస్తూ, కన్నీళ్లకు వారధి వేస్తూ.. దుఃఖాన్ని దండిస్తూ.. బాధలను బంధీని చేస్తూ.. పేగు బంధాన్ని ప్రేమ బంధంతో ముడివేస్తూ.. తప్పటడుగులు సరిచేస్తూ ... జీవితానికి బాటలు వేస్తూ... ఆనందానికి అవధులు లేకుండా అడ్డుకట్ట వేస్తూ.. మకుటం లేని మహారాజుల వెలుగొందాలని... ఆశ పడని.. ఆరాట పడని తల్లి ఉందా... - మల్లి ఎస్ చౌదరి 
Read More

కన్నతల్లి

కన్నతల్లి జీతమే లేని జీవితానైనా .. జీవితాలను పంచు జీవమురా.. నాభిమూలము నడక ధారణ.. చేయు ఘనత తనదేరా.. నవ్య జగతికి అంకురార్పణ.. ఆ తల్లి ఋణమేరా.. సర్వసృష్టికి సార్వభౌమము.. ఆమెయే కదరా.. !   - భాను శ్రీమేఘన
Read More

పంచాంగము 10.02.2022

పంచాంగము 10.02.2022   విక్రమ సంవత్సరం: 2078 ఆనంద శక సంవత్సరం: 1943 ప్లవ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: మాఘ పక్షం: శుక్ల-శుద్ద తిథి: నవమి ప‌.12:14 వరకు తదుపరి దశమి వారం: గురువారం-బృహస్పతివాసరే నక్షత్రం: రోహిణి రా.తె.04:19 వరకు తదుపరి మృగశిర యోగం: ఐంద్ర రా.06:48 వరకు తదుపరి వైధృతి కరణం: కౌలువ ప‌‌.12:14 వరకు తదుపరి తైతుల‌ రా.01:04 వరకు తదుపరి గరజి వర్జ్యం: రా.07:30 - 09:16 వరకు దుర్ముహూర్తం: ఉ.10:35 - 11:21 మరియు ప‌.03:11 - 03:57 రాహు కాలం: ప‌.01:56 - 03:23 గుళిక కాలం: ఉ.09:37 - 11:04 యమ గండం: ఉ.06:45 - 08:11 అభిజిత్: 12:07 - 12:53 సూర్యోదయం: 06:45 సూర్యాస్తమయం: 06:15 చంద్రోదయం: ప.12:58 చంద్రాస్తమయం: రా.01:35 సూర్య సంచార రాశి: మకరం చంద్ర సంచార రాశి: వృషభం దిశ శూల: దక్షిణం…
Read More