Month: June 2022

దేవుడు ఎక్కడ ఉన్నాడు ?

దేవుడు ఎక్కడ ఉన్నాడు ? నేను దేవుడిని మీ స్వార్ధపు కోరికలని తీర్చే దేవుడిని. నేను హిందువులకి ముస్లింలకి క్రైస్తవులకి అన్ని మతాల మనుషులకి ఉమ్మడిగా ఉండే దేవుడిని ...! నాకు ఆకలి లేకున్నా..... పంచ భక్ష్య పరమన్నాలు జీవం లేకున్నా ..... నిత్య అభిషేక అలంకరణలు నా చిరునామా లేకున్నా...... భారీ మసీదులు, చర్చిలు నా శరీరం లేకున్నా......నాపై వజ్ర వైడూర్య ఆభరణాలు ఇవన్నీ నాకు కానుకలుగా ఇచ్చి మీ స్వార్థ కోరికల చిట్టాని నా చెవిలో చెప్పి నాతో ఓ సెల్ఫీ దిగి దానికి భక్తి అని పేరు పెడుతున్నారు. ఎందుకంటే నేను దేవుడిని మీ స్వార్ధపు కోరికలని తీర్చే దేవుడిని...... నన్ను మతాల వారిగా విడగోట్టోద్దు నా దర్శనంకి ఏ నియమాలు పెట్టొద్దు మీ ఓట్లకై నాతో ఈ నీచ రాజకీయాలు చేయొద్దు నా ముసుగులో ఏ తాయిలాలను అమ్మొద్దు ఈ భూత పిశాచులని తరుముతామని నా…
Read More

వేగుచుక్క

వేగుచుక్క వేసారిన మనసుకు నీవేనోయ్ తోడు వెలుగిచ్చే వేకువను కళ్ళ కద్దుకుందాము కలతలు నలతలు కన్నీళ్లు కష్టాలు ఇవి కావోయ్ బతుకంటే మనుషులను గెలిచేటి వానచుక్క నీవయితే తొలగును ఇక వేదనలు కురియునుగా దీవెనలు స్వప్నాలను నేలదింపు ఆనందమునవి ఒంపును నైరాశ్యము తెంపినావ తెప్పరిల్లు బతుకు నావ రేపనే రోజు కన్న నేడులోన సుఖముందోయ్ ఆకలితో అలమటించు జనులెందరొ కనుల ఎదుట ఎదకరిగిన కొంచెమయిన స్పందించవ క్షణమయిన జీవన వనమిక చూడు విరబూయును మానవతను గమ్యాలు గమనాలు గోరింకల గానాలు గతితప్పిన మనసుకవి మౌనభాష్యమై పలుకు అజ్ఞానపు తలుపుతీయ వేగుచుక్క నీవేనయ్యా - సి. యస్. రాంబాబు
Read More

నిరాశ నిస్పృహలకు – జై ?

నిరాశ నిస్పృహలకు - జై ? ఏంటో ఏమో ఏంటో ఏమో అంతా అగాధం జగన్నాధం ఉన్నది. ఏమీ తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నాము ఏం చేయాలో ఎలా చేయాలో ఎలా చేస్తే బాగుంటుంది నాకు ఎవరు చెప్పేవారు లేరు కదా ఎలా ముందుకు వెళ్ళేది ఇలా చేస్తే నేను అనుకున్న పని సాధిస్తానా? ఎలా ఎలా ఎలా ఎలా ఎలా నా మెదడులో ఎన్నో ప్రశ్నలు? మాట మాట్లాడడానికి ఒక మనిషి కూడా లేరు. అసలు ఈ ప్రపంచంలో మనుషులే కరవయ్యారు లేకపోతే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారా అసలు ఏమిటి ఇదంతా అంటే ఈ కారణాల వల్ల అందరూ జీవితాల్లో బిజీ అయ్యారా పొద్దున లేచింది మొదలు ఉరుకులు పరుగుల జీవితాలు అంతా పిచ్చిపిచ్చిగా బ్రతికేస్తున్నారు డబ్బు సంపాదన మీద పడ్డారు. నాకేమో ఇంట్లో ఉండాలంటే పిచ్చి లేస్తుంది ఎటు వెళ్లాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరైనా…
Read More

