Month: March 2022

విజయాల శిఖిపించమౌళి

విజయాల శిఖిపించమౌళి తెలుగు సినిమా మార్కెటింగ్ పొటెన్షియల్ తెలిసిన వాడు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. సినిమా ప్రమోషన్లు ఆయన తర్వాతే ఎవరైనా. ఆయన కెరీర్ పరిశీలిస్తే స్టూడెంట్ నంబర్ వన్,సింహాద్రి చిత్రాలు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ కి గట్టి పునాది వేశాయి, ముఖ్యంగా సింహాద్రి. అలాగే రాంచరణ్ కెరీర్ కు మగధీర ఒక బిగ్ లీప్. ఇప్పుడు ఈ ఇద్దరితో వస్తున్న బిగ్ లీగ్ సినిమా ఆర్.ఆర్.ఆర్. ఆయన ఊహలు కూడా అనూహ్యంగా ఉంటాయి. స్వాతంత్ర సమరయోధులు కొమరం భీం,అల్లూరి సీతారామరాజు లను కలిపితే ఎలా ఉంటుందన్న ఊహ అభినందనీయమే అయినా అది తెరపై ఎలా ఆవిష్కరించబోతున్నాడు అన్న కుతూహలం అందరికీ ఉంది. కానీ హిందీలో బాహుబలికి వచ్చిన క్రేజ్ కనబడటం లేదు. ఒకక్కొరికి ఒక్కో స్త్రెంత్ ఉంటుంది. టెక్నికల్ గా అత్యున్నత నైపుణ్యం,మంచి బాణీలు,నేపథ్య సంగీతం,నటీనటుల ఎంపిక రాజమౌళి ప్రత్యేకత. పంచ్ లు ప్రత్యేకంగా కనిపించవు కానీ,ఆడియన్స్ పల్స్ తెలిసినవాడు.అందుకే ఎక్కడా…
Read More

దోమ (నవ్వొస్తే 👏 కొట్టండి 😂)

దోమ (నవ్వొస్తే 👏 కొట్టండి 😂) ఒక దోమ : ఈ మనుషులు చూడు మన సంగీతానికి మైమరచి ఆనందంగా ఎట్లా చప్పట్లు కొడ్తున్నారో! మరోదోమ : నీ మొహం! ఆ చప్పట్లు ఆనందంతో కాదు చూడు మన వాళ్ళు ఆ చేతుల మధ్య ఎట్లా నలిగి పోతున్నారో! మొదటి దోమ : ఆ!అవునా! - రమణ బొమ్మకంటి
Read More

హృదయ దేవత

హృదయ దేవత మబ్బులు కమ్మిన కారుచీకటి లాంటి నా జీవితం ఆశ నిరాశలతో గమ్యం తెలియని బాటసారిలా సాగుతున్న నా జీవన యాత్రలో.... కారు చీకట్లను చీల్చుతూ జగతికి ఉషస్సులు పంచిన రవి కిరణంలా నా జీవితంలోకి వేగుచుక్కలా ప్రవేశించిన ఓ దృవతార.... నా వెన్నుతట్టి నేనున్నానంటూ బతుకుపోరులో బాసటగా నిలిచి సంసార నౌక సాఫీగా సాగించిన వేళా.... సరిగమల సయ్యాటలే కాదు అప్పుడప్పుడు కారాలు మిరియాలు నూరిన ఉరుములు మెరుపులు మెరిసిన నిప్పులపై ఉప్పుల చిటపటల సవ్వడి సాగిన కస్సుబుస్సుల కలహలేన్నైనా పాలమీది పొంగులాంటి సన్నివేశాలే.... కష్టాలైనా నష్టాలైనా కలసి సాగడమే ధ్యేయంగా మా జీవిత నౌకకు చుక్కానిలా మార్గనిర్దేశం చేస్తూ నన్ను విజయ తీరాలవైపు నడిపించిన వేళా జీవితం రంగుల హరివిల్లుల విరబూసిన వేళా ఏలా దాచుకోను నా అనుభూతిని ఏలా చెప్పను నా హృదయ స్పందనను... ఈ ఆనందపు అనుభూతిని నా హృదయంలో గుప్తంగా నిక్షిప్తమై నా…
Read More

కవి (కనిపించని విలువ)

