స్వర్గం - నరకం స్వర్గం నరకం ఎక్కడో లేవు. మన జీవితంలో అన్ని అనుభవాలు ఆ సమయానికి స్వర్గ నరకాలు గా అనిపిస్తాయి. మనసు బాగుంటే అది స్వర్గంలా లేకపోతే నరకంలా ఉంటుంది. అసలు మనసు ఎప్పుడు బాగుంటుంది? ఎందుకు బాగుంటుంది? అసలు మనసు అంటే ఏమిటి? అదెలా ఉంటుంది? మనసుకు మనకు సంబంధం ఏమిటి? మనసుకు రంగు, రుచి, వాసన ఉంటాయా? అది మన శరీరం లో ఒక భాగమేనా? ఇలాంటి చాలా సందేహాలు అందరికీ ఒక్కొక్కసారి తెలుసుకోవాలి అని అనిపించక మానదు. అయితే వీటన్నిటికీ సమాధానం అయితే నాకు తెలియదు. కానీ నేను అనుకున్నది నిజమా కాదా అనేది తెలుసుకోవడానికి ఇక్కడ కొన్ని ప్రశ్నలు సమాధానాలు చెప్తాను. అందులో ఎక్కువగా అవును అని అంటే మీరు మీ మనసు బాగున్నట్టే... లేదంటే మీ మనసు బాగా లేనట్టే.... సరే ఇక ప్రశ్నలు చూద్దాం 1. మీరు మీ జీవితం…