Month: July 2022

వైద్యులకు వందనాలు

వైద్యులకు వందనాలు ప్రాణభయము చేత పాలించి రక్షించు దేవుడెవ్వరంటు దేవులాడ మేము ఉన్నమంటు మెప్పించిన ట్టియీ వైద్య బృందమునకు వందనములు ఎంతబాధనైన వింతగా పోగొట్టి కన్నతల్లి వోలె కరుణ జూపి తగినమందులిచ్చి తగ్గించె బాధలు వైద్యులార మీకు వందనములు హృదయపూర్వకముగ ఉద్యోగము ను కోరి కొలువునందు జేరి కోర్కె దీర పరులసేవలందు ప్రాణాలు విడిచిన వైద్యులార మీకు వందనములు - కోట
Read More

మన బాధ్యత

మన బాధ్యత నిరక్షరాస్యత నిర్మూలన మన బాధ్యత అక్షరాల అభ్యాసం ఆశ కావాలి ప్రతి ఒక్కరికీ అది మనిషికి హోదా కాదు కావాల్సినముఖ్య మైన గుర్తింపు మాట్లాడేభాష నేర్పును పుట్టుకతో నే కాని చదవటం రాయటం కోసం తరగతి గది అవసరం. భాష ఏదైనా కాని బ్రతుకు ఆసరా కోసం చదవాలి పేదరికం పెను సవాలు అయినా అక్షరాస్యత కూడా అంతే పెద్ద సామాజిక అవసరం. మూఢనమ్మకాలకు మూలం నిరక్షరాస్యత మారని దృక్పధాలకు నెలవు నిరక్ష్యరాస్యత సమయానికి ఆహారం వలె సమాజానికి చదువు అత్యంత అవసరం. స్త్రీ, పురుష భేదాలుగా కాక ప్రాధమిక విద్య ప్రాధాన్యం కావాలి అందరికీ సాంకేతిక ఎంత వున్నా అది అందుకునేందుకు ఆయుధం చదువుమాత్రమే అర్ధం కాని విషయాన్నైనా అవరోధాల భాటలైనా అధిక మించడానికి కావాలి అక్షర చైతన్యం మనిషిమనిషిగాఎదగాలన్నా భావి తరాల భవితవ్యం అక్షరాస్యత అందుకు అవసరం నేటి డిజిటల్ యుగంలో మరీ మరీ మంచిది…
Read More

తేల్చుకోమంటుంది

తేల్చుకోమంటుంది లాలసలో జీవితం కొట్టుకుపోతోంది చిరునవ్వుల పెదవులు కనుల రాయబారాలకు బేరాల్లేవిప్పుడు జీవితసారం వంటి పెద్దమాటలన్నీ పుస్తకాల్లో చేరి ముసుగుతన్నాయి ఒకప్పుడు ఇల్లు వాణిీ నిలయం ఇప్పుడు వినిమయ విలయంలో మోహతిమిరం మాటల గలగలలన్నీ మౌనరాగాలై చరవాణి ఖైదులో బందీలుగా ఉన్నాయి ప్రపంచమిప్పుడు కుగ్రామమే కానీ ఇళ్ళన్నీ ఒంటరి ద్వీపాలు ఎవరింట్లో వారే కాందిశీకులు కలలు, కలతల రాగాలకు సామాజిక మాధ్యమాలే పక్క వాయిద్యాలు లైకులు, షేర్స్, కామెంట్లే కన్నీటిని తుడిచే ఆత్మీయ స్పర్శలు నువ్వు నీ నాస్టాల్జియా చాపల్యమని విసుక్కున్నా సరే మంచికో చెడుకో విశ్రాంతి జీవితాలే ఇప్పుడు విరమణ లేని వాక్యాలై వెలుగుతున్నాయి వృద్ధాప్యం కావ్యం వెలవెలబోతోంది ఒంటరితనం, ఒంటరి ద్వీపాల మధ్య నిరర్థకమై మనసు పరిభ్రమిస్తోంది కాలమంతే కుటుంబ బంధాలకు అడ్డుగోడ కడుతూనే ఎల్లలు లేని సంబంధాలకు సోషల్ మీడియాతో తాపడం చేస్తుంది మెరిసేదంతా బంగారమో కాదో నిన్నే తేల్చుకోమంటుంది - సి. యస్.రాంబాబు
Read More

