Month: March 2022

పలకరింపు

పలకరింపు కాలం కన్నిరై కరుగుతుంటే... కవ్విస్తున్న కోరికలన్నీ సమిధలై కాల్చేస్తుంటే... నన్నిలా నేనిలా ఓదార్చకుంటుంటే... నేనున్నానమ్మా అంటూ ఆప్యాయంగా నీ పలకరింపు, నాకెంతో ఆశ కలిగించింది. - భవ్య చారు
Read More

చెరువు -కల్పతరువు

చెరువు -కల్పతరువు మా ఊరి చెరువు -తలతల మెరయు మా బ్రతుకు తెరువు -ఈ కల్పతరువు మా చెరువు. నిండితే... సాగు భూములకు -తాగు జీవులకు జలచరాలకు -జగతి ప్రాణులకు పాడి పంటలకు -పళ్ళతోటలకు మత్స్యకారులకు -మనశ్శాంతికి ఆటపాటలకు -ఆహ్లాదానికి విహారయాత్రకు -విందులందుటకు పొద్దు పొడుపులకు-పొద్దువిడుపులకు ప్రగతి రథాలకు -పరిశ్రమలకు పంచభూతముల-ప్రపంచ శాంతికి కష్ట జీవులకు -కళ్యాణాలకు లోకంవిడిచిన -సమస్తజీవికి మా ఊరి చెరువు -మా కల్పతరువు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా - కోట
Read More

ఆశ

ఆశ 1) విశ్వమందు వున్న నశ్వరమంతకు     ఫలితమందజేయు ప్రతిభ వున్న    ఆశచేత నరులు అవని నాశము జేయు    సర్వజీవరాశి జచ్చుచుండె 2) ఆశ శక్తినిచ్చు అందలమెక్కించు     ఆశ పట్టు పెంచి హాయినిచ్చు     ఆశమేలు కొలువు అత్యాశ కీడౌను     తెలిసి నడచు కొనుము తెలుగు బిడ్డ - కోట  
Read More

పగలు, ప్రతీకారాల విస్ఫోటనం

పగలు, ప్రతీకారాల విస్ఫోటనం కొందరి పుస్తకాలు సమీక్షించాలంటే స్థాయి సరిపోదు. శక్తి చాలదు. అలాంటి రచయితల్లో యండమూరి వీరేంద్రనాథ్ ముఖ్యులు. టాక్ తో సంబంధం లేకుండా మాస్ సినిమాకు కలెక్షన్లొచ్చినట్టు ఆయన పుస్తకమేదైనా హాట్ కేకులా అమ్ముడుపోవాల్సిందే. ఈమధ్య ఎక్కువ నాన్ ఫిక్షన్ రచనలపై దృష్టిపెట్టిన ఆయన ఓ నవలను ఈమధ్యే పాఠకులకు కానుక చేశారు. ఆ నవల *నిశ్శబ్ద విస్ఫోటనం*. అప్పుడే రెండో ఎడిషన్ కూడా వచ్చేసింది. విమర్శకులెప్పుడూ యండమూరిని సీరియస్ గా తీసుకోలేదు. ఆయనా వీరిని పట్టించుకోలేదు. పాఠకుల అభిప్రాయాలే గీటురాయిగా ఆయన భావిస్తారు. ఆశ్చర్యంగా *నిశ్శబ్ద విస్ఫోటనం* నవలపై పాఠకుల నుంచి మిశ్రమ స్పందనలొచ్చాయి. అవేమీ రెండో ఎడిషన్ ని ఆపలేకపోయానుకోండి. అది వేరే విషయం. ఆయన నవలలు వెండితెరపై చూడటానికన్నా చదువుకోవడానికి హాయిగా ఉంటాయి. ఈ నవల కూడా ఆ కోవకు చెందిందే. యండమూరి నవలల్లో హీరోయిన్ 'ఐక్యూ' ఎక్కువ. ఇక్కడ కూడా హీరోయిన్ ఎత్తులకు…
Read More

