Month: June 2022

జోక్ – అరేంజ్డ్ లవ్ మ్యారేజ్

జోక్ - అరేంజ్డ్ లవ్ మ్యారేజ్   రాము : నీది అరేంజ్డ్ మ్యారేజా!లవ్ మారేజా! సోము : నీది రాము : ఆరేంజిడే సోము : నాది ఆరేంజిడ్ లవ్ మ్యారేజ్ రాము :🙄 - రమణ బొమ్మకంటి 
Read More

లంచగొండితనం

లంచగొండితనం లంచగొండి తనం నష్టం ఎవరికి తప్పు అని తెలిసి చేసే అతి పెద్ద తప్పు లంచం తీసుకోవడం ఇవ్వడం. ఈ విషయానికివస్తేఅందరికీ నష్టమే అని చెప్పాలి దేశంలో జీవించే ప్రతి పౌరుడు చట్టాలకు గౌరవించి పని చేయాలి చేస్తున్న వృత్తిని భాద్యతగా నిర్వహించాలి. అందులో భాగంగా లంచం తీసుకున్న వారికన్నా ఇచ్చే వారికన్నా సమాజం నష్టపోతుంది. అందరమూ అందులో భాగమే కదా అవినీతి లేని దేశాన్ని నిర్మించు కోవాలంటే మొదటిది లంచగొండి తనం కు స్వస్తి పలకాలి ప్రచారంగానే మిగిలిపోయి అవగాహన లేక ఆచరణ కావడము లేడు . ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా నష్టం కలిగిస్తుంది అది ఒక్కో సారి పూడ్చలేని వ్యవహారం గా పనిచేస్తాయి అన్యాయానికి చోటు క్రమశిక్షణ తగ్గుతుంది భద్రత కు బరోసా ఉండదు ఆర్థికంగా చితకటం హక్కులు కోల్పోవడం మానవ సంబంధాల కు చెడు జరుగుతాయి వ్యతిరేక భావనలు వృద్ది చెందుతాయి, ప్రజల నమ్మకము కోల్పోవడం,…
Read More

సోషల్ మీడియా లో వార్తలు

సోషల్ మీడియా లో వార్తలు సోషల్ మీడియా లో వార్తలు ఎంతవరకు నిజం ఆకట్టుకునే అర్థాలు ఆదాయం కోసం వ్యూహాలు అర్దం తెలియని సమాధానాలు అంతుచిక్కని ప్రశ్నలు చతికిలబడ్డ విలువలు సందేహం తీర్చని వార్తలు సరిదిద్దని సమస్యలు సంకోచాల సంక్లిష్టం నమ్మలేని నిజాలు నమ్మేవారికి మోసాలు భయపెట్టే భాష్యాలు ఆశపెట్టే అవకాశం మెరుపు తీగ ముచ్చట్లు రంగులు మార్చిన రాతలు రాజకీయాల కోణాలు సరికొత్త సన్నివేశాలు మెదడుకు మేత పెట్టని విషయాలు వ్యతిరేక ప్రచారాలు వాస్తవానికి దూరంగా చికిత్స చేయలేని రోగంలా సాక్షం లేని సంగతులు సమర్దించ లేని లోపాలు సాయం కాని సలహాలు అస్త్ర శస్త్రాలు అనుకుని ప్రస్తుత సమాజాన్ని పాలించి పీడిస్తున్నాయి నిజా నిజాలు తెలుసుకోలేని సమయం లేని రోజులు కాబట్టి ఎవరికి వారుగా నిర్ణయించు కుంటున్నారు దిశా నేర్దేశాలను ఇది సమాజానికి హానికరం......? - జి జయ
Read More

