Month: February 2022

వాగ్దానం

వాగ్దానం రెండు జీవితాల ప్రయాణం... కుటుంబ ప్రమాణాల ప్రయాణం... మరోనిండు జీవితానికి స్వాగతం... జీవి మనుగడకు సమాధానం... ప్రమాణం చేసి మరచుట ప్రమాదం... ఆ ప్రమాదం రెండు జీవితాల అగమ్యగోచరం... ప్రమాణం చేసి మరువకు... ఇచ్చిన మాటకై నిలబడు... జీవితాన్ని నిలబెడుతుంది ప్రమాణం... - గోగుల నారాయణ
Read More

భీమ్లా నాయక్ రివ్యూ

భీమ్లా నాయక్ రివ్యూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మెయిన్ క్యారెక్టర్స్ లో నటించిన, అయ్యప్పన్ కోషియం అనే మలయాళం సినిమా కి రీమేక్ సినిమా అయిన భీమ్లానాయక్ ఎలా ఉందో చూద్దాం. కథ:- పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ కర్నూల్ డిస్ట్రిక్ట్ లో ఎస్సై లాగా పని చేస్తూ ఉంటాడు. డ్యూటీని దైవంగా భావిస్తూ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ గా ఉంటాడు. తనకి భార్య ఒక చిన్న పిల్లాడు కూడా ఉంటాడు. ఒక రోజు తను ఫారెస్ట్ చెక్పోస్ట్ దగ్గర పని చేస్తూ ఉంటే, కార్లో మందు తాగి డానియల్ శేఖర్ (రానా) ఒక రిటైర్డ్ ఆర్మీ మ్యాన్ అక్కడికి వస్తాడు. నిజానికి అక్కడికి మందు నాట్ అలౌడ్. మందు తాగి రావడమే కాకుండా తన కార్లో చాలా మందు బాటిళ్ళు దొరుకుతాయి. అందువల్ల భీమ్లా నాయక్ శేఖర్ ని అరెస్ట్ చేస్తాడు. ఈగో హార్ట్ అయిన శేఖర్…
Read More

పంచాంగము 25.02.2022

పంచాంగము 25.02.2022 *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - శిశిరఋతువు* *మాఘ మాసం - బహళ పక్షం* తిధి : *నవమి* ఉ11.31 వరకు వారం : *శుక్రవారం* (భృగువాసరే) నక్షత్రం: *జ్యేష్ఠ* ఉ11.00 వరకుయోగం: *వజ్రం* రా11.03 వరకు కరణం: *గరజి* ఉ11.31 వరకు & *వణిజ* రా10.20 వర్జ్యం: *సా6.26 - 7.55* దుర్ముహూర్తం : *ఉ8.45 - 9.31* & *మ12.36 - 1.23* అమృతకాలం: *తె3.22 - 4.51* రాహుకాలం : *ఉ10.30 - 12.00* యమగండ/కేతుకాలం: *మ3.00 - 4.30* సూర్యరాశి: *కుంభం* చంద్రరాశి: *వృశ్చికం* సూర్యోదయం: *6.26* సూర్యాస్తమయం: *6.01* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు 
Read More

కౌగిలి

కౌగిలి ఈ కరోనా ప్రపంచాన్ని ఆపింది, ఎక్కడి వారిని అక్కడే ఉండేలా చేసింది కాలాన్ని ఆపేసింది. కన్నీటికి  కారణం అయ్యింది. ఆకలి కేకలు పెట్టించింది కూలిలకు పని లేకుండా చేసింది. వేల ఉద్యోగాలను తీసింది. రైళ్ళు, బస్సులు,ప్లేన్స్ ని ఆపింది. అన్ని సరిగ్గా ఉన్నా అవిటివారిని చేసింది, కళ్ళున్నా గుడ్డి వారిని చేసింది, కూలి చేసుకుని పొట్ట పోసుకునే వారికి అది కూడా దొరక్కుండా చేసింది. ఉన్నవాడు, లేని వాడు, రాజకీయ నాయకుడు, డాక్టర్, సినిమా యాక్టర్, లాయర్, జర్నలిస్ట్, డ్రైవర్,పేద, గొప్ప అనే తేడా కనికరం ఏమి లేకుండా అందర్నీ అంటుకుని తన వారెవరో పరాయి వారెవరో తెలిసేలా చేసింది. ఎంత ఆస్తులున్నా బంగారం భూములు ఉన్నా, ఖరీదైన బట్టలు వేసుకున్నా, చినిగిన చీర కట్టుకున్నా అందరికి కావలసింది చివరికి చేరేది కాటికే అని తెలిపింది. ప్రపంచాన్ని స్థంభింప చేసింది. కాలం ఆగిపోయింది, సమయం కదలలేక పొయింది. వలస వచ్చిన…
Read More

ఆరాధన

ఆరాధన అదో చిన్న గ్రామము. బొగ్గు పొయ్యిలపై వంట చేసే సాంప్రదాయము. అప్పటికింకా గ్యాస్ పరిచయం కాలేదు. అందుకే జనాలకి గాసిప్స్ ఆలవాటు కాలేదు. అలమరికలు లేకుండా మాట్లాడేసుకునేవారు. ఇప్పుడు మనకి ఆకాశం అంటే ఒక్కటే కాని ఉదయం పూట మాకు రెండు ఆకాశాలు దర్శనము ఇచ్చేవి. ఒకటి దైవికమైనది. రెండోది మానవికమైనది. ఉదయాన్నే కొన్ని వందల ఇండ్లలో వాకిట్లో బొగ్గు పొయ్యిలు పెట్టేవారు. మా చిన్నారి జీవితాలకి ఆ చిన్నారి ఆకాశం మాకు ఇప్పటికీ తీపి గుర్తుగా ఉండిపోయింది. మా తండ్రి గారిది ప్రభుత్వ ఉద్యోగం. వారు కేటాయించి ఇండ్లలోనే ఉండాలి. అన్ని ఒకే మాదిరిగా రైలు బోగీల్లా విచిత్రంగా కనబడేవి. నేను, నా తమ్ముడు జంట కవులం, చిలిపి చేష్టలకి చిరునామా మా ఇల్లు, కర్ర బిళ్ళ ఆడుతూ, రాయమల్లమ్మ అనే ఒక ఆవిడది గుండు పగలగొట్టాం. ఆమెదే అదృష్టమో ఈ సంఘటనకి ముందు రోజు గుండు కొట్టించుకుని…
Read More