ఆశ

ఆశ పుట్టినప్పుడు నడవాలని నడవలప్పుడు పరిగెత్తాలని పరిగెత్తడప్పుడు నింగికి ఎగరాలని దొరకే దాని కోసం ఆరాటం దొరకని దానికోసం పోరాటం దొరికిన నిరుత్సాహం నీకు నచ్చింది వస్తే సంతోశాలు నీకంటే ఎక్కువ వస్తే వారి మీద దుఃఖాలు అసలే లేదనని తెలుస్తే ఏడ్పులు మనిషి మాట నాకే కావాలి అంత అసలు ఏమి తీసుకొనిపోను అని తెలియలేననంత తెలిసినా వినలేనంత చివరిలో పోటీపడాలి నలుగురు నీతో రానిది నీ సంపాదన వచ్చేది మంచి చెడులు ఇవే ఆస్తిలు అవే నీ అంతస్థులు ఓ మనిషి - శ్రావణ్
Read More

రేపుందో లేదో

రేపుందో లేదో వంటరినయానని నీరసంగా నడుస్తుంటాను తుంటరి కుర్రాడొకడు నాన్నని విసిగిస్తుంటాడు చిలిపి ప్రశ్నలతో బాల్యం గొప్పది, వృద్దాప్యం చెడ్డదని చికాకుపడతాను ! వయసైపోయిందని కుర్చీలో జారగిలబడతాను వయసైపోయినా యాభైఏళ్ళుగా ఒకే ధరకు ఇడ్లీలమ్మే ముసలావిడ వీడియో గూగుల్ చూపిస్తూ ఉంటుంది ఆలోచనలో పడతాను! రిటైర్మెంట్ తర్వాత ఏంచేస్తున్నావని జాలిగా అడిగేవారిని ఓదార్పుగా అడిగేవారిని చూసి భగభగమంటాను లోలోపల కద్రి గోపాలనాథ్ శాక్సోఫోన్ మాండలీన్ శ్రీనివాస్ కృతులు, జతులు మనసు తలుపు తడుతుంటే ఆశ్చర్య పడతాను! కరిగిపోయే జీవితానికి జడత్వం ఎక్కడ పరుగులు తీస్తుంది నడకలు సాగిస్తుంటుంది వెంట వెళ్ళటం నేర్చుకో బుజ్జగించే మనసుకు క్షమాపణలు చెప్పాను రేపుందో లేదో ఎవరికెరుకని లోకాన్ని కొత్తగా చూడటం మొదలెట్టాను - సి.యస్.రాంబాబు
Read More

ఆశ

ఆశ ఈ రెండు అక్షరాల వరమే దేవుడిచ్చిన బలం ఆశే జీవన రాగం శ్వాస నే బ్రతుకు ఆశ ఆశను ఆశ్రయిస్తే అంతులేని ఆనందం ఆశే మిత్రుడు ఆశే వెంటాడే శత్రువు ప్రతిరోజూ ఆశే బ్రతకడానికి చిగురాశ కోరుకున్నది జరగాలని ఆశ ఆలోచనల మీమాంస ఆశకు అదుపు వుంటే గతి తప్పని గమ్యం అది ఆశయాల ఒడ్డుకు ఆశతో దాటాలి తీరని ఆశ కాకుండా తీరాల వరకు పరుగెత్తా లి కనిపించని దూరాన్ని నడిపించే నీ దారే ఆశ మితిమీరిన ఆశే అన్నీ దూరం చేస్తుంది సుమా తస్మాత్ జాగ్రత్త ...... - జి జయ
Read More

ఆశ

ఆశ మధ్యతరగతి వారి జీవితమే ఓ ఆశ... జీవన పోరాటాల మధ్య ఎడతెగని మెలిమి ఓ ఆశ... నిన్నటిని వదిలి రేపటికై ప్రయాణంలో నేటి భౌతికస్థితియే ఓ ఆశ... ఆలోచనల సంగమాల యుద్ధంలో తనే గెలుస్తూ నిరాశల ఉత్సాహాన్ని మరిపిస్తు ముందుకు నడిపించేది ఓ ఆశ... జీవితాన్ని నిలబెట్టేది ఆశే జీవితాన్ని కడవరకు కొనసాగించేది ఆశే నిన్నటిని గెలిచేది కూడాను ఆశ - గోగుల నారాయణ
Read More

నీ కోసం

నీ కోసం కానరాని చీకటేదో మనసు లోతుల్లో దాగుతుంటే, కన్నీరు సంద్రమై, మానసోక నావలా పరుగెత్తమంటుంటే, కాలం మూడిందంటూ కళ్ళముందు కదలాడుతుంటే, జీవన గమ్యము ఏమిటో తెలియనిస్థితిలో, కబోధిలా వెతుకుతున్నా రంగుల లోకంలో.. నీ కోసం..... - భవ్యచారు
Read More