gogula narayana

అలలు…

అలలు... అలలు కలలై మిగిలే జీవితంలో కలలు అలలై పొంగే జీవితంలో ఎగసే ఆలోచనల తీరం సాగేను మనసున ఉప్పొంగే కెరటం జీవితంలో ఎదురయ్యే అలల దాటికీ కొన్ని జీవితాలు నిలబడితే మరికొన్ని జీవితాలు అలలలో కొట్టుకుపోయే అలల తాకిడికి వేయాలి అడ్డుకట్ట లేదంటే ఆ అలల ప్రవాహంలో కొట్టుకుపోవడమే ఉంటుంది కొన్ని ఊహల అలలు నిన్ను భ్రమింపజేస్తే మరికొన్ని ఊహల అలలు నీకు వాస్తవాన్ని చూపిస్తాయి అలలు కలలుగా మిగలకుండా కలలు అలలుగా సాగాలి నిన్ను నిలబెట్టాలి నువ్వు జీవితంలో ఎదురయ్యే అలల తాకిడిని తట్టుకొని నిలబడాలి... - గోగుల నారాయణ
Read More

పసివాడు

పసివాడు తన జీవననావకోసం ఎన్నో కడలిలను దాటవేస్తూ తన ఆకలి కోసం బ్రతుకును అంకితం చేస్తూ ఓ ప్రక్క దారిద్ర్యాన్ని దాటే క్రమంలో ఎన్నో వ్యయప్రయాసలతో కొనసాగుతూ తన పొట్టతో పాటు తన ఇంటిల్లిపాది వారి కడుపును నింపుటకు తనే ఓ సైనికునిగా పోరాటం చేస్తూ దారే ఆహారంగా తన జీవనాన్ని మలుచుకున్న ఓ పసివాడు - గోగుల నారాయణ
Read More

మూడు ముళ్ళు…

మూడు ముళ్ళు... రెండు జీవితాలు ఒకటిగా కలిసే సుభసమయం... ఇద్దరి ఆలోచనలు ఒకటిగా మారే శుభతరుణం... కలకాలం కలిసుండడానికీ వేసే మొదటి అడుగుల ప్రయాణం... ఇరువురికీ జ్ఞాపకాల దొంతరలు... నిండు నూరేళ్ళ ప్రయాణ సంగమం... తొలి అడుగులు మలిఅడుగులుగా మారే సమార్పణం... రెండు తనువులు ఒకటిగా మారే సమయార్పణం... కాలాల పరీక్షకు తొలి అడుగు... భవబాంధవ్యాల ప్రయాణం... కొత్త కొత్త ఆనందాలకీ నెలవు... ఒకరినొకరు బాసల ప్రయాణం... మూడే ముళ్ళు ఏడే అడుగులుగా సాగే ప్రయాణానికి తొలిప్రమాణం... - గోగుల నారాయణ
Read More

తపించు

తపించు నీలోని ఆశయాలకై నీలోని లక్ష్యాలకై నీ గమ్యాన్ని చేరడానికి నీ జీవితగమనానికై నీ పురోభివృద్ధికై నీ ఆశలనిచ్చెనకై నీ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి నువ్వు మంచి మార్గంలో నడవడానికై నీ తల్లిదండ్రుల ఆశయసాధనకై నిన్ను నమ్మినవారికోసమై నువ్వు నమ్మినవారికోసమై నలుగురి మంచికోసమై నీ తోటివారి అభివృద్ధికై తపించు తపించు నీ ఆశయసాధనకై - గోగుల నారాయణ 
Read More

నాలో నేను- నాతో నేను

నాలో నేను- నాతో నేను ప్రస్తుతం స్వార్థంతో నిండిన సమాజంలో బ్రతుకుతున్నాం... ప్రస్తుత సమాజంలో నెగ్గుకురావాలంటే ఖచ్చితంగా నీకు కొద్దోగొప్ప స్వార్థం ఉండాలే... అప్పుడు మాత్రమే ఈ సమాజంలో నిలబడగలవు లేదంటే నిన్నే పునాదిగా చేసుకొని బ్రతుకుతుంది సమాజం... నీది కానిది అది ఏదైనా దానిపై ఆశలు పెంచుకోకు నీది కానిది దానిపై ఆశలు పెంచుకుంటే చివరికి నిరాశే మిగులుతుంది... నీ ప్రయాణమే నీ గమ్యాన్ని మార్చే నావ... ఆ నావను ఆపకు... కొనసాగించు... నీ నావ నీ గమ్యాన్ని ఖచ్చితంగా చేరుస్తుంది... నాలో నేను- నాతో నేను - గోగుల నారాయణ
Read More

