ధైర్యం 1) కష్టం విలువ వెలలేనిది. ఇది నిర్వచనీయమే. దీనికి తెలుసు ఆకలి బాధ. 2) నీ అవసరం లాంటిదే ఇతరులది అనుకుంటే, నీలో వున్నది ముమ్మాటికి నిజాయితి. 3) నవ్వించడానికి నవ్వు కానీ నవ్వుతూ నవ్వులపాలు చేయడానికి నవ్వకు. 4) నీ అదృష్టానికి దేవుడి ఆశీస్సులు కారణమైతే, ఇతరులని శాపించకు. 5) నీవు నడిచే దారి ముళ్లబాటైతే అనుసరులకై చూడకు. 6) మాటపై నడుస్తే నీది పూలబాటే. నీతి:- సాహసానికి ధైర్యం అవసరం. నీలో ఇది అవసరం. - వాసు