kota aksharalipi

పందెం

పందెం పందెమంటె నాకు పడదు ముమ్మాటికీ ఆత్మ నిబ్బరమ్ము అసలు గెలుపు పందెమాడువాడు పరువు తీసికొనును పరువు పోయెనంటు పయనమాపు - కోట
Read More

ఎడారిలో భాణోదయం

ఎడారిలో భాణోదయం కలుగు లోనవున్న కనిపెట్టి తీరును భాణుడున్నచోట బతుకుజీవి అరుణకిరణములతొ ఆదరించీతీరు లోకబాంధవుడతి లోచనుండు - కోట
Read More

అనుకోకుండా

అనుకోకుండా డాక్టరవ్వబోయి యాక్టరయ్యానని లోకమనెడి మాట లోకువయ్యె బ్రహ్మ రాసినట్లు బతుకులు మారును మనిషి చేతిలోని మహిమ వలన (గాదు) - కోట
Read More

చిత్ర పద్యం

చిత్ర పద్యం ఏడుగడగ తనను ఏలెడి నాథుడు ఎడముకాగ బెదరి ఏడ్పు నాపి ధైర్యమూని.తిరిగి దరిచేరు నాశతో ఎదురు చూచుచుండె ఏలుననుచు - కోట
Read More

పాపం పసివాడు

పాపం పసివాడు ఆ.వె 1) అందరాని మిద్దె లాకాశ హర్మ్యాలు     ధనిక వర్గమునకు తగిన డాబు     ఆకలి కడుపులకు అన్నము లేకున్న     పెద్ద మేడ నీడ పేదలిండ్లు ఆ.వె 2) బాలకార్మికులకు బాధ్యత పెరిగెను      చట్టమేది దారి చూపదాయె      చెమట కార్చుపనికి చేదు ఫలితమిచ్చె      బాల బతుకు లెంత భారమాయె ఆ.వె 3) కోటి విద్యలన్నికూటికోసమెనని      మట్టి తట్ట చిట్టి పట్టి తెలిపె      ఉడుత సాయమల్లె ఊతమై పసివాడు      అక్కతోడు నిలిచె అన్నమునకు - కోట
Read More

ఉగాది ఊసులు

ఉగాది ఊసులు 1 ఆ.వె ఉప్పు.తీపి.కారముపకారమును చేయు   చేదు.వగరు.పులుపు చేయు మేలు   ఏవి యెక్కువైన ఇక్కట్లు వచ్చును   మితము ఎప్పుడైన హితము గూర్చు 2 తే.గీ. కలిమి లేములు సంతోష కష్టసుఖము    లన్ని అడ్డంకుల మనిషి అధిగమించి    నీరస పడిపోకుండ యెదురు నిలువ వలెను    పారిపోకుండ నిలబడు ఫలితమిచ్చు 3 తే.గీ. పుట్టి నప్పటి నుండియు గిట్టువరకు    నరుని జీవిత మంతయు నాటకమ్ము    కష్ట సుఖములే గాకయు కలిమి లేము    లన్ని కలబోసి వచ్చును అందరకును - కోట
Read More

నాలో నేను

నాలో నేను 1) వృద్ధ గురువులంత ఒకచోట చేరగా     పాత జ్ఞాపకాలు పరిమళించె     అయ్యవారలంత ఆయురారోగ్యాల     సాగవలయు శాంతి సౌఖ్యములతొ 2) ఉగ్రవాదమింత ఉగ్రరూపము దాల్చి      బడుగు వర్గములను బలిని గోరె      బడుగుజీవులనిల బాంబు పేలుళ్లతో      ప్రాణములనుదీయ పాడియగునె 3) పండుగ దినమందు పస్తులుండాలేక      కూలిడబ్బుతోటి కొట్టుకెళ్ళి      ఉప్పు.పప్పునుకొని ఉల్లిపాయడిగితే      ఆకసమునకేగి హాస్య మాడె 4) చెప్పు మాట యొకటి చేసేది వేరగు      నాయకులను నమ్మి నాశ మవకు      గొర్రెమంద రీతి గోతిలపడబోకు      ఎసరు వచ్చినంక ఏడ్చుటేల? - కోట
Read More

ఎదురు చూపులు

ఎదురు చూపులు 1)ఉన్నత చదువులకు ఉద్యోగమొచ్చునని బాధలు పడి చదివి భంగపడిరి ఏడువత్సరాలు ఎదురు చూపులెగాని కోర్కె తీరదాయె కొలువు రాక 2) చూపు కన్న ఎదురు చూపులు కష్టమౌ బంధు జనమును కన భారమగును ఎదురు చూపులంటె ఎంత చిత్రమొగద ఆశ భంగమగును అప్పు డపుడు 3)ఎండకాలమాయె ఏ సీ లు లేవాయె ఉక్కపోత పెరిగి చొక్క తడిసె చల్లగాలి లేక వల్లగాదని యెంచి విసన కర్ర చేత విసురుటాయె - కోట
Read More

అజ్ఞాతం

అజ్ఞాతం అడవులందు గడిపిరగ్నాత వాసులై విరటు గొల్చిమారు వేశములతొ గొప్ప చెప్పుకోక గోప్యము గుండుట పాండు నందనులకు పాడియయ్యె - కోట
Read More