Month: March 2022

మహిళా శక్తి

మహిళా శక్తి 1) ఆ.వె.     అబలగాదు మహిళ.ఆదిపరాశక్తి     కరుణజూపుతల్లి.కనకదుర్గ     ఆపదున్న వేళ ఆదుకోజూచును     జాలిగుండె కరిగి.మేలు చేయు 2) ఆ.వె.      వనిత చేతగాని పనిలేదు వసుధలో      నేర్పు.ఓర్పుగలిగి నెలత చేయు      అలసటెరుగకుండు ఆలనా పాలనా      కన్న సంతు సమము కరుణ జూపు 3) ఆ.వె.      నేటి మహిళ లంత మేటిగా పోటీకి      పురుషుల సమమంటు పోరు సలిపి      విజయమందిరి తమ విజ్ఞానమును జూపి      అన్ని రంగములను ఆక్రమించి 4) ఆ.వె.      అంతరిక్షమంత "అవలీల"గా తిరిగి      రణము గెలిచి "రమణి"రాజ్యమేలె      రాజకీయమందు రాణించె "లేమలు"      రాష్ట్రపతిగ "ప్రతిభ"రాణకెక్కె 5) ఆ.వె.     కదనరంగమందు.కడలియంచులయందు    …
Read More

సామాజిక మాధ్యమాల్లో మహిళల ప్రగతి

సామాజిక మాధ్యమాల్లో మహిళల ప్రగతి   సామాజిక మాధ్యమాలు అంటే సోషల్ మీడియాలో మహిళలు ఎంతో ప్రగతిని సాధించారు. అయితే మహిళలు ప్రాచీన కాలం నుండి ఎన్నో వివక్షలు ఎదుర్కొంటున్నారు. పూర్వకాలం లో మహిళలకు చదువు చాలా తక్కువ, ఎక్కడో ఒక చోట రామాయణ, మహా భారతాలు చదివే వాళ్ళు. ఆ తర్వాత కాలంలో యుధ్ధ విద్యలతో పాటు సంస్కృతం నేర్చుకున్నారు. ఆ సమయం లో కూడా మహిళలకు చదువు అవసరం లేదని, చదువుకుంటే ఉన్న మతి పోతుంది అని మహిళల పట్ల ఎన్నో అడ్డంకులు తెచ్చారు ఛాందస వాదులు. ఈ ఛాందస వాదుల నుండి తప్పించుకున్న మహిళలు అంతో ఇంతో చదవడం మొదలు పెట్టారు. కానీ అవి కూడా భక్తి కి సంభందించిన వాటిని మాత్రమే చదివించారు. భక్తిరస పుస్తకాలు రాసిన వారిలో మొల్ల రామాయణము ముఖ్యమైనది. ఇంకా చాలా రచయితలు వచ్చినప్పటికీ మన తెలుగు లో మొల్ల, కృప…
Read More

మహిళ

మహిళ మహిళా ఓ మహిళా బ్రహ్మ కైనా  అమ్మవి నీవే అమృతపు వాక్కునీవే ఆత్మీయత అనురాగం నీవే అన్నపూర్ణ వి నీవే ఆదిశక్తి వి నీవే ఓర్పు నీవే నేర్పు నీవే నవరసాల నాట్యము నీవే పరిమళించే పూవు నీవే ప్రతి ఇంటా మార్గం నీవే అవనిలోనూ అంతరిక్షం లోనూ అరుదైన పాత్ర నీవే ధీర వనిత వి నీవే వీర మాతవూ నీవే వుప్పోంగే కెరటం నీవే ఉలిక్కి పడే గాథ నీదే మారుతున్న కాలంలో కావాలి నువ్వొక మహాశక్తి మహిళా ఓ మహిళా నీ మనుగడే  మానవాళి అద్భుత శక్తి అదే నీలో వున్న దివ్యశక్తి మహిళా ఓ మహిళా  - జి.జయ
Read More

నేటి సమాజంలో మహిళల పాత్ర

నేటి సమాజంలో మహిళల పాత్ర స్త్రీ ఒక శక్తి. ఒక అద్భుతం ఒక సృష్టి రహస్యం. స్త్రీ లేనిది మనుగడ లేదు స్త్రీ లేనిది సృష్టి లేదు స్త్రీ లేనిది ప్రపంచమే లేదు. స్త్రీ అనేది ఒక మహోన్నత శక్తి. భారతదేశంలో మహిళల పాత్ర అనేక గొప్ప మార్పులకు లోనవుతూ వచ్చింది ప్రాచీన కాలంలో పురుషులతో సమాన స్థాయి కలిగి ఉన్న భారతీయ మహిళలు అనేకమంది సంఘసంస్కర్తలు భారతదేశంలో మహిళల తిరిగి వారికి సమాన హక్కుల కల్పన కోసం కృషి చేయడం భారతదేశంలో మహిళల చరిత్ర అనేక సంఘటనల సమాహారంగా ఉంది ఆధునిక భారతదేశంలో మహిళలు దేశ రాష్ట్రపతి ప్రధానమంత్రి లాంటి అత్యున్నత పదవులను అలంకరించారు. ఇలాంటి గొప్ప గొప్ప పదవులను అలంకరించిన మహిళలు ఎన్నో వివక్షలకు లోనవుతున్నరు. అయితే పూర్వ కాలం నుంచి ఇప్పటి వరకు మహిళ రక్షణ లోగానే మహిళల పట్ల చూస్తున్న దృష్టికోణం గానే మారుతూ వచ్చాయి.…
Read More

స్వేదము!!