‘నీ’ దే గుర్తింపు

'నీ' దే గుర్తింపు నీ కట్టుబాట్లు చూస్తే, నీ మాతృభూమి గుర్తుకురావాలి. నీ మాట వినిపిస్తే, నీ మాతృభాష తెలుసుకోవాలి. నీ పలకరింపుతో, నీ తల్లిదండ్రుల సంస్కారం గుర్తించాలి. నీ తెలివి తేటలు చూసి, నీ గురువులను పొగడాలి. నీ అలవాట్లు, లక్షణాలలో  నీ వ్యక్తిత్వం కనిపించాలి. - రాధికా.బడేటి
Read More

కౌగిలి

కౌగిలి మిద్దెలు మేడలు లేకున్నా  నీ నులి వెచ్చని కౌగిలి చాలు  అన్నది ఒక నెచ్చెలి  హృదయపు వాకిలిలో పరచుకున్న  పచ్చని పైరు లాంటి ఒక  అనుభూతి   హృదయ స్పందనల  అందమైన అల కౌగిలి  నీ బాధను ఓదార్చే ఇంకొక  హృదయమే ఓదార్పు కౌగిలి  నిన్నుచూసి పులకించే ఆ ఎదయే ఆత్మీయ కౌగిలి  నే ప్రయాణపు క్షేమం కోరేది  ఆశీస్సుల కౌగిలి   నువ్వే ప్రాణమని నమ్మేదిఅనుబందపు  కౌగిలి  నా కళ్ళని నేనే నమ్మలేని  సందర్భం ఆశర్యపు కౌగిలి  నీవే గొప్ప అని అన్నది ఒక మమత అభినందన కౌగిలి  నే కొరకై వేచి చూసి ఎదురైంది ఆహ్వనపు కౌగిలి  నిన్ను  నిన్నులా మైమరిపించే ఒకే ఒక్కటి  నీ హృదయపు కౌగిలి స్పందన . - జి.జయ
Read More

తొలి ఐనది లక్షఔనా!!

తొలి ఐనది లక్షఔనా!! ఎంచుడేల తొలి, మలి యని, ముద్దుకి అది ముద్దు కాదు. ముద్దులోన, కౌగిళ్ళలోన బంధిస్తే, అది ప్రేమ కాదు. ప్రేమ అది శరీరాలది కాదు. అట్లనిన, అది నీ హృదయ వక్రము. మనుస్సు బాధ నెరింగి, చుంబించు దాన్ని లక్ష మార్లు. తప్పించు కష్టాల మిద్దె నుంచి. బంధించు నీ కౌగిళ్ల ఆశ్రయమందు. - వాసు
Read More

నాథ నాదం

నాథ నాదం భర్త (వికటకవి) :  ద్వారంబులు మూస్తిని,                        కపిలంబు ఇంట జొచ్చ. భార్య (కవయిత్రి) : నాకు లేని భయంబు,                        నీ కేల నాథా.                        భరించునది భర్త యనియా? భర్త : పీల కపిలంబు నొక్కటి,          నా కలలో జొచ్చె నిన్న రాతిరి.          కనులార నిండిన నా నిద్ర          గాంచెన్ దాన్ని తేరిపార.          భయము నాది,          దాని పీలత్వం యందు.      …
Read More

ఏకదండి, ద్విదండి, త్రిదండి అంటే ఏమిటి?

ఏకదండి, ద్విదండి, త్రిదండి అంటే ఏమిటి? *ఏకదండి, ద్విదండి, త్రిదండి స్వాముల చేతిలో కర్రలెందుకు ఉంటాయో తెలుసా*... 🌿ఆది శంకరాచార్యుల నుంచి నేటి అందరు స్వాముల వరకూ చేతిలో కర్ర ఉండటాన్ని అందరూ గమనించే ఉంటారు. 🌿సవామీజీ అంటే కర్ర పట్టుకోవాలనుకుంటే పొరపాటే.. 🌿దాని వెనుక ఎంత ఆంతర్యం ఉందో తెలుసా... 🌿ఆదిశంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజచార్యులు, జీయర్ స్వాములు మరికొందరు వీళ్లందరి చేతిలో పొడవాటి కర్ర ఉంటుంది గమనించారా? 🌿ఏ సమయంలో చూసినా వాళ్ల చేతిలో ఉంటాయి. 🌿అదేమైనా ఊతకోసమా అంటే కానే కాదు. 🌿మరి ఎప్పుడూ చేత్తో పట్టుకుని ఉంటారెందుకు అంటారా.. 🌿అవి వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత, అద్వైత భావానికి గుర్తు. 🌿ఈ (దండాలు) కర్రలు వివిధ ఆకారాల్లో ఉంటాయి. 🌿అయితే ప్రతి ఆకారానికి ఓ అర్థం ఉంది. 🌿గలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం పంచభూతాల సమ్మేళనమే మనిషి. 🌿కబట్టి సన్యాసులు ఐదడుగుల కర్రను చేతపట్టుకుని తిరుగుతారని చెబుతారు.…
Read More