Month: March 2022

పరమార్థం

పరమార్థం చిరునవ్వు మెరిసే తెల్లని ముత్యమై ఆనందం ఆకుపచ్చని వసంతమై ఉత్సాహం ఉప్పొంగే నీలి కెరటమై ఉల్లాసం పసుపు వర్ణ పతంగమై కేరింత అరుణారుణ కిరణమై సంతోషం ‌విరిసే ఇంద్ర ధనుస్సై హోళీ కేళిలో ఈర్ష్యా ద్వేషాలు ధ్వంసమై విశ్వానందం చిందులేయాలి వసుధైక కుటుంబమై అందెల రవళి వినిపించాలి.... - దేవా
Read More

మా ఊరి పండగ

మా ఊరి పండగ అందమైన మా ఊరి లో వసంతం లో హోలి అంటూ కల్మ షాలు లేని అందరోక్కటిగా ఆడు కునే రంగుల పండగ ఉట్టి మీద పెరుగు తిని ఊరంతా తిరిగి తిరిగి ఊరి బయట మోదుగు చెట్టు బడిడారిన వెదురు బొంగు సమకూరిన పరికరం సంతసించిన మది కొసుకొచ్చిన పువ్వులు కోరిచేసిన రంగులు పన్నీటి జల్లులు కాదు మరిగించిన కాషాయ నీళ్ళు లోటల్లో నింపుకుని ఉరికి ఉరికి చల్లుకొని బావిలోని నీళ్ళు లేదంటే పేడ ముద్దలు అమ్మ ఆజ్ఞ వరకే ఆడిన రోజులూ మధురమైన భక్ష్యా లు మా కోక్కటి అనుకుంటూ మరునాడు బడికెళ్లి న రంగు ముఖం అదే ఆనందపు అనుభూతి ... - జి జయ
Read More

నీ ఋణము తీర్చలేనిది!!

నీ ఋణము తీర్చలేనిది!! చేర్చితివి నన్ను ఓ, నది ఒడ్డుకు, నా దాహార్తిని తీర్చ. ఒడ్డు నెక్కెను ఇట్లు నా దప్పిక. నా క్షుద్బాధ నెఱింగి పంచ భక్షాలను నుంచితివి నా అక్షి కి చేరువన. నిన్ను ఆర్ధించకనే, నేను బిక్షువు నైతిని. పాదాచారి నే నేను కానీ పరుగులెడుతూ ఉంటిని. నాకు చెట్టునీడ వై చలువ నిచ్చితివి. నేను ఇట్లు విలవిల నైతిని, నీ విలువ నాకు వెల లేనిదని తెలిసెను. ప్రియ మాయే నా ఊపిరి నాకు. కష్టమయ్యే నా శ్వాస నాకు. నీ ఋణము తీర్చ మళ్ళీ జన్మిస్తా నీకోసం. - వాసు
Read More

హొలీ ఎందుకు జరుపుకుంటారు?

హొలీ ఎందుకు జరుపుకుంటారు? హోలీ ప్రతి ఏటా ఫ్హాల్గుణ మాసం లో వస్తుంది. రాక్షస రాజు అయిన హిరణ్యకశిపుడు కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు.  నిత్యం విష్ణు నామస్మరణలో ఉన్న ప్రహ్లాదుడుపై కోపం పెంచుకున్నాడు హిరణ్యకశిపుడు తన సోదరి హోళికా పిలిచి ప్రహ్లాదుడిని తీసుకొని అగ్నిప్రవేశం చేయమన్నాడు. ఆమెకి లభించిన వరం ప్రకారం ఆమెను అగ్ని ఏమి చెయ్యదు అన్న ఆజ్ఞ తో, బాలుడు అని చూడకుండా ప్రహ్లాదునితో కలిసి అగ్నిగుండం లోకి వెళుతుంది. అయితే తన భక్తులను ఎల్లవేళలా కనిపెట్టుకొనే ఆ పరమాత్మ మౌనంగా ఉండగలడా... ఆ చిద్వినస్మూర్తి వెంటనే ఆ బాలుడికి మంటలు తాకకుండా అనుగ్రహించారు. వెంటనే ప్రహ్లాదుడు మంటల నుండి సురక్షితంగా బయటికి వచ్చాడు. కానీ, హోళికా మంటలకు ఆహుతి అయి ప్రాణాలు విడిచింది. మీకు ఒక సందేహం రావచ్చు హోళికాకు వరం ఉందిగా అని కానీ ఒంటరిగా అగ్ని ప్రవేశ చేస్తే తనకు వరం లభిస్తుంది.…
Read More

సంసార రథం

సంసార రథం శకట చక్ర కరణి సాగాలి ముందుకు పడ్డ శ్రమను సమము పంచుకుంటు భార్య వలన భర్త, భర్త వలన భార్య ఇరువురు సుఖపడుదు రిహము లోన - కోట
Read More

జన్మిస్తా నీ కోసం…

జన్మిస్తా నీ కోసం... నీవే ఊపిరిగా... నీవే గమనంగా... నీవే జీవంగా... నీవే స్వరంగా... నీవే తలంపుగా... నీవే గగనంగా... నీవే శ్వాసగా... నీవే సుగంధంగా... "జన్మిస్తా నీ కోసం" - నారాయణ
Read More

ఓయ్….

