Month: February 2022

ఎప్పుడైనా

ఎప్పుడైనా  ఎప్పుడైనా.... ఎక్కడైనా.... ప్రజలపై పాలకుల.... ఎత్తుగడల ఉక్కుపాదం.... నష్టమైనా.... కష్టమైనా కలసికట్టుగా కదలడమే.... సమరమైనా.... మరణమైనా పోరుబాటన.... సాగిపోవడమే -అంకుష్
Read More

శివరాత్రి

శివరాత్రి వైకుంఠ ఏకాదశి పొద్దున్నే పనులన్నీ చేసుకుని, అందరం ఉపవాసం కాబట్టి పిల్లలకు మాత్రం ఉప్మా చేసేసి, బాక్స్ లలో పెట్టేసి నేను కూడా తయారయ్యి, బడికి బయలుదేరాను. ఎప్పటిలా క్లాస్ లన్ని చెప్పేసేసి, లంచ్ లేదు కాబట్టి నేను రాయకుండా వదిలేసిన అసైన్ మెంట్స్ రాసుకున్నా, సాయంత్రం బడి అయ్యాక, ఇంటికి వచ్చేసి, కాళ్ళు చేతులు కడుక్కుని ట్యూషన్ కి వచ్చిన పిల్లలని కూర్చోబెట్టి నేను మా పిల్లలకు హోం వర్క్ చేయించడం మొదలు పెట్టాను. అదయ్యేసరికి రాత్రి ఎనిమిదిన్నర అవడంతో మాకు టిఫిన్, అలాగే పిల్లల కోసం ఏదైనా చేయాలని అనుకున్నా, అందరికీ కలిపి సేమ్యా ఉప్మా చేశాను. పిల్లలకు పెట్టాను. నేను మళ్ళీ దేవుడికి దీపం పెట్టేసి అమ్మకు, నాకు ఉప్మా పెట్టాలని అనుకునే సమయంలో హఠాత్తుగా మణికొండ లో ఉండే మా పెద్ద తమ్ముడు వచ్చాడు. రావడం తోనే ఏం చేస్తున్నారు అంటే ఉపవాసం కదా…
Read More

అర్ధరాత్రి

అర్ధరాత్రి అర్ధరాత్రి, కొందరికి అంతరంగం మేలుకునే సమయాలు. భావాలను, భావోద్వేగాలను పూర్తిగా నిద్ర లేపే క్షణాలు. అందని వాటిని ఎన్నో అందించుకునే ఊహల ప్రపంచంలోకి తీసుకుపోయే ఘడియలు. కొందరికి ఆనంద ప్రపంచాన్ని అందిస్తుంది. కొందరికి అవేదన పరిచయం అవుతుంది. ఒంటరితనానికి అర్ధరాత్రి  ఒక నరకం. ఏకాంతానికి ఒక  తియ్యని అనుభవం. అర్ధరాత్రి నడక భయం. ఆలోచనలు అపడం కష్టం. ఆ సమయంలో వచ్చే ఆలోచనలను సరైన రీతిలో నడిపిస్తే, జీవితం విజయాల మయం.  అన్నీ సమయాలు ఏదో ఒక పరిస్థితితో పోరాడే మనిషి, అర్ధరాత్రి తన అంతరంగ స్థితితో పోరాడాలి. అప్పుడు, అక్కడ ఆ స్థితిని అధిగమిస్తేనే, ఉదయపు సూర్యుని కిరణాల వెలుగును గర్వంగా చూడగలుగుతాడు మనిషి. - రాధిక.బడేటి
Read More

అర్థరాత్రి

అర్థరాత్రి అర్థరాత్రి అర్దం మారి పోయింది నేటి సమాజంలో ఆధునీకరణ మంత్రముతో అర్థరాత్రి అలజడులు సృష్టిస్తున్నారు కొందరు విద్యుత్ కాంతుల వెలుగుల్లో వాహనాల రణగొణ ద్వనులతో అర్థరాత్రి ఆహా అన్నంతగా  ఉరుకుల పరుగుల జీవితంలో అర్థరాత్రి లేదు  అపరాత్రి లేదు అన్నట్లు గా వుంటుంది . మందుబాబులకు మాయాలోకం అర్థరాత్రి జవానులకు మహత్తర సందేశం అర్థరాత్రి నిజంగా చెప్పాలంటే నిషాచరులు నిద్ర లేచిన సమయం అర్థరాత్రి మనుషులు మత్తుగా నిద్రించే సమయం అర్థరాత్రి. - జి.జయ
Read More

