Month: March 2022

కొత్త ప్రపంచం

కొత్త ప్రపంచం ప్రతి స్నేహితుడు మనలో మనకే తెలియని క్రొత్త ప్రపంచాన్ని చూపిస్తాడు అతడు కలిసే వరకు అ విషయం మనకు తెలియదు... - రాంబంటు
Read More

బంధం

బంధం మనసుతో ముడిపడి ఉంటాయి కొన్ని బంధాలు.. ఎప్పుడు చూడని చవిచూడని అభిరుచులు కలిసినప్పుడు.. ప్రేమ అనుభూతికి లోనయినపుడు.. ఆ బంధాలు విడిపోతే మనసుకు కష్టంగా ఉంటుంది...   - పలుకూరి
Read More

పచ్చ సంకేతము!!

పచ్చ సంకేతము!! పుట్టుకతో వచ్చిన చిలిపితనం పుడకలతోనే పోవును. శృతి మించ కుంటే....! శృతిలయల మయమౌను జీవితం. చిలిపితనానికి లంగోటి యేల? యవ్వన మందు దానికి వ్యాయామము అక్కెర ఔనా? వృద్ధాప్యమందు, దానికి చేతికర్రనిస్తువా.......? ముఖము ముడతలు బారు. చీకట్లను చిమ్మిన కురులు, వెండి కాంతులను జిమ్ము. రంగు మారనిది హృదయం. ఎర్రగనే ఉండు. చిలిపి చేష్టలకి అది పచ్చ సంకేతమే అనుదినం. - వాసు
Read More

ఏం సంపాదించావ్?

ఏం సంపాదించావ్? ఏం సంపాదించావ్ రా ఇన్నాళ్లు...? నేను పోతే మొయ్యడానికి నలుగురు మనుషులు నన్ను చూడ్డానికి వొచ్చిన ఎంతో మంది జనాలు.. - శ్రవణ్ నాని
Read More

ఆత్మ విశ్వాసం

ఆత్మ విశ్వాసం *నా జీవితం ఇంతే* అనే బాధ కన్నా... *ఇంకా ఏదో ఉంది* అనే ఆలోచనే మనలో *ఆత్మ విశ్వాసాన్ని* నింపుతుంది! - కిరణ్
Read More

గుణపాఠాలు

గుణపాఠాలు కొన్ని రాసుకున్న రాతల కంటే నేర్చుకున్న అనుభవాలే జీవితానికి గుణపాఠాలు - శివ శంకర్ నాయుడు  
Read More

చిక్కదనాల చిలిపితనం

చిక్కదనాల చిలిపితనం బాల్యంలో చిలిపిదనం బహుముచ్చట అందరికీ చిరునవ్వు కళ్ళతో అడుగేసే బుడతడు ఎవరికీ చిక్కడు..ఎంతకీ అందడు.. చిలిపి గోపయ్య వేణుగానమై కౌమారం పిలుపుతో సిగ్గుపడే యువత ఇంటికే అందం పలుకే మకరందం చిలిపి ఊహల ఊయలలో ఊగేను ప్రాయం నడివయసు గాంభీర్యం దాచేను చిలిపిదనం ఏకాంతాల చిలిపిదనం పూచిన గోరింటలా గోరువంకల జంట గ్రోల అనుభూతుల గోరుముద్దలు మునిమాపువేళలో చిలిపి జ్ఞాపకాల జ్వరం అది మనసుకేమొ వరం అమ్మమ్మ తాతయ్యల ముసిముసి నవ్వులు తెరిచునుగా చిలిపి వలపు తలుపులు - సి.యస్.రాంబాబు
Read More

పలుకే బంగారమాయె

పలుకే బంగారమాయె చర వాణి కాసేపు నువు మూగవోతే నేనెట్లా ఉండగలను చెప్పవే అరచేతి ప్రపంచానివి నీవు అందరికీ నేస్తమైన నీవు నా ఆత్రుత ఆలకించవే బంగారపు పలుకు పలుకవే ఏం చేసినా నా చూపు నీ వైపే ఏం చోద్యమో గానీ అరచేతి అందమా మరి ఆ క్షణికపు ఆవేదన మరి ప్రత్యక్ష నిదర్శనం అది పరోక్ష అంతరార్థం అది కమ్మని పాటవై కనిపించని స్నేహ మై పసిపాపల లాలివై వినోదపు సొంపువై తెరతేసిన చైతన్యమే లోకాల లోగిళ్లలో వరమిచ్చి న నీవే బంగారపు పలుకైతే ఉలికించి పలికించనా చరవాణి పలకవే ఆదరిస్తున్న నా కోసం అందుకే మరి నిన్నూ ..... - జి జయ
Read More

సమీర

సమీర "నాన్నా మీకెందుకు అర్ధం కావడంలేదో నాకు తెలీడంలేదు. ఆ అమ్మాయి మనసు మంచిది, మనిషి మంచిది తనతో జీవితం బావుంటుంది. పైగా మేమిద్దరం ఈ దేశంలోనే వుండము, మీకు ఇబ్బంది అనుకుంటే మళ్ళీ ఈ ఊర్లో కనిపించం. ప్లీజ్! మీ కాళ్ళు పట్టుకుంటా, ఒప్పుకోండి." అప్పటికి నాలుగు గంటల నుంచీ నడుస్తుంది నాన్నతో వాగ్వాదం. కష్టాల్లో వుంటే రాళ్ళేసే వాళ్ళే కానీ సాయం చేసే ఒక్కడూ లేని బంధువుల గురించి అమ్మా నాన్నా ఎందుకు ఇంత వర్రీ అవుతున్నారో నాకు ఎంత చించుకున్నా అర్ధం కావడం లేదు. కనీసం అమ్మైనా సపోర్ట్ చేస్తుందేమో అనుకుంటే అదీ లేదు. ఎన్ని చేసినా వెనకేసుకొని వచ్చే అమ్మ కూడా ఎదురు తిరిగే సరికి ఏం చేయాలో తెలీని అయోమయం. ఒప్పుకుంటే సరేసరి లేదంటే కామ్ గా మన పని మనం చేసుకోవడమే. కొన్నేళ్ల తరువాత వాళ్ళే మెత్త బడతారు అన్న రాజీవ్ గాడి…
Read More