Month: March 2022

అబ్బి ఆశ!!

అబ్బి ఆశ!! కొమ్మపై నీ కునుకులు ఆపవమ్మా నా పలుకులు వినవమ్మా ఓ, చిట్టి చిలకమ్మా.......! ఆ గుమ్మ నీ మాదిరే అందమైన జాబిలమ్మే! గుమ్మము ఎదురే గాని గమ్ముగ నుండును మహా గడుసే ..! నా ప్రేమ వయస్సు ఒక దినమే, ఈరోజుకి అది నిన్ననే, నేర్పించ వే ఒక లవ్లీ పాట దాన్ని ఎత్తుకుని ముద్దాడుదునే...! అది ఆకుపచ్చని చీర కట్టెనే, సున్నమాయెను నా మనసు. పండునో లేదో నా ప్రేమ యెట్లు తెలుసునే?? నీ ఒక్కపలుకే మమ్ము ఒకటిచేయునే.......! నిన్న రాత్రి నిద్ర లేదే! ఎర్రగ పండెను నా కళ్ళు. పండించ వే నా ప్రేమని నీకిస్తును కోట్ల తాంబూలం! - వాసు
Read More

ఉదయిస్తాం

ఉదయిస్తాం కుర్రకారులం ఈ కారు పిల్లలం.. కలలు బంగారు కలలు కనే కుర్రకారులం... భలే హుషారు పిల్లలం... వేట మొదలయ్యింది.. బ్రతుకు వేట మొదలయ్యింది... పట్టాలున్నాయని బ్రతుకు పట్టాలెక్కాలని అభిలాషతో ఉన్నాం.. తలపట్టుకు తిరుగుతున్నాం... తలపెట్టిన పనులు సిద్ధించాలని... కానీ నిరాశ నిస్పృహ ఒకపక్క నీడలా వెంటాడుతున్నాయి... తల్లిదండ్రులు నెల నెల వారి ఖర్చుకు డబ్బులు పంపిస్తున్న... వాళ్ల కలలు నెరవేరేనా... ప్రయత్నమే సాగిస్తున్న ఫలించిందా కష్టం ఇకపైన... నిరాశ చుట్టుముట్టిన అభిలాష ఒక మూల ఉందిలే... అది తీరే రోజు దగ్గరుoదిలే ... మా శక్తి ఆసక్తి మాకు ఉందిలే... లక్ష్యం నెరవేరే రోజు దగ్గర ఉందిలే... అలసట ఎందుకు అలిసిన గుండెకు ప్రయత్నం అనే ఆశను నింపి లక్ష్యం వైపు పయనిద్దాం... కలలే ఫలించి మనమే ఉదయిస్తాం.... - పలుకూరి
Read More

చేదు

చేదు చేదు అనగానే గుర్తు వచ్చేది వేప చెట్టు . ముక్కోటి దేవతలు ఒక్క చెట్టులో వుంటారు అని అంటారు. అదే వేప చెట్టు చేదుకు ఒక ప్రత్యేకత ఉంది చేదు అనుభవాలతో తీయని అనుభూతులు అందుతాయి అందరికి . మా వేప చెట్టు కథ చేదు అంటే వేప అంటారు కానీ మా వేపచెట్టు మాత్రం నాకు తీపి కన్నా ఎక్కువ విలువ కలది . చల్లని గాలి నిచ్చింది సేద తీరే వారికి హాయి నిచ్చింది. ఆరోగ్యానికి నేస్తంలా వుంది డాక్టర్ అవసరం లేకుండా కాపాడింది. పండగల రోజులు అందరికి పూతనిచ్చింది చెట్టు కింద వనభోజనాలు చేసేము ఇంటికి అందాన్నిచ్చింది బంధువుల మన్నన పొందింది పక్షుల కిల కిలా రావాలను వినిపించింది మా పిల్లలకు చెట్టు నీడన ఆటలు ఇచ్చింది . అమ్మతల్లి అయినవాల్లకి పొత్తిలి అయింది . పల్లుతోముకోడానికి పుల్ల అయింది. వాహనాలు పెట్టడానికి నీడ అయింది…
Read More