పంచాంగము 04.07.2022

పంచాంగము 04.07.2022 *_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు* *ఆషాఢ మాసం - శుక్ల పక్షం* తిధి : *పంచమి* మ2.34 వరకు వారం : *సోమవారం* (ఇందువాసరే) నక్షత్రం: *మఖ* ఉ6.07 వరకు తదుపరి పుబ్బ యోగం: *సిద్ధి* ఉ10.31 వరకు కరణం: *బాలువ* మ2.34 వరకు తదుపరి *కౌలువ* రా2.46 వరకు వర్జ్యం: *మ2.31 - 4.11* దుర్ముహూర్తం : *మ12.30 - 1.22* & *మ3.06 - 3.58* అమృతకాలం: *రా12.36 - 2.17* రాహుకాలం : *ఉ7.30 - 9.00* యమగండ/కేతుకాలం: *ఉ10.30 - 12.00* సూర్యరాశి: *మిథునం* చంద్రరాశి: *సింహం* సూర్యోదయం: *5.33* సూర్యాస్తమయం: *6.35*  *స్కంధ పంచమి* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు 
Read More

(ఆ) కలియుగపు మాట

(ఆ) కలియుగపు మాట మౌనాన్ని కప్పుకున్న నేలలా ఒకడు బాధను కప్పుకుంటాడు రగిలే ఆకలి అగ్నిని తనలోనే దాచుకుంటాడు మనుషులంతా ఒక్కటే మనసులే వేరయా! మనుషులు పచ్చగానే ఉంటారు మనసులే ఎండిన బావులు నిర్జీవన వనంలో వర్షపుచుక్క పచ్చదనానికో శ్వాస మనసును తడిపే మానవత్వపు జల్లే జాడే లేకుండా ఉంది హోదాల గోదాలో ఎడతెగని పోరులో ఆఖరి వరకు తకరారు ఇక సాటి మనిషిపై ప్రేమా దోమా జాన్తానై ఇక్కడ దోస్తీ కన్నా దుష్మనీకే విలువెక్కువ ఎవడాకలికి వాడే బాధ్యుడు ఇక్కడ ఎవడాకలి మంటను వాడే ఆర్పుకోవాలి ఇదే 'కలిపురుషుడి' చాటు పద్యం చాటే సత్యం కూడా - సి. యస్. రాంబాబు
Read More

హృదయ చప్పుళ్ళు

హృదయ చప్పుళ్ళు నీవెక్కడున్నావో తెలియదే నాకు....! ఇది ఖచ్చితం. కొన్ని వేల మైళ్ల దూరంలో ఏదో ఒకచోట పెరుగుతున్నావు అందాలను మూటగడుతూ, నా కనులుగప్పి ..............! నీ హృదయ చప్పుళ్లను నేను వినగలను. పెద్ద ధ్వనులతో చేరునవి నన్ను. నా రెక్కలు విప్పి నీ హృదయ సవ్వడులకు లయబద్ధంగా తాండవం చేస్తాను............! ఎగిరెగిరి రావే. బంధించు నన్ను నీ ప్రేమ హస్తాలతో లేదా అస్త్రాలతో బిగుతుగా ...............! నా తాండవము ఆగును కదనే నువ్విట్లు చేసిన త్వరగా! - వాసు
Read More

