Month: March 2022

అంతిమయాత్ర

అంతిమయాత్ర ఊరు దూరం కాటి దగ్గర అంటారు కదా మరి జనన మరణాల ఆత్మ డోలాయ మాన మార్గం ఆయుష్షు తీరి ఎవరి కోసం ఎదురుచూడని దారి అది విగత జీవికి మనం ఇచ్చే చివరి నీరాజనం సృష్టిలో జీవిత సమరం ముగిసి కనుమరుగు కు ప్రయాణం అది వొంటరిగా వచ్చి వొంటరిగా వెళ్ళే పాదయాత్ర నీ వాళ్ళు అనుకునే వారికి హృదయ ఘోష అది చేతనత్వాన్ని వదిలి పంచభూతాల సన్నిధికి చేరే అనంత లోకాల అంతిమయాత్ర అది.... -జి. జయ
Read More

నీ కోసం

నీ కోసం మనసు లోని అన్వేషణ నీ కోసం వేచి వున్న పరిచయాల భావన నీ కోసం మదినిందిన ఊహలు నీ కోసం కోటి ఆశల అంతరంగం నీ కోసం కోరికల మూటలైనవి నీ కోసం ప్రేమే సాక్షాత్కరించింది నీ కోసం ఎందరినో వదులుకున్న బంధం నీ కోసం వేచియున్న వేదికైనది నీ కోసం అనురాగాల ఆరగింపులు నీ కోసం ఆరాటాల ఈ పయనం నీ కోసం నమ్మకమే నడిచింది నీ కోసం మనసిచ్చిన నాడే మురిసింది నీ కోసం నీతో నడుస్తున్న ఈ జీవిత పయన మే నిజమని తెలుసుకున్న ఈ భావాన్ని అక్షర సుమాలుగా నీ కోసం నీ కోసం -జి.జయ
Read More

రాధే శ్యామ్ మూవీ రివ్యూ

రాధే శ్యామ్ మూవీ రివ్యూ రాధే శ్యామ్ ఈ సినిమాకి ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. రెండు సంవత్సరాలునుంచీ ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది.. ఒకానొక సమయంలో ఓటిటి లో కూడా వస్తుంది అని అన్నారు. కానీ ఈరోజు నుంచి థియేటర్స్ లో జాతర చేయ్యనుంది రాధే శ్యామ్ సినిమా... మరి ఈ సినిమా ఎలా ఉంది? రివ్యూ ఏంటి? కథ:- విక్రమాదిత్య (ప్రభాస్) ఒక పామిస్ట్. చేతిని చూసి జాతకం చెప్పేయ్యగలడు. అలాంటిది తను ఒక రైలు ప్రయాణంలో ప్రేరణ (పూజా హెగ్డే) ని చూసి ప్రేమలో పడతాడు. ముందు ప్రేరణ ప్రేమని ఒప్పుకోకపోయినా తర్వాత ఒప్పుకుంటుంది. కానీ ఇంటర్వెల్ దగ్గర వచ్చే ఒక్క ట్విస్ట్ తో విక్రమాదిత్య కథ అంతా మారిపోతుంది. ఆ ట్విస్ట్ ఏంటి? విక్రమాదిత్య విధితో పోరాడి ప్రేమని గెలవగాలడా? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే... విశ్లేషణ:- మనం పోస్టర్స్, టీజర్, ట్రైలర్ లలో…
Read More

పంచాంగం 11.03.2022

పంచాంగం 11.03.2022 *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - శిశిరఋతువు* *ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం* తిధి : *నవమి* పూర్తి వారం : *శుక్రవారం* (భృగువాసరే) నక్షత్రం: *మృగశిర* మ1.45వరకు తదుపరి ఆర్ధ్ర యోగం: *ఆయుష్మాన్* రా2.24 వరకు కరణం: *బాలువ* సా5.42 వరకు తదుపరి కౌలువ వర్జ్యం: *రా11.03 - 12.49* దుర్ముహూర్తం : *ఉ8.37 - 9.24* & *మ12.33 - 1.20* అమృతకాలం: *తె5.15నుండి* రాహుకాలం : *ఉ10.30 - 12.00* యమగండ/కేతుకాలం: *మ3.00 - 4.30* సూర్యరాశి: *కుంభం* చంద్రరాశి: *మిథునం* సూర్యోదయం: *6.17*  సూర్యాస్తమయం: *6.04* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు
Read More

చివరి చూపు చివరి భాగం మాయ

చివరి చూపు చివరి భాగం మాయ వాసు కి కనిపించిన ఫైల్ లో ఏముందో తెలుసుకోవాలని అనుకున్నాడు. కానీ బైక్ పై ఉండేసరికి చూడలేక ఇంటికి వెళ్ళి చూడాలని అనుకున్నాడు. వాసు ఇంటికి వెళ్లేసరికి తలుపులన్నీ తీసి ఉన్నాయి. అలా యెప్పుడూ ఉండదు. తల్లి ఎప్పుడూ తలుపులు వేసే ఉంచుతుంది. అమ్మకు ఏమైంది అనుకుంటూ అమ్మా, అమ్మా అంటూ లోపలికి వెళ్ళాడు వాసు. కానీ లోపలి నుండి ఎలాంటి శబ్దం వినిపించడం లేదు. ఎవరు పలకడం లేదు. అరే ఎవరూ లేరెంటి ఎక్కడికి వెళ్లారు అనుకుంటూ నాన్న, నాన్న అంటూ బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు. లోపల బెడ్ రూం లో బెడ్ పైన తండ్రిని పట్టుకుని తల్లి ఓదారుస్తూ ఉంది. అది చూసి ఎంతో ఆశ్చర్య పోయాడు వాసు. ఇన్నేళ్లుగా తండ్రి ఏడవడం అసలు చూడలేని వాసు ఎంతో విభ్రాంతిగా చూస్తున్నాడు ఆ దృశ్యాన్ని. వాసు ని గమనించిన తల్లి…
Read More