భానుమీటర్

భానుమీటర్ బద్దకాన్ని మేసిన మాన్సూన్(monsoon) భానుడు నాట్ సో సూన్ అంటూ అమ్మ చాటు అబ్బాయి లా మేఘాల మాటు దాక్కుంటే ఫక్కుమంటూ మబ్బులన్నీ ముందుకుతోశాయి ఉనికి కోసం భగ్గుమనే ప్రతిపక్షంలా మనవాడూ అంతే మూణ్నెళ్ళు చెమటలు పట్టిస్తాడు ఏదో మూణ్ణాళ్ళ ముచ్చట అనుకుంటే పోలా చిటపటలాడటం మానేస్తాం మాయా ప్రపంచం తమ్ముడూ ఏదీ కుదురుగా ఉండదు ఉండవివ్వదు కూడా చూసీ చూడనట్టుగా పొమ్మనే సూరీడు మాస్టారు చెప్పేది యుగాల ప్రయాణం ఆయనిది తత్కాల్ ప్రయాణం మనది కర్మ సిద్ధాంతం ప్రతినిధిలా సాగిపోతుంటాడు కాస్త సాగిలపడి నేర్చుకుంటే గిలగిలలాడం..విలవిలలాడం.. వీణానాదమంతా తీయగా కాలాన్ని గడిపేయొచ్చు.. అదిగో సాక్షీభూతుడు నవ్వుతున్నాడు.. బారోమీటర్(barometer) లా తనది భానుమీటర్ - సి. యస్. రాంబాబు
Read More

మనిషి

మనిషి నీవు సంఘ జీవివి నీ పాత్ర "మనీషి" లా ఉండాలి సమాజంలో.... కానీ! నీవుస్వార్థం నింపుకుని నాకుటుంబం ,భార్య ,పిల్లలు అంటూ కూడగట్టే పనిలో పడి, అవినీతి పరుడు గా మారి సమాజానికి భారంగా పీడకుడువైనావు.... అంతటితో నీవు ఆగవుగా అవినీతి సామ్రాజ్యకుడైన వెంటనే నీకుటుంబంతో పాటు నీకులం గుర్తుచేసుకుంటావు... సామాజిక జీవిగా విచ్ఛినకర ధోరణి మంచిది కాదని విస్మరిస్తవ్.... సమాజ ఐక్యతను విష్మరించి కులకుంపట్లు రాజేస్తావు..... అవినీతి సొమ్ము వెదజల్లి ఎదుటవారి పై దాడులతో విరగబడి పైచాసికాందాన్ని పొందుతున్నావ్..... ఇక నీకు మానసిక సమస్య ఉత్పన్నమై ,పాపభీతి తో కొట్టి మిట్టాడుతున్నావ్. వెంటనే మదిలో నీఆలోచనులు తొలగింపునకు మతం-దేవుడు ని ఎంచు కుంటావు. అచ్ఛట కూడా సక్రమంగా వ్యవహరించలేవు. కారణం నీవు స్వార్థం తో నిండిపోయావ్..... దేవుడు ని నీ కోర్కెలు తీర్చే యంత్రం గా మార్చేసావు. నీ భయం భీతి పోగొట్టుకొనుట కు ఏమీ కోరని దేవుణ్ణి…
Read More

హృదయమా

హృదయమా ఓ, నా హిమ హృదయ మా, నీ మాదిరే, నా ప్రేమ స్వచ్ఛమైన శ్వేత వర్ణము తో కూడిన క్షీరము. నాకు, పట్టదులే నువ్వు నన్ను అశ్రద్ధ చేసినను. ఆది నన్ను మండించుతునే ఉండును నేను మరుగుతూనే ఉంటాను. ఆది పెంచును నా ఆయుష్షు. నన్నిలానే వదిలేయ్. సుఖముగా నుందు. నీవు నన్ను ఎట్లు చేరుదువో అనే వేదన నాది. తేనవైదువో, లవణమై చేరుదువో...............! వద్దు ప్రియా, నాకీ వ్యధ. - వాసు
Read More