చేదు

చేదు నరేందర్ కథ గుర్తుందా అదే అండి మొన్న షుగర్ అని తెలిసిన నరేందర్. ఇప్పుడు అతను ఎట్లాంటి పాట్లు పడుతున్నాడు చూద్దాం ... ఏమండీ లేవండి అంటూ లత నిద్ర లేపే వరకు మెలకువ రాలేదు నరేందర్ కు. ఆకలితో నకనకలాడుతు యెప్పుడూ నిద్ర పట్టిందో గానీ ఇప్పుడు లేచేసరికి సమయం పది దాటింది. అమ్మో నా ఆఫీసు అంటూ గబుక్కున లేవబోయాను అతన్ని అపుతూ లత, మీ ఆఫీసర్ గారు రెండు రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత రమ్మన్నారు గానీ ముందు బ్రెష్ చేసి రండి అంటూ బాత్రూం లొకి నెట్టింది. సరే సరే వెళ్తున్న అంటూ ఫ్రెష్ అయ్యి వచ్చి టేబుల్ ముందు కూర్చున్న నరేందర్ ముందు లత రెండు గ్లాస్ లు పెట్టింది. అవి చూసి అందులో ఉన్న ద్రవాన్ని చూస్తూ ఎంటే ఇది హాయిగా ఏ అట్టో తేకుండా ఇవేంటి అన్నాడు బిత్తర పోయి.…
Read More

పంచాంగము 31.03.2022

పంచాంగము 31.03.2022 *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - శిశిరఋతువు* *ఫాల్గుణ మాసం - బహళ పక్షం* తిధి : *చతుర్దశి* మ12.23 వరకు వారం : *గురువారం* (బృహస్పతి వాసరే) నక్షత్రం: *పూర్వాభాద్ర* ఉ10.38 వరకు యోగం: *శుక్లం* ఉ11.23 వరకు కరణం: *శకుని* మ12.23 వరకు తదుపరి *చతుష్పాత్* రా12.07 వరకు వర్జ్యం: *రా8.16 - 9.53* దుర్ముహూర్తం : *ఉ10.03 - 10.51* & *మ2.54 - 3.43* అమృతకాలం: *తె5.55నుండి* రాహుకాలం : *మ1.30 - 3.00* యమగండ/కేతుకాలం: *ఉ6.00 - 7.30* సూర్యరాశి: *మీనం* చంద్రరాశి: *కుంభం* సూర్యోదయం: *6.00* సూర్యాస్తమయం: *6.09* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు
Read More

యథా బ్రహ్మండం, తదా పిండండం

యథా బ్రహ్మండం, తదా పిండండం పరమాత్మ, ఆత్మ ల యొక్క ఎకైక సృష్టియే ఈ విశ్వరూపం పరమాత్ముని యొక్క దశావతారాలు అదేవిధంగా జీవునికి కూడా దశావతారాలు ఉన్నాయి. పరమాత్ముని యొక్క దశావతారాలు ఏవి అనగా 1.మత్స్యవతారం. 2.కుర్మావతారం. 3.వరహావతారం. 4.నరసింహ అవతారం. 5.వమనవతారం. 6.పరుశురామవతారం. 7.రామవతారం. 8.కృష్ణవతారం. 9.బుద్ధవతారం. 10. కల్కి అవతారం. ఇవి పరమాత్ముని యొక్క దశావతారాలు. అదేవిధంగా జీవుని యొక్క 10 అవతారాలు 1. తల్లిదండ్రుల యొక్క శుక్ల, శోణితములు జీవ కణం గా ఏర్పడడం "మత్స్యవతారం". 2. పిదప తల్లి గర్భంలో ముద్ద గా గట్టి పడి ఇంద్రియాలు గా ఏర్పడడం "కుర్మావతారం". 3. తదుపరి తల్లి యొక్క గర్భ గోళంలో ఒక బంతి వలే రూప క్రియోన్ముఖుడై తిరగడుతుండడం ఇది "వరహావతారం". 4. ఆ తర్వాత తల్లి యొక్క గర్భములో నవ మాసాలు తర్వాత నుండి ఓ భయానక రూపంతో ఉద్బవించడం "నరసింహవతారం". 5. బుడి…
Read More