భూమి గొడుగు ఓజోన్ పొర

భూమి గొడుగు ఓజోన్ పొర (ఆధారం :గూగుల్) ******* అతి నీలలోహిత కిరణాల (ultraviolet rays) నుంచి భూమిని రక్షిణంచగ ఓజోన్ పొర,భూమినించి 25 నుండి 45 కీ. మీ.వరకు గొడుగులా విస్తరించి ఉన్నదని శాస్త్రజ్నుల అంచనా. అది సృష్థి. ఆ కిరణాలు భూమిని తాకిన జీవరాసి మనుగడకు ముప్పు. కిరణజన్య సంయోగక్రియ, స్థంభించిపోయి మొక్కలు పెరగవు.కాన్సర్, కేటరాక్ట్ లాంటి జబ్బులు వచ్చే అవకాశముందని కనిపెట్టబడింది. మనిషి తన మనుగడకు,సుఖం కోసం ఎన్నో పరిశ్రమలు, నెలకొల్పుతూ రసాయన ప్రయోగాలు చేస్తున్నాడు.ఫ్యాక్టరీ వ్యర్ధాలు, వాహనాల కాలుష్యాలు పెరిగిపోయినాయి. వాటివల్ల భూమి,గాలి కలుషితం అయిపోతున్నాయి.అందువలన ఓజోన్ గొడుగికి రంధ్రం ఏర్పడిందని కనుగొన బడింది. ముఖ్యంగా ఎయిర్ కండిషనర్లు, ఫ్రిడ్జిల వలన ఉత్పన్నమయ్యే క్లోరో ఫ్లోరో కార్బన్ ఓజోన్ విచ్చిన్నమౌటానికి కారణం అని రసాయనిక శాస్త్రజ్నులు కనిపెట్టారు. కాబట్టి,మనం కొంత సుఖాన్ని త్యాగం చేసి ఎయిర్ కండిషనర్లు,ఫ్రిడ్జ్లువాడకం తగ్గించి భూమికి గొడుగులాంటి ఓజోన్ పొరని, అతి…
Read More

జీవితం

జీవితం చిదాకాశం నీడలో చిరునవ్వుల గొడుగుతో అనుభవాల బాటలో పున్నమి చంద్రుడిలా సాగిపోవటమే జీవితం ఎదురుదెబ్బలు ఆటుపోట్లు లోటుపాట్లు పలకరింపుల పన్నీరు అన్నీ చూడాల్సిందే మోదఖేదాలను మోయటమే జీవితం కాలం యవనికపై ఎవరి పాత్రను వారు పోషించాల్సిందే కుప్పలు తెప్పలుగా పొట్టతిప్పలు మనసు దొన్నెలో జ్ఞాపకాలు కలిపితేనే తేనె మాధుర్యమై జీవితం అతిథవోలె అవనికి వచ్చినవారం వారాలు, నెలలు కరిగిపోతుంటే కొట్లాటలను కొట్టేసి మాటల కెరటాలుగ మారమనేదే జీవితం - సి. యస్ .రాంబాబు
Read More

తేడా పెళ్లి

తేడా పెళ్లి ఆనాడు                                                ఈనాడు =====                                             ======                          పెళ్లి చూపులు 1 రోజు                                                 1 రోజు                  …
Read More

ఓజోన్ పొరను మనమెలా నాశనం చేస్తున్నాం ?

ఓజోన్ పొరను మనమెలా నాశనం చేస్తున్నాం ? భూగోళానికి రక్షణ మానవాళిసంరక్షణ ఓజోన్ పొర కవచం. మనం చేస్తున్నాము దాన్ని మరీ పలుచన జీవరాశి పోషణ పర్యావరణ పరిరక్షణ కాపాడే భాద్యత మానవులుగా మన కర్తవ్యం వేడెక్కుతున్న భూగోళం అతినీలలోహిత కిరణాలే కారణం ఓజోన్ కప్పివుంటే మనకు ఉండదు ముప్పు ప్రకృతి ఆక్షేపిస్తే ప్రతికూలం కాదా వాతావరణం కాలుష్యం తగ్గించి కాస్తంత అయినా మేలు చేద్దాం ప్రతిఒక్కరి ప్రయత్నం కావాలి ప్రమాణ పూర్వకంగా ప్లాస్టిక్ మాయఅంతా ఇంతా కాదు విచ్చలవిడి వాడకం దుష్పలితాలకు తావు మరి వైపరీత్యం. ఊహించని ఉష్ణము కరింగించును మంచు ఖండాలను గుర్తెరిగి కాపాడే ప్రకృతినే కారుచిచ్చుల వలె కాల్చును మారుతున్న సమతౌల్యం ప్రాణికోటికి ఆధారమైన ఆక్సీజన్ ప్రాధాన్యత తెలిసే కదా కరోనా రూపంలో శాస్త్రజ్ఞులు చెబుతున్నా సామాన్యుడుకూడా పెడచెవిన పెట్టినచో కలిగేది మాత్రం రేడియేషన్ ప్రభావం విశ్వంలోని అనంత శక్తిని రక్షణకవచంలా మాత్రమే ఆలోచించాలిమానవులు కనువిప్పు కలిగినచో…
Read More