aksharalipi poems

మంచితనం

మంచితనం  మంచితనం...మానవత్వం మచ్చు కైనా కానరాదే... మంచితనం మరిచిపోయి మర మనిషివి అయ్యావా... తోటి వారిని...సాటి వారిని మాటల తూటాలతో గాయపరిచి స్వార్థపూరిత భావంతో అహంకారం తలకెక్కి... మనిషిగా బ్రతకలేని.. ఓ...మనిషి నీ మనుగడ ఎక్కడా..!? ఒకసారి.. వెనుదిరిగి చూడు ప్రేమించే గుణం నీలో ఉంటే... ప్రపంచమే ఒక అధ్బుత సుందర దృశ్యం.              - అంకుష్
Read More

మనిషి ఉన్నతజీవి

మనిషి ఉన్నతజీవి "ఆనందం" అనే భావన తో....  చేప పిల్లలను నీటి తొట్టిలో బంధీస్తున్నాడు.... ! "నా వల్లే బ్రతుకుతున్నాయి"అనే భ్రమ తో...  స్వేచ్ఛ పక్షుల్ని పంజరాల్లొ బంధీస్తున్నారు... ! "ఇంటికి కాపలా"అనే పేరు తో...  విశ్వాసం గల కుక్కలని గొలుసులతో కట్టేస్తున్నారు..!  "భవిష్యత్" అనే భ్రమ తో..   పిల్లల బాల్యాన్ని బలి తీసుకుంటున్నారు...!  "సాంప్రదాయం" అనే సాకుతో..   ఆడవాళ్ళ అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తున్నారు..!  "విద్య" అనే మాయ తో...,   విద్యార్థులను వ్యథకు గురిచేస్తున్నారు... !  "జీతం"అనే పరువు కోసం..,   ఉద్యోగస్తుల్ని బానిసలుగా చేస్తున్నారు..!  "అభివృద్ధి" అనే  పేరుతో..,   ఉన్న పొలాలన్నీ ఫ్లాట్స్ గా మారుస్తున్నారు..! "మా మతం" గొప్పదనే అభిప్రాయం తో...,  జీవ హింసలు చేస్తున్నారు... !  "మానసిక ప్రశాంతత" అనే పేరుతో..,   మగవాళ్ళు మద్యం మత్తుకు అలవాటు పడుతున్నారు..!  "మాంసం" బలం అనే భ్రమతో...,   మూగజీవుల పై దాడులు జరుగుతున్నాయి..!  "రోగం"అనే పదాన్ని భూతంగా చూపిస్తూ...,   పేదల రక్తాన్ని…
Read More

మంచితనము 

మంచితనము  మంచితనము కంటే మించిన సంపద లేదు అంటారు పెద్దలు  అమ్మే ఆస్తి కాదు కొనే వస్తువు కాదు నిష్కల్మషమైన మనసులొ  నుండి వస్తుంది  మంచితనము అర్దం  మారిపోయింది ఈ రోజుల్లో మసకబారిన మంచితనము తడబడుతున్న మానవత్వం పరిహాసాల పందేరంలో అబద్ధపు అంచుల్లో సమాజపు సరిహద్దులో  మంచితనాన్ని పరికిస్తే మానవత్వం కనులు  తెరుస్తుంది మనలో వుండే భావమే మంచితనంగా రూపుమారి  మనకు చూపిస్తుంది తీరు--- తెన్నూ... - జి.జయ
Read More

ఆకలి అంటే

ఆకలి అంటే    ఆకలి అంటే నాకు చాలా ఇష్టం... ఆకలి నాకు పరిపూర్ణత నేర్పింది... ఆకలి నాకు మమతలు పంచడం నేర్పింది... ఆకలి నాకు అందరిని దగ్గరగా చేసింది... ఆకలి నాకు జ్ఞానాన్ని ఇచ్చింది... ఆకలి నాకు అందరిలో దైవత్వాన్ని చూపింది... ఆకలి అంటే నాకు చాలా ఇష్టం... ఆకలి అంటే నాకెంతో గౌరవం... ఎందుకంటే...!? ఆకలి నాకు కొత్త ప్రపంచాన్ని చూపింది... ఆకలి నన్ను అజేయున్ని చేసింది... అందుకే ఆకలి అంటే నాకు మహ ఇష్టం... - అంకుష్
Read More