అజ్ఞాతం

అజ్ఞాతం నిన్ను నువ్వు తెలుసుకోలేనంతకాలం... నిన్ను నువ్వు గుర్తించలేనంతకాలం... నీకో గుర్తింపుని... నీకో గౌరవాన్ని... నీకు సమాజంలో ఓ స్థాయిని... నీకు సమాజంలో విలువని... నిన్ను నీవు తెలుసుకునేలా... నిన్ను నువ్వు గుర్తించేదిగా... నిన్ను నీకు పూర్తిగా పరిచయం చేసేది... ఇతరుల స్వభావాన్ని తెలియపరిచేది... - గోగుల నారాయణ
Read More

ఆశ

ఆశ మధ్యతరగతి వారి జీవితమే ఓ ఆశ... జీవన పోరాటాల మధ్య ఎడతెగని మెలిమి ఓ ఆశ... నిన్నటిని వదిలి రేపటికై ప్రయాణంలో నేటి భౌతికస్థితియే ఓ ఆశ... ఆలోచనల సంగమాల యుద్ధంలో తనే గెలుస్తూ నిరాశల ఉత్సాహాన్ని మరిపిస్తు ముందుకు నడిపించేది ఓ ఆశ... జీవితాన్ని నిలబెట్టేది ఆశే జీవితాన్ని కడవరకు కొనసాగించేది ఆశే నిన్నటిని గెలిచేది కూడాను ఆశ - గోగుల నారాయణ
Read More

ఊపిరి

ఊపిరి నీ శ్వాసే నా ఊపిరి.... నీ నవ్వే నా ఊపిరి.... నీ స్వరమాధుర్యమే నా ఊపిరి.... నీ శ్రేయస్సే నా ఊపిరి.... నీ ఆలోచనే నా ఊపిరి - నారాయణ
Read More

అక్షర లిపి ఫౌండర్ తో ఇంటర్వ్యూ

 అక్షర లిపి ఫౌండర్ తో ఇంటర్వ్యూ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకం, అక్షరలిపి ఫౌండర్ శ్రీ శారదా దేవి గారి ఇంటర్వ్యూ మీకోసం అర్చన:- అమ్మ నమస్తే  మీరు పుట్టింది ఎక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నారు ? అమ్మ:- అమ్మా నమస్తే,  నేను పుట్టింది పెరిగింది ఒక మోస్తరు పట్టణంలో అయినా  మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే, అంటే పల్లెలో పెరిగాను. మాది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం. నేనొక మామూలు మధ్య తరగతి సగటు ఇల్లాలిని. చదువుకున్నది తక్కువే, అయినా ఎంతో,కొంత తెలుసుకున్నాను. అనుభవం అన్ని నేర్పిస్తుంది అమ్మ. ఇప్పుడు నేను ఏమి చేయడం లేదు అంతా నా పిల్లలే చూస్తున్నారు. కాకపోతే కొన్ని విషయాల్లో నేను సలహాలు ఇస్తూ ఉంటాను, పిల్లలు కూడా నన్ను అన్ని అడుగుతూ ఉంటారు. అర్చన:- అసలు ఈ అక్షరలిపి అనేది మీరు ఏలా మొదలు పెట్టారు  ? అమ్మ:- దీని గురించి మీకు…
Read More

వాగ్దానం

వాగ్దానం రెండు జీవితాల ప్రయాణం... కుటుంబ ప్రమాణాల ప్రయాణం... మరోనిండు జీవితానికి స్వాగతం... జీవి మనుగడకు సమాధానం... ప్రమాణం చేసి మరచుట ప్రమాదం... ఆ ప్రమాదం రెండు జీవితాల అగమ్యగోచరం... ప్రమాణం చేసి మరువకు... ఇచ్చిన మాటకై నిలబడు... జీవితాన్ని నిలబెడుతుంది ప్రమాణం... - గోగుల నారాయణ
Read More