Month: March 2022

అగ్ని సాక్షిగా!!

అగ్ని సాక్షిగా!! చలి చీకట్ల ఆరాటం, చెలిని కమ్మేసెను అకాలమున. పరవళ్ళు తొక్కుతున్న, నదీమతల్లి ఒడిన పసిబిడ్డ ఓలె చేరి, ఆ తల్లి ప్రవాహాన్ని చీర కొంగు గా మార్చి జల,జలా కారుతున్న కన్నీటిని తుడువజిక్కెను!! నిశీధి చీకట్లను, ఉవ్వెత్తున ఎగసిన, చితి మంటలు చీల్చుతుండ, కారు కన్నీరు ఆవిరై కార కుండెను. శాశ్వతంగా మూగబోయిన ఆ గొంతుక, అగ్ని సాక్షిగా చెప్పెను, నిన్ను ఊరట చేయ నేను ఉదయస్తాను కిరణ్మయి నై. నీకు సేద నిచ్చుట తధ్యము, అవి నా పలుకుల పసిడి మూటలు!! - వాసు
Read More

అన్వేష్ – కథానిక

అన్వేష్ - కథానిక నేనో ఫ్యాన్సీ షాపులో మొదలుపెట్టి దానికి అటాచ్డ్ గా కాఫీషాపు తెరిచి కొత్త ఆలోచనకు పునాదివేశాను. నా ప్రయోగంఫలించి మరికొంతమందికి ఆ ఆలోచన వచ్చింది.. నా భుజం నేను తట్టుకున్నాను. నిజం చెప్పాలంటే నా భార్య ఐడియా అది. కానీ తను నా అంత చదువుకోలేదు కాబట్టి అది నాదిగా చెలామణి అయింది. కాదు చేశాను. ఆలోచన వేరు, దాని అమలు వేరు అని సమాధాన పరుచుకున్నాను. నేను క్రెడిట్ ఇవ్వలేదని తనూ అడగదని తెలుసు. అలా నా అంత బాగా వ్యాపారం మరొకరు చేయలేరని విర్రవీగుతున్న సమయంలో కొవిడ్ వచ్చి అందరిలాగే నన్నూ అతలాకుతలం చేసేసింది. లాక్ డౌన్ లో వర్కర్స్ వెళ్ళిపోయారు. మొదట్లో భయం వల్ల బిజినెస్ గురించి ఎక్కువ ఆలోచించలేదు. నెమ్మదిగా దాచుకున్న డబ్బంతా కరిగిపోవటం మొదలయ్యాక ఏంచేయాలో అర్థం కాలేదు. నా భార్యేమయినా చెప్పబోయినా విసుక్కునేవాడిని. పిల్లల గురించి బెంగా మొదలయింది.…
Read More

పలుకే బంగారమాయే…

పలుకే బంగారమాయే... ఎన్నో ఎదురుచూపులు... మరెన్నో కలవరింతలు... ఇంకెన్నో నిద్రలేనిరాత్రులు... నీ మాటకై... నీ పిలుపుకై... నీ ఊసులకై... నీ తలపులకై... నీ స్వప్నానికై... ఎన్నో నిరాశలతో... మరెన్నో ఆశలతో... చివరికి నీ పిలుపే... చివరికి నీ పలుకే బంగారమయింది.... నీ పిలుపుకై ఎదురు చూస్తు ఉంటాను... - నారాయణ
Read More

బంగారూ కొలిమి

బంగారూ కొలిమి నీ పలుకులకు పల్లకి మోసినపుడు బంగారూ కొలిమిలో కొలతనైతినే.. నీ పలుకే బంగారమాయెనే..... - బాబు
Read More

నీ పలుకే….

నీ పలుకే...   పలకలేక పలకలేక పలికిన పలుకులా. పడిలేసిన చినుకులా. పసిపాపల నవ్వులా. నీ పలుకే బంగారమాయెనే ... - బాబు
Read More

అవకాశం

అవకాశం *ఎల్లకాలం కలసిలేనంత మాత్రాన* *స్నేహితులు విడిపోయినట్టు కాదు,* *ఎందుకంటే..!* *ఎన్నేళ్ళు గడచినా స్నేహ జ్ఞాపకాలు* *మధురానుభూతితో దగ్గర చేసే* *అవకాశాలను తరచూ కల్పిస్తూనే* *ఉంటాయి.* - దేవా
Read More

నమ్మకం

నమ్మకం మనం తలపెట్టిన కార్యం మంచిదనే నమ్మకం మనకున్నప్పుడు. అవాంతరాలెన్ని ఎదురైనప్పటికీ పట్టించుకోరాదు.! - దేవా
Read More

పంచాంగం 20.03.2022

పంచాంగం 20.03.2022 *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - శిశిరఋతువు* *ఫాల్గుణ మాసం - బహళ పక్షం* తిధి : *విదియ* ఉ11.28వరకు తదుపరి తదియ వారం : *ఆదివారం* (భానువాసరే) నక్షత్రం: *చిత్ర* రా12.13 వరకు తదుపరి స్వాతి యోగం: *ధృవం* ఉ8.05 వరకు కరణం: *గరజి* మ11.28 వరకు తదుపరి *వణిజ* రా10.45 వరకు వర్జ్యం: *ఉ8.34 - 10.08* & *తె5.35నుండి* దుర్ముహూర్తం : *సా4.44 - 5.32* అమృతకాలం: *సా5.57 - 7.31* రాహుకాలం : *సా4.30 - 6.00* యమగండ/కేతుకాలం: *మ12.00 - 1.30* సూర్యరాశి: *మీనం* చంద్రరాశి: *కన్య* సూర్యోదయం: *6.11* సూర్యాస్తమయం: *6.06* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు 
Read More

రంగుల రూపము

రంగుల రూపము మనిషికి ఉన్న బాధలను మరిచి అందరూ చిన్న పిల్లల్లా మారిపోయి మనుసులో సంతోషంను నింపుకొని చిన్న,పెద్ద తేడా లేకుండా ఆ ఆనందమను రంగుల రూపము లో ఒకరి మీద ఒకరు చల్లుకోండి అందరికి "హొలీ పండుగ" శుభాకాంక్షలు|| - శ్రావణ్  
Read More