సంఘజీవి 

సంఘజీవి  అందనిద్రాక్ష పండు పుల్లన  మెరిసే సమాజం అబద్దం అన్నట్టు వుంది   కులమతాల కుట్రలో కుళ్ళినపండులాగా తయారయ్యింది సమాజం.  సతమతమయ్యే సమస్యలతో పరిమితులు ఎన్నో పరచుకున్న   ఆచరణలో సాధ్యం కాని పనులతో వ్యత్యాసాలను వ్యతిరేకిస్తూ ఎదగాలని ఆశపడుతూ  పట్టువదలని విక్రమార్కుడు లా పట్టుకొని వ్రేలాడుతూ వదలని విజ్ఞానంతో  తొలగని అజ్ఞానంతో  అవసరం వున్నా లేకున్నా బ్రతుకు పోరాటం చేయాలి నేటి సమాజంలో సంఘజీవిగా! - జి.జయ
Read More

ఆదర్శ మార్గం

ఆదర్శ మార్గం కాలం చెల్లిన భావజాలాలను బద్దలుకొట్టి, నవశకానికి నాంది పలికేది, అచేతనంగా పడివున్న సమాజ జీవశ్చవాన్ని కదిలించి గొంతెత్తి  ప్రశ్నించేది, నిరాశావాదంలో కొట్టుమిట్టాడే నవతరం యువతని విప్లవశంఖమై నడిపించేది, అంధకారంలో నిద్రాణమైన జగతిని జాగృతం చేసి నవోదయాన్ని చూపించేది. - శివ.KKR
Read More

ఎవరు నీవు

ఎవరు నీవు గొప్పగొప్ప ఆదర్శాలు... గోప్పోళ్ళ  కోసం గప్పాలు పలుకుతూ... నాలుగు మాటలు నేర్చి... నలుగురు మధ్యలో మాటల మూటలతో... ఊకదంపుడు ఉపన్యాసాలతో... తోటి వారిని సాటివారిని.... దోచుకుంటూ.. దాచుకుంటూ.... స్వార్థపూరిత భావంతో... సమతా భావాన్ని సమాధిచేస్తూ... అసమానతలకు ఆజ్యం పోస్తూ... మేకవన్నే పులిలా మారిన నీవు... సంఘజీవివా..?... సంఘద్రోహివా..? - అంకుష్
Read More

జీవి అంటే!

జీవి అంటే! మంచితనమే ఊపిరై శ్వాసించి, నీ దృష్టితో శాంతాన్ని వెదుకు, వాక్కులో శుద్ధి వెలువరుచు, నవ్వు ఆయుధం : సంహరించు పరుషం, చెయ్యి అందించు అందరికీ, చెయ్యి చాచకు ముందరికి, నీ అడుగులు వెనుక వారికి ఆదర్శము, , ఆరాటము లేదు విరామముగ సాగు, నీ బాటలో ముల్లుని తీసిన, ఫల బీజము నాటిన సమానము, నిన్ను అనుసరించిన నాకు అది ఆదర్శము, మరియు రాజమార్గము, ఇట్లుండిన నీవు సంఘజీవివి లేకుండిన నీవు సంఘర్షణ జీవివి. - వాసు
Read More

కలి

కలి కలికాలంరో, బాబోయ్ కలికాలంరో, ఆకలి అంటే అర్థాలు "వేలు" ఉండునురోయ్ ! అసలే పట్టనిది పేదోనిదిరోయ్ ! పట్టినా, పట్టునది ధనికుడిదిరోయ్ ! అస్సలు ఎకసక్యమే కానిది నాయకునిదిరోయ్ ! నిత్యక్షుద్భాద వ్యాపారి దిరోయ్ ! కలికాలం రోయ్, బాబోయ్ కలికాలంరోయ్, ఆకలి అంటే అర్థాలు 'వేలు' ఉండును రోయ్ ! కడుపు నిండన్కి బుక్కెడు, గుక్కెడు గంజి చాలును రోయ్ ! అది కూడా దక్కదు పేదోనికి రోయ్ ! పేరు మార్చి 'సూపు' అంటారు మన తారలురోయ్ బక్క చిక్కి అందం అంటారు వీరిని ఏమనాలిరోయ్ ! - వాసు
Read More

ఆకలి

ఆకలి ఆకలి రుచి ఎరుగదు నిద్ర సుఖం ఎరుగదు అంటారు పెద్దలు ఆకలి తీర్చేది అన్నం అది పెట్టే వాడు రైతు ఇప్పటి రోజుల్లో అన్నం పెట్టే రైతే ఆకలి అంటున్నాడు ఆకలి భాద తెలిసిన వాడు జీవితంలో పాఠాలు నేర్చుకుంటాడు ఆకలికి మందు లేదు ఇప్పటికీ అది వుంటే జగమంతా శూన్యం ఆఆకలి తీరని ఆ క్షణం రగులుతోంది మనసు బాధతో ఆకలి చావులు లేని దేశమే సుసంపన్నం అప్పుడే ప్రారంభం అవుతుంది నవ శకం మన అందరి ఆకలి తీరుస్తున్న అన్నదాతకు వందనం పాదాభివందనం. - జి.జయ
Read More