అర్థ రాత్రి

అర్థ రాత్రి అర్థరాత్రి... గాఢ నిద్రలో నేను... ఇంటిబయట గేటును... లాటీలతో బాదిన చప్పుడు... వెళ్లిచూసాను... ఇంటిముందుంది ఒక జీపు... తెల్లవారేకాదు... మరెప్పుడు ఎవరికి తెలియదు... నేను ఏమైపోయానోనని... - అంకుష్
Read More

రెక్కలొచ్చిన ఊహలు

రెక్కలొచ్చిన ఊహలు అందమా, నిను చూసినది మొదలు నీ ప్రతిమను నిలుప నిర్విరామ మాయెను నా కృషి. మసక కమ్మేనా, నా కళ్ళు లేదా నీవు పొగమంచు మాటునుంటివా ? ఎట్లు నిలుపగలను నీ ప్రతిమ ? అర్ధ రాతిరి లేస్తిని. భయము గొల్పెను నాకు రెక్కలొచ్చిన నా ఊహలు ఉండునో, ఎగురునో, నని ? కలలో గంటిని నిన్ను కారుమబ్బులు షికార్లు కొడుతుండగా, ఉరుములు, మెరుపుల కాంతిలో చెక్కితిని నీ శిల్పము. శిల్పి నైతిని అర్ధరాతిరి నా అనుభవ లేమి మరిచే ఒక గొడుగు నిల్ప నీ శిరస్సు పై. తడిసి ముద్దయితివి ఆరుబయట. ఓ, నా శిల్పమా, మన్నించుము ఈ నాటు ప్రేముకుడ్ని. - వాసు
Read More

అర్ధరాత్రి

అర్ధరాత్రి సుడులు తిరుగుతుంది.. మనసు.. సహకారం అందించే చేతులకోసం.. సమయం చిక్కక అందుకునేందుకు.. నేను లేని నా అనే వాడి జాడతో.. ఓ చేయూతకై చేస్తుంది సమరం, సర్వ ప్రయత్నాలకూ తీసుకుపోతూ.. యుద్ధభూమిగా ఆ క్షేత్రం.. అర్థం చెప్పే రాత్రి తానుగా ఏదో కథ చెప్పడం విశేషం..!! - భాను శ్రీమేఘన
Read More

పంచాంగము 11.02.2022

పంచాంగము 11.02.2022   విక్రమ సంవత్సరం: 2078 ఆనంద శక సంవత్సరం: 1943 ప్లవ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: మాఘ పక్షం: శుక్ల-శుద్ద తిథి: దశమి ప‌.02:17 వరకు తదుపరి ఏకాదశి వారం: శుక్రవారం-భృగువాసరే నక్షత్రం: మృగశిర పూర్తి యోగం: వైధృతి రా.07:42 వరకు తదుపరి విష్కుంభ కరణం: గరజ ప‌.02:17 వరకు తదుపరి వణిజ రా.03:22 వరకు తదుపరి భధ్ర వర్జ్యం: ఉ‌.10:35 - 12:22 వరకు దుర్ముహూర్తం: ఉ.09:02 - 09:49 మరియు ప‌.12:53 - 01:39 రాహు కాలం: ఉ.11:03 - 12:30 గుళిక కాలం: ఉ.08:11 - 09:37 యమ గండం: ప‌.03:23 - 04:50 అభిజిత్: 12:07 - 12:53 సూర్యోదయం: 06:44 సూర్యాస్తమయం: 06:16 చంద్రోదయం: ప‌.01:43: చంద్రాస్తమయం: రా.02:27 సూర్య సంచార రాశి: మకరం చంద్ర సంచార రాశి: వృషభం దిశ శూల: పశ్చిమం చంద్ర నివాసం: దక్షిణం…
Read More

సంపాదన – ఖర్చు

సంపాదన - ఖర్చు కొందరు డబ్బులు సంపాదిస్తారు, ఆనందం కోసం ఖర్చు పెడతారు. కొందరు ఆనందాన్ని సంపాదిస్తారు. డబ్బులు అవసరానికి ఖర్చు పెడతారు. - బి.రాధిక
Read More