Month: September 2022

ఈ పరవశం

ఈ పరవశం మనసు తాకింది ఎక్కడో కలల తీరాన్ని! గుప్పెడు గుండెలోని విప్పిన అంతరంగపు తడిసి ముద్దయిన పరవశం వశంకాని ఆనందం నునువెచ్చని కూనిరాగం ఆశల సన్నివేశాల కదలిక నయనానందకర దృశ్యాలు తన్మయత్వపు తరంగాలు నింగికేసిన చూచిన వైనం నాదస్వరమయిన హృదయపు సరాగం అద్భుతాల హరివిల్లు లో మునకలేసిన మురిపెం మంచు ముత్యాల వాన వెన్నెలమబ్బులుకమ్ముకొనగ మచిపోయిన మనోగతం - జి జయ
Read More

ఒక మర్రిమాను

ఒక మర్రిమాను కాలం గడిచిపోతున్నా దేహం విడిచిపోతానంటున్నా నేను ఎవరో తెలియని నేను సందిగ్ధాల కొలనులో ఈతకొడుతున్నాను.. జ్ఞాపకాలను ఊతకర్రతో ముదిమి వయసు డాంబికాన్ని ప్రదర్శిస్తున్నా ఆత్మ, శరీరాల ఘర్షణలో నేను చిక్కుకు పోయింది సైన్సుసిద్థాంతాలపై కర్మ సిద్ధాంతం కర్ర దూస్తుంటుంది పునర్జన్మను పరిహసించే సైన్స్ తన భుజాలపై లోకాన్ని చూడమంటుంది ఎటూ తేల్చుకోలేని నేను ఎవరివైపు ఉండనంటుంది కరిగిపోయే కాలాన్నడగనా తరిగిపోయే వయసునడగనా అక్షరాల చెలిమి,ఆంతరంగికుల కలిమితో సత్యాన్ని అన్వేషించగలనా అప్పటివరకూ దేహాన్ని బతిమాలుకోవాలి..మనసును మారాంచేయాలి అంతవరకు సైన్సు, కర్మ తీరాలను ఒరుసుకుంటూ ప్రవహించే "నేను" అయోమయాల పెద్ద మర్రిమాను - సి. యస్. రాంబాబు
Read More

నీ ఎడబాటు

నీ ఎడబాటు నిమిషాలన్నీ రోజులుగా గడుస్తున్నాయి రోజులన్నీ ఇలా నెలలవుతున్నాయి కరుగుతున్న కాలమంతా భారమవుతుంది నీకై చూసే ఎదురుచూపులు ఆగకున్నాయి మదిలో మెదిలే ఆశలన్నీ నీకోసమే ఎదలోని నా సొదలన్నీ నీ ఊసులే రాస్తున్న ఈ అక్షరాలన్నీ నీ వర్ణనలే భాష చాలక సతమతమవుతున్నా భావం కుదరని లేఖలు రాస్తూనే ఉన్నా ఎడబాటులోని విరహాలను భరిస్తున్నా గతంలోని స్మృతులు కవ్విస్తుంటే నవ్వేస్తున్నా కలకాలం కలసిబతకాలని వేచున్నా సరిగమల గమకాలుగా సాగాలని కలగన్నా సాహిత్యపు లోతులు చూపాలని రాస్తున్నా తోచని రాతలన్నీ నీకే అంకితమిస్తున్నా నిన్నలేని‌ చీకట్లలో బతికేస్తున్నా.. నీ నవ్వుల వెలుగులకై ఎదురుచూస్తున్నా... - ఉమా మహేశ్వరి
Read More

అంతం

అంతం తెలంగాణ పోరు గడ్డ సాక్షిగా తెలంగాణ ముక్తి కోసం అసువులు బాసిన అమరుల గవాయిగా .... అణచబడిన రక్తం వేడెక్కి..... ప్రజావేశం కట్టలు తెంచుకుని.. దొరతనంపై తిరగ బడి.. బాంచెన్ దొర నుంచి దొర ఏందిరో వాని పీకుడేందిరో అని గళమెత్తిన రోజు ప్రజల్లో చైతన్యం కలిగి.. ఒకే మాటపై నిలబడి.. నిజాంను ఎదిరించి... రజాకార్ల అకృత్యాల నుండి..... నిజాం కబంధ హస్తాల నుండి స్వేచ్ఛ పొంది సంద్రపు అలలు ఎగసి పడిన రోజు నిజాం వ్యూహాలు పన్నాగాలను చెల్లా చెదురు చేసి.... నిజాం నిరంకుశత్వానికి రాక్షసత్వానికి ..... మంగళం పాడిన రోజు అణుగు బాటు తిరుగుబాటై సాధించిన విజయం ఆకసాన ఉషా కిరణమై ఎగిరింది తరతరాల దురాగతాలను తరిమి కొట్టగ చేసిన సాయుధ పోరాటంలో ఎందరో వీరుల త్యాగఫలం ఈ దినం మట్టి కోసం భుక్తి కోసం విముక్తి కోసం అసువులు బాసిన అమరులకు జోహార్లు (నేడు తెలంగాణా…
Read More

ఉప్పెన

ఉప్పెన 1) ఆ.వె.    మనిషి పాపములను మన్నించ లేనట్టి    అగ్గి పర్వతములు భగ్గుమనెను    ఊరువాడ యనక ఉప్పెన మాదిరి    అడవులన్ని కాలి అంతరించె - కోటా
Read More