కవి కవులు గుర్తింపబడని శాసనకర్తలు అన్నారెవరో! కాని ' క 'అనగా కనిపించే 'వి' అనగా విజ్ఞత       కలవారు కవులు      కవులు భూత భవిశ్వత్      వర్తమానములలో జీవించగలరు     అన్నికాలములను ఒడిసిపట్టి      తనమనమందు నిలుపుకొని      'అక్షరంగా 'మార్చి 'లిపి'ద్వారా అందించగలరు వందేమాతరం రచించిన బంకించంద్ర చటర్జీ జనగణమన అను జాతీయ గీత రచయత , రవీంద్రనాథ్ ఠాగూర్ మన రాష్ట్ర గీత రచయిత మా తెలుగు తల్లికి మల్లెపూదండ, శంకరంబాడి సుందరచారి వీరందరూ మన మనసులలో నిలిచి గుర్తింపబడిన శాసన కర్తలు. వీరేకాక       ఎందరో మహాకవులు అందరికీ వందనాలు                                            …
Read More

అజ్ఞాతం

అజ్ఞాతం నిన్ను నువ్వు తెలుసుకోలేనంతకాలం... నిన్ను నువ్వు గుర్తించలేనంతకాలం... నీకో గుర్తింపుని... నీకో గౌరవాన్ని... నీకు సమాజంలో ఓ స్థాయిని... నీకు సమాజంలో విలువని... నిన్ను నీవు తెలుసుకునేలా... నిన్ను నువ్వు గుర్తించేదిగా... నిన్ను నీకు పూర్తిగా పరిచయం చేసేది... ఇతరుల స్వభావాన్ని తెలియపరిచేది... - గోగుల నారాయణ
Read More

అజ్ఞాతం

అజ్ఞాతం పేరు లేని సంతకం అజ్ఞాతం అజ్ఞానం వీడితే అజ్ఞాతం అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంది. అజ్ఞాతం సరికొత్త జీవిత కోణం. అజ్ఞాతంలో రాత్రి ఎండలు పగలు చీకటిగా ఉంటుంది కాల నిర్ణయం లో తలుపు తెరిచిన ఘటన చేదునిజంలాంటి అజ్ఞాతం కారణాల కలతలు నిన్నటి అనుభవాల రేపటి అజ్ఞాత పాఠాలు అజ్ఞాన తిమిర సంహారాలు సావధానపు సమీకరణం అలల తాకిడికి అలజడి చేసిన సంద్రం ఏశాస్త్రము భోదించని గ్రంధం అజ్ఞాతం సత్య సాధనలో అజ్ఞాతం కనివిని ఎరుగని తెలియని పునర్జన్మ - జి జయ
Read More

అజ్ఞాత వ్యక్తి

అజ్ఞాత వ్యక్తి కొన్ని రోజులుగా నేను చెప్పుకోలేని ఒక సమస్య తో బాధ పడుతున్నా... అదేవరికి చెప్పుకోలేని సమస్య ఎలా ఏం చేయాలో అర్థం కాలేదు. నెలాఖరు రోజులు ఎవర్నీ అడిగినా డబ్బు సాయం అందడం లేదు. అడిగితే లేదనే సమాధానం కన్నా అడగకుండా ఉండడమే మంచిది అని ఎవర్నీ అడగలేదు.కానీ సమస్య తీవ్రత ఎక్కువ అవుతుంది. ఏం చేయాలి తెలియక నా సోషల్ మీడియా తెరిచాను. నాకు మొక్కలంటే చాలా ఇష్టం. ఇంట్లో పెంచాలని ఎప్పటి నుండో అనుకున్నా, అందుకోసం అంతకు ముందు నా సోషల్ మీడియా అకౌంట్ లో అడిగాను. ఫలానా మొక్క కావాలని, తర్వాత నేను అది పట్టించుకోలేదు నా సమస్య వల్ల, అయితే నేను నా అకౌంట్ తెరవగానే ఒక సందేశం, ఆ మొక్క నేను పంప లేను కానీ అందుకు అయ్యే డబ్బు సాయం చేయగలను అంటూ ఒకరు మెసేజ్ చేశారు. నా సంతోషానికి…
Read More

కళ్ళగంతల జీవితం!!