స్వేదము!! పరుగులు లెడితిని ఎందుకో..........? ప్రత్యర్ధులు లేని, ఈ పందెం లో నేను ఏకాకి అభ్యర్ది నైతిని!! చెంతన ఉన్న చలమ ను వదిలి, ఎండమావి ని చెలి యని యెంచి, పరుగు లెడితిని ఎందుకో.............? భానుడి భగభగ లకి, చెరువుల గుండెలు చెరువు లాయె, ఆవిరైన వాటి స్వేదము, పై, పైకి ఎగబ్రాకె .............................! ఎండమావి ని చెలి అని యెంచి పరుగు లెడి తిని ఎందుకో...,..........? అలసిపోతిని నేను, వర్షమై కురిసే నా స్వేదము . మడుగు చూడ దల్చగా.................! అది ఎండమావితో చేరె .................! - వాసు  
Read More

పంచాంగం 08.03.2022

పంచాంగం 08.03.2022 *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - శిశిరఋతువు* *ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం* తిధి : *షష్ఠి* రా12.511 వరకు వారం : *మంగళవారం* (భౌమ్యవాసరే) నక్షత్రం: *భరణి* ఉ6.42వరకు తదుపరి కృత్తిక యోగం: *వైధృతి* రా1.07 వరకు కరణం: *కౌలువ* మ12.10 వరకు తదుపరి *తైతుల* రా12.51 వర్జ్యం: *రా7.45 - 9.29* దుర్ముహూర్తం : *ఉ8.39 - 9.26* & *రా10.57 - 11.46* అమృతకాలం: *తె6.12నుండి* రాహుకాలం : *మ3.00 - 4.30* యమగండ/కేతుకాలం: *ఉ9.00 - 10.30* సూర్యరాశి: *కుంభం* చంద్రరాశి: *మేషం* సూర్యోదయం: *6.20* సూర్యాస్తమయం: *6.03* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు 
Read More

ఓ చిన్న తప్పు

ఓ చిన్న తప్పు అక్కడ అంతా పండగ వాతావరణం నెలకొని ఉంది. ఎత్తైన వేదిక ముందు కొన్ని వందల మంది గుమిగూడి ఉన్నారు. పామరుల నుండి పార్లమెంటు సభ్యులు వరకు ఏదో ఉత్సుకత తో ఎదురుచూస్తూ నిల్చున్నారు. సాయంత్రం వేళ కావడంతో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన విద్యుద్దీపాలతో అక్కడ పండువెన్నెల కురుస్తోంది. అదో పెద్ద వ్యాపార కూడలి. దాని విలువ కొన్ని కోట్ల లోనే ఉంటుంది. పైగా పట్టణ నడిబొడ్డున ఉంది అది. ఆ ఆస్తులు అన్నిటికీ రంగనాథ్ గారు యజమాని. తాను జీవితంలో కోల్పోయిన దాని ముందు ఇవన్నీ పిసరంత మాత్రమే. ఆరోజు ఏదో ప్రత్యేకత ఉంది. అందుకే రంగనాథ్ గారు ఇంత పెద్ద వేదిక ఏర్పాటు చేశారు. జనాలు ఆయన రాక కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అక్కడ చేరిన వారిలో కొంతమంది సెలబ్రిటీలు కొందరు ఆయన అభిమానులు ఎక్కువ మంది ఆయన వద్ద పనిచేసే ఉద్యోగులు. మంది అధికంగా…
Read More

చావు

చావు చావు ప్రామిసరి పత్రం కాదు తీర్చలేని బాకీ జన్మను అప్పిచినవాడు మృత్యువును పంపాడు మిత్తిని తీసుకరమ్మని వడ్డీ కడుతూ బతుకును ఎంత లాగినా అసలు మట్టికి కట్టాల్సిందే ఎగొట్టలేని ఋణం ఎన్నాల్లకైనా , ఎక్కడున్నా పంచభూతాలకు చెల్లించాల్సిందే కుదువ పెట్టుకోకుండా ఊపిరిని నీ ఖాతాలో జమ చేశాడు గడువు ముగిసింది ఇచ్చేయాల్సిందే. - రాంబంటు
Read More

తపన

తపన నా ముంగిట వాలిన ఓ చిన్నదాన....! ఒక్క క్షణం రెప్పవాల్చగ, మరుక్షణం మాయమై తివి. ఎటు పోయావే...! నా తపన తపస్సు అయ్యే. దర్శనమిచ్చి భగ్నం చేయవే. ఆశ్చర్యం తో నా కళ్ళు నిస్థాణువు లయ్యెను. నా హృదయం నీకై పరికించుచుండెను. ఓ తుంటరి దాన!! నా మనసు ఒలకబోయ ప్రయత్నించెను, రెండే రెండు ప్రేమ పదాలను. ఏ యుగంలోనూ ఎవరు వాడనివేయవి. ప్రేమ లోన. వాటిని దాచితిని నీ కొరకై. తపస్సు భగ్నం చెయ్యవే వేగిరంగా. ఓ నా ప్రేయసి.   - వాసు
Read More

అ – నువ్వు

అ - నువ్వు పాల తరగలి, నురగుల ని నవ్వు. నీలి మబ్బుల అలకనంద నువ్వు. నీటి బిందువు అణువుల అందం నువ్వు. నూరు వరహాల బోమ్మవి నువ్వు . కోటి శతకాల అర్ధం నువ్వు .. తామరాకుపై తెంపర నువ్వు.. గాలిలోని సుమగంధం నువ్వు.. మండు వేసవి చల్లదనం నువ్వు . అంతరంగలోని అద్దం నువ్వు. అర్ధరాత్రి చీకటి నువ్వు .. విశ్వమంత వెన్నెల నువ్వు .. పాపాయి నిదురలోని రాగమాలిక నువ్వు. - రాంబంటు
Read More