చింతపండు చారు

చింతపండు చారు ఆ గ్రూప్ పేరు కార్డ్స్ (CARDS). ఇందులో ఒక్కొక్క అక్షరం ఒక స్నేహితుడి పేరు ని సూచిస్తుంది. ఈ గ్రూపులో కొత్తగా ఎవరు చేరి నా చివరి అక్షరం ఎస్(S), లో కలిపేస్తాము. తర్వాత చేరిన వాళ్ళ అందరి పేర్లు ఈ ఎస్ తోనే ఉండడం విచిత్రం. ఇక మొదటి రెండు అక్షరాల కి వద్దాం. ఇవి రెండూ జీవికా జీవులు. చక్రవర్తి మరియు ఆనంద్. దాదాపు డిగ్రీ పూర్తయ్యేంత వరకూ వీరు ఒకేచోట చదువుకున్నారు. వీరిద్దరే కాదండీ మిగిలిన వారు కూడా చిన్న నాటి నుంచి ఒక చోట చదువుకున్న వాళ్లే. అందరిదీ ఇంటర్మీడియట్ పూర్తయిపోయింది. వీరిద్దరు మాత్రం ఊర్లో కాకుండా వరంగల్ కి వెళ్లి వెలుగ పెడదామని కంకణం కట్టుకున్నారు. మిగిలిన వారు విముఖత చూపడంతో, వీరిద్దరూ వరంగల్ లోని ఎల్బీ కాలేజీ లో చేరిపోయారు. చదువుల్లో వజ్రాలు, దాంతో ఇద్దరికీ మొదటి జాబితాలోనే సీటు…
Read More

మత్తు

మత్తు ప్రేమ బాధను మరిచిపోవడానికి కావాలి మందు మత్తు వైద్యం బాధ తెలియకుండా ఉండడానికి కావాలి మత్తుమందు మత్తు అలసట బాధ పోవడానికి కావాలి నిద్రమత్తు ప్రియుడికి కావాలి ప్రేయసి కౌగిలింత మత్తు - వికృతి
Read More

పంచాంగం 10.03.2022

పంచాంగం 10.03.2022 *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - శిశిరఋతువు* *ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం* తిధి : *అష్టమి* తె4.38 వరకు వారం : *గురువారం* (బృహస్పతివాసరే) నక్షత్రం: *రోహిణి* ఉ11.12వరకు తదుపరి మృగశిర యోగం: *ప్రీతి* రా1.52 వరకు కరణం: *విష్ఠి* మ3.38 వరకు తదుపరి *బవ* తె4.38 వర్జ్యం: *సా5.23 - 7.10* దుర్ముహూర్తం : *ఉ10.12 - 10.59* & *మ2.55 - 3.42* అమృతకాలం: *ఉ7.40 - 9.26* & *తె4.01 - 5.47* రాహుకాలం : *మ1.30 - 3.00* యమగండ/కేతుకాలం: *ఉ6.00 - 7.30* సూర్యరాశి: *కుంభం* చంద్రరాశి: *వృషభం* సూర్యోదయం: *6.17* సూర్యాస్తమయం: *6.04* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు
Read More

మహిళా మేలుకో

మహిళా మేలుకో మహిళల ను చూసే ధోరణి మారాలి.... నాకు భార్య, కూతురు, తల్లీ ఉన్నారు. మన పూర్వీకులు మన మీద ఎన్నెన్నో బలవంతంగా రుద్దారు. కాలానుగుణంగా ఎన్నో మార్పులు చూశాము. ఇంకా చాలా మారాల్సి ఉంది. మగాడికి ఎంత స్వేచ్ఛ ఉందో ఆడవాళ్లకి కూడా అంతే ఉండాలి ఇవ్వాలి. మారాలి లోకం తీరు... ఆడవారిని అర్థం చేసుకుని ప్రోత్సహిస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. సమానత్వం ఎక్కడా లేదు, ఇప్పట్లో రాదు. అభివృద్ది చెందిన దేశాలలో కూడా ఆడవారిని చూసే కోణం లో మార్పు లేదు మగావరి ఆలోచనలలో మార్పు రావాలి. అమ్మాయి అంటే *క్స్ ఒకటే కాదు అని తెలుసుకోవాలి ఐతే *క్స్ లేకపోతే ఇంట్లో అన్నీ సమకూర్చే పని మనిషిలానే చూస్తారు. ఈ జెనరేషన్ లో కొంచం (2%) మార్పు వచ్చింది అని అనుకుంటా. ఉమెన్స్ డే రోజు వాట్సప్ లో స్టేటస్ పెట్టుకోవడం మాత్రమే కాదు, ఆడ…
Read More

ప్రియమైన నా…

ప్రియమైన నా... నిన్ను చూడకుండా ఉండలేను ఒక్కక్షణం నీ స్పర్శ కలిగిస్తుంది నాకు ఆనందం గురువై బోధిస్తావు ఎన్నో దగ్గర అయ్యావు రక్తసంబంధీకుల కంటే నీకు ఏదయినా అయితే విలవిలలాడును నా ప్రాణం నువ్వు క్షణం కనపడక పోతే ఎక్కును నాకు పిచ్చి నువ్వు లేనిదే చేయలేను ఏపని భద్రపరిచావు మధుర సంఘటనలను నాకన్నీ నీవే వీడలేను నిన్ను నీవు లేనిదే నేనుండలేను నన్ను విడిచి వెళ్లవు కదా!!! (ప్రియాతి ప్రియమైన నా మొబైల్) - వికృతి
Read More