కళ్ళగంతల జీవితం!! రావు గారు ప్రముఖ వ్యక్తి. సంఘంలో గొప్ప పేరుంది. మృదుభాషి. ఆయన కాళ్ళు బయట పెడితే చాలు, నవాబు నుంచి గరీబు వరకు గౌరవంతో నమస్కరిస్తారు. ఆయన ప్రసంగాలను ప్రవచనాలు గా భక్తితో వింటారు, జనాలు. ఎన్నికలు వస్తే చాలు పార్టీలు ఈయన ఇంటి చుట్టు తిరుగుతాయి. కారణం ఆయన ఓ రెండు మాటలు మైకు పట్టుకుని చెబితే ఓట్లు రాలుతాయి అని. ఆ రోజు సాయంత్రం 6:30 కావస్తోంది. ఒక్కడే గుడిలో నేలపై కూర్చుని ఉన్నాడు. తనలో తాను ఏదో మదనపడుతూ ఉన్నాడు. ఏదో చెయ్యకూడని తప్పు చేసినట్టు అపరాధి లా ఉంది ఆయన ముఖం. "దేవుడా ఈ పాపిని క్షమించు. నా విజ్ఞత నన్ను కళ్ళు ఉన్నా గుడ్డివాడిని చేసింది. నాది విలాసవంతమైన జీవితం. పెద్ద ఇల్లు, కారు, పేరు, బ్యాంకులో మూలుగుతున్న కోట్ల డబ్బులు. అవన్నీ ఈరోజు నిష్ప్రయోజనంగా గోచరిస్తున్నాయి. ఈ పాపికి ఏదైనా…
Read More

అజ్ఞాతం

అజ్ఞాతం అజ్ఞాతంలో వెళ్లేది అవకాశాల కోసమే చిన్న విరామం మాత్రమే... అజ్ఞాతమనే అంధకార చీకట్ల ముసురు బ్రతుకుల నుండి పాఠాలు నేర్చుకోవడం.. అజ్ఞాతం అనేది మౌనానికి ఒక ప్రతీక అది ఒక గంభీరం.. అజ్ఞాత వాసం చేసిన పాండవులు సహితం సంక్లిష్టమైన అది మహాభారత యుద్ధ విజయానికి అది ఒక ఉపకరణం.. అజ్ఞాతంలోకి పోవడమనేది మనశ్శాంతి.. అది మళ్లీ కొత్త శక్తిని క్రోడీకరించి బాహ్య ప్రపంచంలోకి కొత్త వెలుగులు ప్రసరింప చేయడానికి... అజ్ఞాతం అనేది పిరికితనం కాదు.. పిడికిలిబిగించినడానికి.. కొంత సమయం తీసుకోవడమే దాని ముఖ్య ఉద్దేశం.. - పలుకూరి
Read More

పంచాంగము 24.03.2022

పంచాంగము 24.03.2022   విక్రమ సంవత్సరం: 2078 ఆనంద శక సంవత్సరం: 1943 ప్లవ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: ఫాల్గుణ పక్షం: కృష్ణ-బహుళ తిథి: సప్తమి రా.01:54 వరకు తదుపరి అష్టమి వారం: గురువారం- బృహస్పతివాసరే నక్షత్రం: జ్యేష్ఠ రా.07:22 వరకు తదుపరి మూల యోగం: సిధ్ధి ఉ.07:27 వరకు తదుపరి వ్యతీపాత రా.తె.04:34 వరకు తదుపరి వరీయాన్ కరణం: భద్ర ప‌.03:13 వరకు తదుపరి బవరా.01:54 వరకు తదుపరి బాలవ వర్జ్యం: లేదు దుర్ముహూర్తం: ఉ.10:20 - 11:09 మరియు ప‌.03:12 - 04:02 రాహు కాలం: ప‌.01:53 - 03:25 గుళిక కాలం: ఉ.09:19 - 10:51 యమ గండం: ఉ.06:17 - 07:48 అభిజిత్: 11:58 - 12:46 సూర్యోదయం: 06:17 సూర్యాస్తమయం: 06:27 చంద్రోదయం: రా.12:36 చంద్రాస్తమయం: ఉ.10:51 సూర్య సంచార రాశి: మీనం చంద్ర సంచార రాశి: వృశ్చికం దిశ శూల:…
Read More