భయకరమైన నిజం

భయకరమైన నిజం జలుబు, కారటం,అనే జలపాతాలలొ ముక్కు, కళ్లు ఏకమై హోరు చేస్తాయి. ఆ హోరులో చెవులు గింగురు మంటాయి. గాలి పీల్చలేక నోరు,హోరు పెడ్తుoది. గాలి తక్కువై ఉక్కిరి బిక్కిరైపోతాయి ఊపిరి తిత్తులు. వత్తిడికి గురై ముక్కు ఎర్రబారి మండుతుంది. మధ్యలో తుమ్ము తమ్ముడొచ్చి చిరంజీవి అనిఎవరో ఆనంగవిని, గుండెకు హయ్ చెప్పిపారిపోతాడు. ఈ గొడవలో ఇప్పుడెందుకని దగ్గు ఓపిక లేక ఒకసారి దగ్గి,తగ్గి ఉంటుంది. మెదడు నేను పని చేయను బాబోయ్! అని మొరాయిస్తుంది. మూడు రోజుల్లో అదే ఆగుతుందిలే అంటాడు డాక్టర్. తుడవటం తన పని కాదు,ఎవరి ముక్కు వారే తుడుచుకోవా లంటాడు. ఇదే ఒక భయంకరమైన నిజం 😂😂😂 - రమణ బొమ్మకంటి 
Read More

భయం

భయం అనిశ్చితి గంటలా ఆకాశ యానం అప్పుడప్పుడు భయపెడుతుంటుంది శూన్యంలో బరువును కోల్పోయి భారరహితమైనట్టు ఆలోచనల సంద్రం ఎగసిపడటం ఆపేస్తుంది జ్ఞాపకాలను ఆరబెడతాము సంక్షోభ సందేహల స్నానంతో మనసు ఊగిసలాడటం ఆపేస్తుంది ఎడతెగక సాగే ఎగిరే మబ్బులు ఏ అర్థాలు బోధిస్తాయో కానీ జీవితం చిన్నదని గాలిలో తేలే లోహవిహంగం నేర్పుతుంది వైరాగ్య క్షణాల ఉక్కిరిబిక్కిరి మధ్య లాండింగ్ అనౌన్స్మెంట్ లాగి చెంపమీదొకటిచ్చినట్టు నిన్ను లోకంలో పడేస్తుంది రింగయ్యే ఫోన్ సమస్యల వాకిలిని తెరుస్తుంది మెరుపులు మరకలు మళ్లీ తొలకరి వానలా పలకరిస్తుంటే దేహం పులకరిస్తుంది - సి. యస్.రాంబాబు
Read More

సమాజం

సమాజం ఆ నడి రోడ్డుపై అతని పక్కన నడుచుకుంటూ , ఆమె నవ్వుతూ మాట్లాడుతుంది. అంతే.....! అతని స్నేహితులు కేకలేసి రంకెలేస్తున్నారు. ఆ సమాజం వాళ్ళని చూసి చెవులు కొరుక్కుంటుంది. ఆ పండు ముసలామె బుర్రలో అనుమానం పుట్టలు కట్టేసింది. ఆ పద్దెనిమిదేళ్ల కుర్రాడు , వాళ్లకి చిలుక, కాకి అని పేర్లు పెట్టేశాడు. ఆ ఆలుమగలు సభ్యత , సంస్కారం గుర్చి ఒకరినొకరు బోధించుకుంటున్నారు.....! అక్కడ అందరి కళ్ళు వాళ్ళ వైపే...., ఆ కళ్ళపై అనుమానమనే కరిమబ్బు కమ్మేసింది ఆ మబ్బునుండి ఎర్రటి పదునైన మాటల వర్షం కురిసింది ఆ వర్షపు నీటిని ఒకరినొకరు పంచుకుంటూ , కుటిల దాహాన్ని తీర్చుకుంటున్నారు....! - క్రేజీ కామేష్
Read More

మారిన విలువలు

మారిన విలువలు శాసించు మనిషిని ఆకలి దప్పులు జీవితాంతము అవి వదలకవుండు అవి తీర్చుకొన తాను ఎత్తులు ఎత్తునెన్నో పొట్ట నింపు కొననెపుడు ఉరుకు పరుగుతొ నుండు పొట్ట నిండివాని హోదా పెరగ దానితో పాటు విలువమారు డబ్బు హోదా పదవి మార్చు చుండు విలువ లేనపుడు విలువ నిలువ లేకుండు మంచి పనులు చేయ పెరుగు విలువ చెడు పనులు చేయ తరుగు విలువ మార్పు సహజమని కాలము చెప్పు మారుచుండు విలువలు మనకు తోడుగ - రమణ బొమ్మకంటి
Read More