వగరు

వగరు కచ్చి జామకాయలు, కచ్చి రేగుపళ్ళు ఇంకా పిందెలుగా ఉన్న ఉసిరికాయలు వాటితో పాటు అప్పుడే చిన్నగా కాసిన మామిడి పిందెలు, లేత ఓమన కాయలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో... అయితే మా చిన్నప్పుడు మా ఊర్లోనే ఇంట్లో జామ చెట్టు ఉండేది. జామ చెట్టుకు తెల్లని పువ్వు పూసింది అంటే మాకు చాలా సంతోషం వేసేది ఎందుకంటే నువ్వే కదా చిన్న పిల్ల గా మారి జామకాయ గా రూపాంతరం చెందింది. అది ఎప్పుడెప్పుడు కాయ అవుతుందా అని వేచి చూసే వాళ్ళం అది కాయగా అవ్వగానే వెంటనే తెంపుకొని తలో ముక్క కొరికే వాళ్ళం. మా అమ్మ మాత్రం అలా పిల్లల్ని తినకూడదు అంటూ మమ్మల్ని కాపాడేది అయినా మేము పిల్లలు రావడం ఆలస్యం తెంపుకుని తినేయడమే. ఇక సంతోషి మాత గుడి దగ్గర పెద్ద రేగు పండ్ల చెట్టు ఉండేది ఆ చెట్టు దగ్గరికి ఎవరు…
Read More

పండు వెన్నెల

పండు వెన్నెల పండు వెన్నెల లాంటిది ఆడపిల్ల అందం అంటారు వెన్నలను వర్ణించడానికి పదాలు సరిపోవు కాని పండువెన్నల ను చూడాలన్నా పాత రోజుల పల్లెటూళ్ళ కు వెళ్లాల్సిందే పల్లెటూరి అందాలల్ పున్నమి జాబిలి చెప్పాల్సిందే . ఇప్పటి విద్యుత్ కాంతుల వెలుగులు లేవు కాని గుడ్డు దీపాల వెలుతరు వెన్నలరోజులకోసం ఎదురు చూపులు దీపాలలో నూనె పోయకున్న చిమ్మెలు తుడవక పోయినా వెన్నెల రోజుల్లో పనిలేదు అందులోనూ ఎండాకాలంలో చల్లదనం కోసం ఆరుబయటే అన్ని పనులు నిజంగా చెప్పాలంటే ఆ రోజులు అనుభవిస్తే గాని తెలియదు దాని తియ్య ధనం . పసి ప్రాయపు ఆటలు మనసుకు హత్తకునేలా కల్మషం లేని మనుషులు చెంత చేరే జీవరాసులు పశు పక్ష్యాదులు మూగ జీవాలు ఎండాకాలం ప్రతికొమ్మ ఆకురాల్చి పూత సంతరించు కొని ఆహ్లాదాన్ని పంచుతాయి ఆ అందాలు అనుబంధాలు వేరే రోజులు కరెంటు లేని రోజులు పండు వెన్నల కోసం…
Read More

పండు వెన్నెల

పండు వెన్నెల అందరి జీవితాలు నిండు వెన్నెల జాబిల్లి వెలుగుల విరబూయాలి.. జీవితమే ఒక రథచక్రం మనోవాంఛలు తీరాలంటే కృషితో స్వయంకృషితో పని చేయాలి.. పట్టు సలపకుండా పట్టుదల విడవకుండా పోరాడాలి.. ఆటంకాలు ఎదురైనా అడుగడుగున ముళ్ళ బాటలు మన కళ్ళ ముందున్న వెరవక ముందడుగు వేయాలి.. మంచిగా మలచుకోవాలి.. కుటుంబాలను పోషించుకోవాలి.. నిండు వెన్నెల పండు వెన్నెల వెలుగులు తేవాలి.. అందరి బ్రతుకులు పండాలి..   - పలుకూరి
Read More

సొట్ట బుగ్గలు!!

సొట్ట బుగ్గలు!! నడుము వంగిన నాయనమ్మ చక, చక లు, మరి చెంబు నిండుగా నీళ్ళు, ఆరు బయట వేసిన మంచాన్ని చేర ఆరాటము. చల్లని చీకట్లలో నిండు వెన్నెల కాంతులు, చెవికి తాకుతున్న చల్లని చెట్ల గాలులు, మనో గతంలో మెదిలిన పెనిమిటి చిలిపి చేష్టలు, ఆరడుగుల మనవడు చూసు నేమో అని దాచెను సిగ్గుల సొట్ట బుగ్గల చాటున. వెండి కాంతులను జిమ్మిన పళ్ళు ఒక్కటైన మిగలక పాయె. పండిన ఆ పండు తల్లికి మిగిలెను నిండు వెన్నెలల ఊరటలు. - వాసు
Read More