భయంకరమైన నిజం

భయంకరమైన నిజం అతి భయంకర నిజం ఏమిటి అంటే మనిషి మరణిస్తాడు అని తెలిసి జీవించడం. మనిషికివిచిత్రమైన శాపం తప్పించుకోలేని నిజం ఆపలేని కర్మము కరిగిపోతున్న వయస్సు మారిపోతున్న కాలం తీరని రుణం జ్ఞాపకాల పొరలు విలువైన సమయం బంధాల బంధీలుగా సృష్టించిన సృష్టిలో మనసు పలికే మారణహోమం శత వసంతాల సంబరం ముగుస్తుంది అని తెలిసికూడా నమ్మలేని భయంకర నిజాన్ని నిర్భయంగా నిరీక్షిస్తూ చిరాయువులుగా కాకుండా చిరస్మరణీయు లుగా మిగులుతారు. ఇదే సృష్టి లో భయంకర మైన అతి పెద్ద నిజం........? - జి జయ
Read More

ఉచ్చు

ఉచ్చు గగనసీమల్లో కదిలే మేఘాల్లా ఆలోచనల శకలాలు అందని తాయిలాలకు వలవేస్తుంటాయి కదలని శరీరం కాంక్షల కొలువై అర్రులు చాస్తుంటుంది వదలని గతంలా స్వగతం మొడుతూ ఉంటుంది మాయల ఉచ్చు మెడకు బిగుస్తూ ఉంటుంది మాటల గారడీలాంటి లెక్కేదో మనసు చేస్తుంటుంది చివరకు మిగిలేది నీ ఒంటరితనమే అని తేల్చేస్తుంది గగనం శూన్యమయితేనేమి గమకాలు పలికించటం మాననట్టే ఆలోచనల శకలాలు ఆవేదనల హలమై అక్షరసాగు చేస్తే గాడి తప్పిన మనసును ఏ గారడీ ఉచ్చు ఏమీ చేయలేదు - సి. యస్. రాంబాబు
Read More

భయం – అభయం

భయం - అభయం బతుకును శ్వాసిస్తుంటాను బంధాల బాటను బాగుచేయమని భయాన్ని ద్వేషిస్తుంటాను నిరాశను సాగుచేస్తుంటావని ఆశను ప్రేమిస్తుంటాను రేపటి దారి చూపకపోదా అని పేరాశను గమనిస్తుంటాను చొరబడితే జ్వరపడతానని కాలం ఇంద్రజాలాన్ని ప్రేమిస్తుంటాను చిక్కుముడులను చూలాగ్గా విప్పుతుందని మనసుకు ఎంతో నప్పుతుందని మారే మనిషి భయపెడుతుంటాడు వంటరి ద్వీపమై వెలుగుతు స్వార్థానికి సమిధై ద్వేషయజ్ఞం చేస్తున్నాడని విద్వేషాల వీధుల్లో మనిషే కాలిపోతుంటే మనసు వాలిపోతోంది ఏ భయం భయపెడుతుందిక ఏ అభయం కనపడుతుందిక - సి. యస్.రాంబాబు
Read More

అవని

అవని భూమి, నేల, వసుమతి, పుడమి, ధరణి ఏవైనా నీకు పేర్లు అనేకం ఉండుగాక.... నీవు పకృతి సృష్టివై ముక్క గా విడి ,చల్లార్చబడి, అనంతకోటి జీవరాసులకు నిలయమై ఖండాలుగా విభజితమై ఉన్నావని..... నీవు మేము విశ్వసించే మత గ్రంధాలప్రకారం దైవం చే విశ్వంలో సృష్టించడి ఖండాలుగా విభజితమై జీవకోటి సంరక్షణిగా ఉన్నావని.... మనుషులు గా మేము నీ పై భిన్న అభిప్రాయాలు కలిగి నివశిస్తున్నది వాస్తవమని ఎరిగి,నీవు ఈ విశ్వంలో ఒక గ్రహమని వేల ఏళ్ల క్రితమే తెలుసుకుని , మాతోపాటు అనంతమైన జీవరాసులు కు నీవే ఆధారమని గ్రహించి జీవనం కొనసాగిస్తున్న తెలివైన జీవులం.... నీపై గలప్రకృతి ఒక జీవనగతి అందు విద్య, వైద్యం మేమందుకొని మనోవికాసులమై ,ఆరోగ్య వంతులమై, అందు అందచందాల అనుభూతి పొందుచూ, అందు అన్నిటి పై ఆదిపత్యం సాధించి,శోధించి ,ప్రకృతి సంపద కొల్లగొట్ట నారంభించి,దుష్ట ఆలోచనా పరులమై నీవందించి ప్రకృతి నాశనం చేయ, మేమే…
Read More

