suryaksharalu

నీకై ఎదురు చూసే నీ నేను

నీకై ఎదురు చూసే నీ నేను వర్షిణి ఆఫీస్ నుంచి బయటకు నడిచి వస్తుంటే ఎదురుగా ఒక బొమ్మ ని చూసి ఆగిపోతుంది.. ఇంతలో తన ఫ్రెండ్ వచ్చి ఏమి అయింది అలా ఉండిపోయావు అని అంటుంది... వర్షిణి అలా కాసేపు ఉండిపోయి పరిగెత్తుకుంటూ వెళ్లి తన బ్యాగ్ తడుముతుంది... అందులో నుంచి ఒక కీ చైన్ తీసి చూసుకుంటుంది.. తన కన్నీటికి అంతం లేకుండా ఏడుస్తూ వుంటుంది.. తన ఫ్రెండ్ కి ఏమి జరిగిందో తెలుసుకోవాలి అనుకొనే లోపు తను బయట చూసిన బొమ్మ వర్షిణి బ్యాగ్ పక్కన ఉంటుంది. తన ఫ్రెండ్ కి కళ్ళు తిరిగినంత పని అవుతుంది. వర్షిణి మాత్రం బొమ్మ ని ముట్టుకొనే ధైర్యం చేయలేక అక్కడి నుంచి వెళ్లలేక గతం లోకి వెళ్తుంది... కానీ బొమ్మ వర్షిణి ని వెళ్లనివ్వకుండా ఇబ్బంది పెడుతుంది. అసలు ఈ బొమ్మ కి వర్షిణి సంబంధం ఏమిటో అర్ధం…
Read More

అందమైన శత్రువు

అందమైన శత్రువు నా పరిచయం ఎలా చేసుకోవాలో ఏమి అని చెప్పాలో తెలియటం లేదు. ఎంతమంది లో వున్న ఎంతమందికి తెలిసినా కొందరు స్వార్ధం కోసం ఉపయోగిస్తే చాల తక్కువ మంది నన్ను నన్ను గా నేను ఏంటో తెలుసుకొని ఎదుటి వారికీ అందిస్తున్నారు. ఈ కాలం లో నిజాయతి గా నన్ను వారిలో ఉంచుకొనే వారు కరువై అందమైన అబద్ధం గా నన్ను చిత్రీకరించి ధన మాన ప్రాణాలను తీస్తున్నారు ఇస్తున్నారు అసలు నన్ను తమలో ఉంచుకొని స్వలాభం, స్వార్ధం కోసం ఉపయోగిస్తున్న ఏమి చేయలేని నిస్సహాయస్థితి లో వున్నాను. ఎన్నో ఊహలతో భవిష్యత్తు గురించి కలలతో నాలో ఇమిడిపోతున్న ఎందరినో ఈ మానవాళి లో వున్న కుతంత్ర భావాలతో నన్ను పావుగా వాడుకొని నా విలువ తగ్గిస్తున్నారు. ఎటువంటివారు అయినా ఏదో ఒక సమయం లో నన్ను తలుచుకొని నాకు పెట్టుకొన్న ముద్దు పేరు.. అందమైన శత్రువు ఇంతకీ…
Read More

విలువ లేని భావాలు

విలువ లేని భావాలు అనుభవానికి మించిన ఆలోచన  శక్తి కి మించిన బరువు వివరణ లేని సుఖం అర్ధం లేని ప్రేమ స్వచ్ఛత లేని నవ్వు నలుగురు లేని చావు ఇవి జీవితానికి ఒక విలువ లేని భావాలు. - సూర్యాక్షరాలు
Read More

చెప్పుడు మాటలు

చెప్పుడు మాటలు నీ గురించి ఒకరికి మంచి అని చేరే లోపు నీ గురించి వంద మందికి చెడు గా చేరటమే చెప్పుడు మాటలు. - సూర్యాక్షరాలు
Read More

బ్రతుకు బంధాల విలువ

బ్రతుకు బంధాల విలువ బ్రతుకు భారమైన సాగుతున్న ఈ సాంకేతిక లోకంలో.. బంధాల విలువ బారెడు దూరం పారిపోయే గుండె బరువై.... - సూర్యాక్షరాలు
Read More

చిగురాశ

చిగురాశ నా జీవితగమనం నా కుటుంబ సంక్షేమం పెద్ద విద్యలెరుగని పేదవాడిని.. చిన్న ఆశలు తీర్చుకోలేని చిరుజీవిని.. కుటుంబ భవితవ్యం కోసం బరువులు మోయుటకు సిద్ధం అయిన భువిని.. ఏనాటికి అయినా మనోసంకల్పం తిరునని చిరుఆశ... - సూర్యక్షరాలు
Read More

గమ్యం

గమ్యం నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్య పడే కళ్ళుంటాయి. ఎత్తి చూపే వేళ్ళుంటాయి. వ్యంగంగా మాట్లాడే నోళ్ళుంటాయి. బెదిరావో... నీ గమ్యం చేరలేవు. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు. కష్టం ఎప్పుడూ వృధా పోదు.   - సూర్యాక్షరాలు              
Read More

కలగంటి

కలగంటి నిను దరిచేర నిదురించితిని నయనజాక్ష.. నీ నయనంబు చూసి అశ్రుధారలాయే నారాయణా.. నీ చిద్విలాస రూపంబు చూడ కలగంటి... నీ రూపు నిలిచే మదిలోన కలత నిదురలో కలగంటి కమలనయన.. - సూర్యక్షరాలు
Read More

అనురాగ సంగమం

అనురాగ సంగమం నీ ఒక చిరునవ్వు తో రాని ఆనందం..! నలుగురు చిరునవ్వులు చిందిస్తే వచ్చే ఆనందమే..! మా అక్షర లిపి కుటుంబ సమూహ సమావేశ అనురాగ సంగమ ఆనంద హేళ...!! - సూర్యక్షరాలు
Read More

విధి వంచితులు

విధి వంచితులు పసిబిడ్డ పురిటిలోనే పక్క కాలువ పాలాయెను ఆడపిల్ల ఆదిలోనే అవని చెంత చేరెను భువిమీద కాలుమోపగా బిడ్డలు అనాధలాయెను ఆలోచనలేని అవకాశవాదుల అత్రములు బిడ్డలను, పెద్దలను విధి వంచితులను చేసి వికృత నాట్యము చేయుచుంటే సమాజము... - సూర్యక్షరాలు
Read More