Month: January 2023

భారతదేశంలో సాటిలేని అలెగ్జాండర్‌ను ఎవరు చితక్కొట్టారు?

భారతదేశంలో సాటిలేని అలెగ్జాండర్‌ను ఎవరు చితక్కొట్టారు?   భారతదేశంలో సాటిలేని అలెగ్జాండర్‌ను ఎవరు చితక్కొట్టారు? అలెగ్జాండర్ ది సాటిలేనివాడు గ్రీస్‌లోని మాసిడోనియాకు ప్రభువు. ప్రపంచ విజేతగా మారాల్సిన అవసరం ఉన్నందున, అతను మొదట గ్రీస్‌లోని వివిధ రంగాలను ఓడించాడు. ఇంకా ఏమిటంటే, అతను దక్షిణానికి వెళ్లి అనేక దేశాలను ఓడించాడు మరియు అపారమైన పర్షియన్ డొమైన్‌పై కూడా నియంత్రణ సాధించాడు. అక్కడ పర్వతాలు దాటుతున్న క్రమంలో భారత్ అనే ధనిక దేశం ఉందని గ్రహించాడు. నేను దానిని జయించవలసి వచ్చింది. హిందూ కుష్ పర్వతాలను దాటి సింధు మైదానంలోకి ప్రవేశించిన తరువాత, అతన్ని అంబి అనే పాలకుడు కలుసుకున్నాడు. పాంచాల ప్రభువు అయిన పురుషోత్తుడిని సంహరించే సమయంలో తాను సహాయం చేస్తానని చెప్పాడు. అంబిని ఉపయోగించి పురుషోత్తుడిని చితకబాదాడు. అప్పటికి అతని సైన్యం తిరిగి రావాలి. వారి ప్రకటనను తక్కువగా అంచనా వేసిన అలెగ్జాండర్ వెనుదిరిగాడు. ఆనాటి గ్రీకు చరిత్ర విద్యార్థులు…
Read More

ధీర వనితలు

ధీర వనితలు స్వాతంత్ర్య భారత దేశంలో మహిళలకు ఇచ్చే విలువ తక్కువే అయినా, కొందరు మహిళలు వాటిని అధిగమించి బయటకు రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అలా మొల్ల నుండి నేటి తమిళ సై గారి వరకు పోరాడుతూ వచ్చిన వారే.... అయితే వారు ఈనాడు ఈ స్థానంలో ఉండడానికి చేసిన త్యాగాలు, ఎదుటివారు దాడి చేసినా తట్టుకుని నిలబడి మరీ తాము అనుకున్నది చేస్తూ, యువతులకు యువతకు ఆదర్శంగా నిలిచారు, నిలుస్తున్నారు. ఒక్క వీరే కాదు మన ఇళ్ళలో ఉన్న అమ్మమ్మ, నాయనమ్మ నుండి అందరూ తమ హక్కుల కోసం పోరాడుతున్నవారే, ఇప్పటికీ కూడా ఇంట్లో మహిళల నిర్ణయాలు తీసుకోవడం లేదు అనేది బహిరంగ రహస్యం. కేవలం కాగితాలతో రాస్తున్నారు తప్ప నిజంగా ఏ ఇంట్లో ఏ మహిళకు గౌరవం లేదన్నది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. అసలు విషయానికి వస్తే భారత దేశంలో మహిళలకు ఇచ్చే విలువ, గౌరవం, స్వేచ్చ…
Read More

యోధ ఎపిసోడ్ 1

యోధ ఎపిసోడ్ 1 నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న నేరాలు.. ఇంకా మిస్టరీ వీడని మర్డర్ కేసులు.. ఆరు నెలలుగా తెలియని ఆ అన్నా చెల్లెళ్ళ ఆచూకీ.. ఇది పోలీసుల మరియు ప్రభుత్వ వైఫల్యమేనా?" న్యూస్ ఛానల్ లో వస్తున్న ఆ న్యూస్ ని, హాల్లో కూర్చొని పెద్ద వాల్యూంతో తీరిగ్గా వింటున్నాడు శ్రీనివాసరావు పొద్దు పొద్దునే.. "అబ్బబ్బా.. పొద్దునే ఆ న్యూస్ లు కాకుండా ఏదైనా మనసుకు కొంచెం ప్రశాంతత కలిగిన భక్తి గీతాలు ఏమైనా పెట్టరాదూ" అంటూ వంటింట్లో వంట చేసుకుంటూ అదంతా వింటూన్న అతని భార్య సులోచన విసుక్కుంది. సరిగ్గా తను అలా అందో లేదో ఈ లోపే పవర్ పోయింది. "అదిగో నీ మొర ఆ భగవంతుడు కూడా ఆలకించినట్టున్నాడోయ్!" అంటూ ఆ పక్కనే ఉన్న న్యూస్ పేపర్ ని తన చేతుల్లోకి తీసుకున్నాడు అది చదవడానికి. ఈ లోపే "ఇదిగోండి కాఫీ..!" అంటూ తన చేతికి…
Read More