గాలిపాటొకటి

గాలిపాటొకటి నాన్న తెచ్చిన తాయిలంలా వర్షంతో వచ్చే గాలి అపురూపం అల్లరి మేఘాలను అమ్మలా జోకొడుతుంది ఎండదెబ్బకు శోషొచ్చిన నేలను తడిమే తల్లిదీవెనై చుట్టేస్తుంది వేడిగాలులన్నీ వేయించేయగా ఏసీ గూళ్ళలో దాక్కున్న ప్రాణాలకు ప్రాణనాధుడిలా వేంచేస్తుంది ప్రభాతం భూపాలం కలిసిపోయినట్టు వర్షం, వర్షపు గాలి శ్రుతిలయల్లా కలిసిపోయింటాయి చెక్కుల సంతకాలే కాదు చెట్లపై గాలిసంతకాలనూ వెతుకుతూ ఉండాలి గాలిపాటొకటి నా వెంటే వస్తుంటే వెనక్కి తిరిగాను అమ్మ జ్ఞాపకాలన్నీ నాముందు కుప్పపోసింది - సి. యస్. రాంబాబు
Read More

అవని

అవని అవని పొరల్లోఅంకురించిన ధాన్యము ఆహారమై జీవనానికి సాక్షీభూతము అదిఒక పంచభూతము అవనివొడిలోసేద తీరుతారు అందరు. ఆరాధించిన మనకిచ్చును అద్భుత ఫలాలు అవని లోనే పులకరించే ప్రకృతి సంపద అదే మానవుని మనుగడ జీవరాశి పోషణే నీ భారం ఓర్పుతో మోసేటి గొప్పతనం అంతు లేని సంపదలు అందించే సామర్థ్యం నీ గర్భం. అన్నీఇమిడిఉన్నరహస్యము నీ సొంతం. నీతో ముడివడిన ఈబంధం గడ్డి పరక అయినా గతించిన కాలమైనా అన్నీనీ చెంతకుచేరాల్సిన దే అదేఅవని అనంత శక్తి......? - జి జయ
Read More

లంచగొండితనం (అవినీతి)

లంచగొండితనం (అవినీతి) 1) లంచమిచ్చుకుంటె లక్షణంబుగ పోస్టు    వచ్చి తీరుతుంది నచ్చినట్లు    ప్రతిభ గలిగి యున్న పనికి రాడు బీద    నెహ్రూ కలలుగన్న నేలయందు 2) బడుగు జీవులెన్ని బలియైన సర్కారు    సొమ్ముకమ్ముడయ్యి కొమ్ముకాయు    లంచమిచ్చుకుంటె మంచియౌ దోషాలు    కేసువీగిపోవు కాసువలన 3) వంద మార్కులొచ్చి వాజమ్మగా నిలిచె    సగము మార్కులొచ్చిచవట గెలిచె    ప్రతిభ ఉన్నవాన్ని పట్టిచంపుచునుండె    లంచమివ్వకుంటె వంచనాయె 4) అర్థమందు ఆశ అన్నివిధాలుగా    నరుని పాతరేసి నష్టపరచు    లంచగొండితనము లాంచనమయ్యేను    కవుల గోసగాదు కంఠశోష 5) ఏ ప్రభుత్వమైన నెంతకాలముండు    అంతమగు నధర్మ మధికమైన    ప్రజలు ఎదురుతిరిగి పట్టుబట్టిననాడు    ఘడియలోన రాజు గద్దెదిగును - కోట
Read More