జంట

జంట 1) ఆ.వె.    సంధ్యవేళ యందు సంద్రమందు పడవ    ఊసుపోక జంట ఊసులాడ    ఆకసమున తారలన్ని మెరిసిపోగ    ముద్దు లాడు జంట మురిసి పోయె - కోటా
Read More

సత్యాన్వేషణ

సత్యాన్వేషణ రెక్కల మాటున రంగుల మాటున విన్యాసాల భ్రమరానిది భ్రమణకాంక్షని భ్రమపడుతుంటాం నవ్వుల మాటున క్రీగంట చూపుల వెనక మనిషి తనని తాను దాచుకుంటాడని గ్రహించం భ్రమరం అన్వేషణను పూవు స్వాగతిస్తుంది తేనె తోటి అతిథిని సత్కరిస్తానని తృప్తి పడుతుంది మనిషి నవ్వు స్వచ్ఛమైనదో కుచ్చితమైనదో దగ్గరకొచ్చినా తెలియకపోవచ్చు వాటేస్తాడో కాటేస్తాడో అంతా రహస్యమే మళ్లీ భ్రమరనాదం మోగుతోంది మనసు నిండా కల్మషం లేని కీటకం ఆటంకాల మనిషి కన్నా ఎంతో మిన్నన్న సత్యం తేనె బొట్టులా కారటమే సత్యావిష్కరణ - సి.యస్.రాంబాబు
Read More

సీతాకోకచిలుక

సీతాకోకచిలుక 1) ఆ.వె.    సీతాకోకచిలుక సింగారమంతయు    తీయతేనియలను తీసుకొనుట    రంగు రంగు పూల సుగంధముల జాడ    వెదకి వెళ్ళి తాగు వేగిరమున - కోటా
Read More

మనసు

మనసు మనసులోని మాట మనసు ఓ మనసు ఎందుకు ఎగిరెగిరి పడతావు ఎందుకు నీలోని నీ ఆశలనే నింపుకుంటావు రేపటి నీ తపనాన్ని ఎందుకు జారవిడుచుకోకుండా ఆగుతావు ఎందుకే మనసా ఇంత ఉవ్వవేస్తున్నావు మీ మనసు కనిపించడం లేదా ఇది కాదు అది అవుతుందని రేపటి ఆశతో మీ మనసును ఎగిసి ఎగిసి పడుతుందా రేపటి నీ ఈ స్వప్నాన్ని నిజం చేసుకుంటావా మనసా ఎందుకే నీకింత కలవరం ఎందుకు జరిగేది జరగక మానదు జరగబోయేది ఎవరు ఊహించలేరు ఎందుకే మనసా నీకు ఇంత తొందరపాటు నీ మనసుని వయ్యారాలు ఒలికిస్తూ, సింగారాలు చిలికిస్తూ తత్తర పడుతూ, బిత్తర చూపులు చూస్తూ, ఆ కనులలోని అమాయకత్వంతో ఏదో జరగబోతుందని, జరుగుతుందని, జరగాలని అబ్బ ఆ కన్నులకు ఎంత ఆశ నీ మనసు ఆకాశం ఎగసిపడుతున్న అలలతో రేపటి స్వప్నాన్ని నిజం చేసుకోవాలని ఎదురు చూస్తున్న ఓ పిచ్చి మనసా కాలాన్ని ఆపగలవా…
Read More

అంతా అంతే!

అంతా అంతే! కాలంతో పాటు కాకినాడ మారినట్టే జ్ఞాపకాలూ మారిపోతాయి భావనారాయణుడి గుళ్ళో నిశ్చింతగా గూడు కట్టిన పక్షులు వరి కంకుల కోసం పోయి పోయి వరదలో చిక్కుకున్నట్టు - అంతా అంతే! వెక్కిరించాడంటే సమాజాన్ని వెంకటచలానిదా తప్పు! నేరేడు చెట్టు కింద పళ్ళేరుకుందికి పందెం వేసుకుని పరుగులు పెట్టిన కాలేజీ అమ్మాయిలు ఎందరో నవ్వులన్నీ ఇగిరి పోయి ఉప్పుమళ్ళై పేలిపోయి వంట రుచుల్లో కరిగిపోయారు. వెయ్యగా వెయ్యగా గులకరాళ్ళు నీళ్ళెప్పటికో పైకొస్తాయని వెతుకుతూ వెతుకుతూ వెర్రి కాకులమై ఎండ పడ్డ కలలతో ఎంత దాహంతో ఉన్నాం! ఏమై పోతున్నాం! మామిడి తోటలొదిలేసి ఇసక మేటలొదిలేసి ఓ అయ్య చేతిలో పెట్టి ఇల్లు కట్టుకోమన్నారని కదా ఇంత దూరాలొచ్చేసాం ఏం చేస్తున్నారంటే పిల్లలతో గిన్నెలతో మారు మాత్రం ఏం చెప్తార్లెండి! మన ఆశలు కాలవగట్టు పొలాలు కావుగా ఏటి పొడవుతా పచ్చగా ఏదో ఒకటి పండటానికి! మరెలాగంటే చెప్పలేం. పొడుపు కథలు…
Read More