ఓయ్.... నీ పలకరింపు పారవశ్యం! నీ పిలుపు తనువంతా పులకరింపు! నీ ప్రేమ జన్మ జన్మల బంధం అందుకేనేమో వీడని ప్రణయమోహనం లతలా అల్లుకుని లేలేత చివురులు చిగురిస్తుంది - దేవా
Read More

ఆనంద రంగేళి

ఆనంద రంగేళి రంగు రంగుల పండగోయమ్మ చూడరమ్మ ఈ ఆనంద హేలీ పులుముకున్న రంగేలి ఇది అందరోక్కటై సందడి చేసే వావి వరుసలు లేని సరసం సంబరమే అంబరమాయే రంగు లన్ని చల్లుకోని చెంగు చెంగు న ఎగిరే కాదా హంగులన్ని కలుపుకోని ఉల్లాస మే పంచుకొని గుండెల్లో వేడుక మ్మా బంధాల సండదమ్మా చిందులేసే పండుగా సరదాల సందడే చిన్న పెద్దా తేడా లేని ఆడుకునే ఆనంద హోలీ కలగలుపు మనుషులంతా మమతల హోలీ కాదా ... - జి జయ   ఈ కవితని జయ గారి వాయిస్ లో వినాలనుకుంటున్నారా? https://youtu.be/ioj82GpHd5Q
Read More

మధురం

మధురం జగత్తు లోని మహిమే మకరందపు మాధుర్యం రసాస్వాదన ఓ మధురం అమ్మ లాలిపాట మధురం మృధు భాషణం మధురం నయనానందకర దృశ్యం ఓ మధురం పవిత్ర ప్రేమను పంచే హృదయం ఓ మధురం ప్రతిస్పందించే స్పర్శ ఓ మధురం అలరించే ఆట పాట ఓ మధురం రమణీయ దృశ్యం కమనీయ కావ్యం ఓ మధురం పరవశించే ప్రకృతి పరుగులు తీసే జలపాతం ఓ మధురం శ్రేష్ఠ మైన క్షీరం చిన్న నాటి జ్ఞాపకాలు ఓ మధురం తీయని కలలు వూహించని స్వప్నం ఓ మధురం క్షమించే క్షణం వేచి చూచిన ఫలితం ఓ మధురం నీకు తెలియని నిజం నీ భావనే నిజమైన మధురాతి మధురం. - జి జయ
Read More

అక్క-కోట్ల సంపద లెక్క

అక్క-కోట్ల సంపద లెక్క నా దృష్టిలో అక్క అంటే.... మనం పుట్టిన క్షణం నుంచి తోడుండే తొలి నేస్తం తన తమ్ముణ్ని ఎవరూ ముట్టనివ్వని తియ్యటి స్వార్థం మా తమ్ముణ్ణి ఆడనిస్తేనే నేను ఆడతాను అని జట్టు కట్టగల ప్రేమ తమ్ముడి కోసం తనకు ఇష్టమైన వాటిని వదులుకోగల త్యాగం తాను ముందు నడుస్తూ మనకు దారి చూపే మార్గదర్శి మంచి, చెడులు వివరించి మంచిదారిలో నడిపించే బాధ్యత. మన బలాలు, బలహీనతలు తెలిసిన స్నేహితురాలు. మనం తప్పు చేస్తే ప్రశ్నించే అధికారం అక్క అంటే. తప్పులు మన్నించి దగ్గరకు తీసుకునే మమకారం మన విజయాలకు పొంగిపోయే అభిమానం కష్టాల్లో నేనున్నాను అని ఆదుకొనే ధైర్యం. రాఖీ కట్టినా, యమ ద్వితీయకు భోజనం పెట్టినా తమ్ముడి క్షేమం కాంక్షించే చల్లని దీవెన. తమ్ముడి ఇంట వేడుకను అంతా తానై నడుంకట్టి జరిపించే సందడి. వదిన వచ్చాక అన్న మారిపోతాడేమో కానీ, తాను…
Read More