Month: March 2022

గాలి నిచ్చెనలు!!

గాలి నిచ్చెనలు!! ఆశ అంబరాన్ని అంటే, అక్షి రెప్పలాయెను, పక్షి రెక్కల తీరు. పద్దు లేని గమ్యం, నీ హద్దు గ మారే. నింగిని చేర నీ రెప్పలు అల్లాడెను టప...... టపా! మబ్బులను మోయ నీ నెత్తి పై, సమాంతర నడకలను ఆపి, గాలి నిచ్చెనలు ఎక్కుతుంటివి నిటారుగా. గగనానికి ఏగిన నీ ఆశలు తీర ఎగబ్రాకిన నీ యత్నాలు అటకను చేర్చి నిచ్చెను నీకు సాఫల్యత!! - వాసు
Read More

స్టార్ హోటల్!!

స్టార్ హోటల్!! పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే ఘట్టం అది. సుమారుగా రాత్రి 8 గంటలకి స్నేహితులందరూ ఒక్కరొక్కరుగా మెల్లగా రావడం పూర్తయింది. అది ఒక హైవే పక్కన ఉన్న చిన్న గుడిసె. అదే ఆ రోజు రాత్రికి మా మకాం. దాన్ని ఒక ముసలాయన నడుపుతున్నాడు. మేము తాత అని పిలుస్తాం. ఆయన ఉదయం పూట ఛాయ్ దుకాణం నడుపుతాడు అందులో. ఆ పెద్దాయనతో మా అందరికీ చక్కటి బంధం ఉంది. జానపద గేయాలు పాడుతూ ఈలలు వేస్తూ నవయవ్వన యువకుడిలా ఉంటాడు ఆ పెద్దాయన. ఇక మమ్మల్నందర్నీ చూడగానే ఆయన ఆనందానికి అవధులు లేవు. తనకి మంచి నేస్తాలు దొరికాయి నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి అని తబ్బి ఉబ్బి పోయాడు ఆ పెద్దాయన. ఇంకా చల్లారని ఆ బొగ్గు పొయ్యి పై శనగలు ఉడక పెట్టేశాడు, మమ్మల్ని చూసి. ఇక రాత్రంతా మజా…
Read More

స్నేహం- నమ్మకం

స్నేహం- నమ్మకం   *పరిచయానికి మాటలు అక్కరలేదు...* *మంచి తనానికి డబ్బు అక్కరలేదు...* *స్నేహానికి బంధుత్వం అక్కరలేదు.* *ఆనందం, నమ్మకమనేవి అమ్మకానికి దొరకవు.* *ఆనందం మనుషులతో పంచుకోవాలి. నమ్మకాన్ని మనస్సులో పెంచుకోవాలి.* - దేవా
Read More

సంఘర్షణ పార్ట్ 3

సంఘర్షణ పార్ట్ 3 సంఘర్షణ మొదటి రెండు భాగాలు చదివిన తర్వాత ఈ భాగం చదవండి. అప్పుడే మీకు మొత్తం అర్థం అవుతుంది. అవసరాలు తీర్చడం కోసం అప్పులు చేయడం సహజం, కానీ ఆ అప్పులు తీర్చే మార్గం ఉంటేనే అప్పులు చేయాలి, ఆ అప్పు భారం కాకూడదు. పస్తులు ఉండి అయినా అప్పులేకుండ చూడాలి. కానీ పంట పండించే రైతు రేపనే ఆశ తో అప్పులు చేసి కట్టలేక అవమానాల పాలు అవుతూ, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు చేతులు కట్టుకుని చిద్యలు చూస్తున్నాయి. అప్పులు తీర్చడం కోసం కన్న బిడ్డలను అమ్ముకున్న వారు ఉన్నారు.. ******** అబ్బబ్బ ఏం ఊరిస్తున్నావే తొందరగా చెప్పి తగలడు అంది విసుగ్గా కరుణ. నువ్వు ఇలా చిరాగ్గా మాట్లాడావనుకో నేను అప్పుడే చెప్పను అప్పుడు నీకు ఏ దారి ఉండదు. నువ్వు నాకు సేవ చేసుకో అప్పుడే నేను చెప్తాను అంది పోజు…
Read More

చెలీ

చెలీ నువ్వే నా అందాల జాబిలమ్మ నిన్నే కోరుకుంటుంది నా మనుసమ్మ నీతో అడుగులు వెయ్యాలని ఆశపడుతున్నవి నా పాదాలమ్మ, ఎందుకు నా నుండి దూరమన్నావ్వమ్మ దరికి చేరిరారాధే వెన్నలమ్మ, గుండెల్లో దాచుకొని నిన్నె రోజు పూజిస్తానమ్మ. - శ్రావణ్
Read More

కవితల కథ

కవితల కథ ఆది మానవులకు ఆకలి తీర్చగా అడవి చెట్ల ఫలములంది వచ్చె ఎండ.వాన.చలికి ఎట్లు జీవించిరో అట్టి కైతలు మన అనుభవాలు అంతర్జాతీయ కవితా దినోత్సవం సందర్భంగా  - కోట
Read More

ఆదర్శం

ఆదర్శం అక్షరాలన్నీ మాలలుగా జేసీ ఆప్యాయతలన్ని మూట గట్టి అందమైన వాక్యాలుగా మార్చి ప్రేమలన్ని భావలై విరాజిల్లగా వేదనంతా ఆవేదనగా మార్చినా మనసులోని భావాలని కత్తులుగా జేసినా అక్షర మనే ఆయుధం తో గుండెల్లో గుచ్చెలా ప్రశ్నిoచినా అదొక కలానికే సాధ్యం, మనతరం కాలగర్భంలో కలిసిపోయినా రాసినా రాతలన్ని ముందు తరానికి కావాలి ఆదర్శం... ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు... - అర్చన
Read More

దేవత

దేవత కాటుక చీకటి రాత్రిలో నీ నాయనలలో మెరిసే కాంతి నాలో ఓ కొత్త అనుభూతి నీకు చెప్పాలని నీతో ఉండాలని ఆరాధిస్తూ నిన్ను అన్వేషిస్తూ ఎదురు చూస్తున్న నీ కోసం పరితపిస్తున్న నా కన్నుల్లో కలవై నా గుండెల్లో దేవతవై నాతో నువ్వు ఉంటావని ఆశిస్తున్నా.... - శివరాం శంకర్ నాయుడు
Read More

చెలి….

చెలి.... నా ఊహల సుందరి... నా సరిగమల సంగీతం... నా మది స్వప్నం... నీ మాటతీరు స్వచ్ఛం... నీ నడవడిక ఆదర్శం... నీ అంతఃసౌందర్యం సుగుణం... నీ ఊహాలోకానికి నేనో రాజునై... నువ్వు నన్ను చేయిపట్టి నడిపించే రాణివై... మన స్వప్నానికై బాటలువేద్దాం... - నారాయణ
Read More