రైతు గొప్పతనం

రైతు గొప్పతనం తనకంటూ ఏమి మిగల్చకుండా ఉన్నదంతా భూమి తల్లిని నమ్ముకుని భూ తల్లే తనని కాపాడుతుందని నమ్ముకుని పంట వేస్తాడు రైతు, ఎండనక, వానానక ఆ భూమి లో ఉన్న పంటను కంటికి రెప్పలా కాపడుకుంటాడు. ఎన్నో మందులు వేస్తూ, కలుపు తీస్తూ, కన్నబిడ్డలా చూసుకుంటాడు అదే సమయంలో వాన దేవుడికి కోపం వచ్చి పొట్టకొన్నచ్చిన పంటను పాడు చేసినా ఆదరక, బెదరక ఉన్నదాన్ని కాపాడుతూ తాను ధైర్యంగా ఉంటూ నలుగురికి ధైర్యం చెప్తూ, ఆ కాస్త పంటను మిల్లుకు తీసుకుని వెళ్తాడు. అక్కడ తన వంతు వచ్చేవరకు చలిలో మగ్గుతూ, ఓ పూట తిని, ఓ పూట తినక , ఒప్పిగ్గా ఎదురుచూస్తారు. తనవంతు రాగానే పంటను మిల్లులో సగం రేటు కైనా అమ్మేసి తిరుగు ప్రయాణం అవుతాడు. ఆ మిగిలిన డబ్బుతో పస్తులు ఉన్నా చేసిన అప్పు తీర్చేసి, మళ్లీ ఆశగా భూ మాతను నమ్ముకుని మళ్లీ…
Read More

భారతదేశ గొప్పతనం

భారతదేశ గొప్పతనం భారతదేశం మనభారతదేశం వేదాలు వెలసిన వేదభూమి కర్మ సిద్ధాంతం నమ్మిన కర్మభూమి సంస్కృతి సమ్మేళనాల సహజత్వం భారతదేశం సందేశాల శాంతి నిలయం అహింసా ధర్మాన్ని చాటిన ఆదర్శ దేశం మహాత్ముల జన్మస్థలం ప్రజాస్వామ్య రాజ్యాంగం కుల మతాల కుగ్రామం విజ్ఞానపు ఘనులు వినోదాల ప్రపంచం సస్యశ్యామల సౌభాగ్యం వైజ్ఞానిక శక్తి పదం విశిష్ట కట్టడాల అద్భుతం జీవనదుల పుణ్య నదుల ప్రవాహం ధీర మహిళలే గర్వకారణం దానధర్మాల అమృతకలశం భాష యాసల భావమాధుర్యం యోధుల యోగుల జన్మస్థలం వజ్రవైఢూర్యాల వైభోగం అన్నదాతల పవిత్ర స్థలం ప్రగతి పదానికి అతిరధులు విజయ రహస్యాల సోపానం భారతదేశం విశ్వశాంతి గీతాన్ని శాంతి సామరస్యాలకోసమై ఉపదేశించిన ఘనచరిత్ర భరతావనిది భరతమాత ముద్దుబిడ్డలుగా జన్మించిన మన అందరిదీ గొప్పతనం... - జి జయ
Read More

అన్వేషణ ఎపిసోడ్ 8

అన్వేషణ ఎపిసోడ్ 8 అలా శ్రుతి కోసం వెతకడం మొదలుపెట్టారు ఏసిపి రంజిత్ అండ్ టీమ్. వాళ్ల దగ్గరున్న ఆ కాంటాక్ట్ నంబర్ సాయంతో, తన వివరాలు సేకరించే పనిలో పడ్డారు. చివరికి తనుంటున్న అడ్రెస్స్ సంపాదించి, శ్రుతి ఉన్న చోటికి చేరుకోగలిగారు. తనని పట్టుకుని విచారణ చేపట్టి ఆధారాలు సేకరించడం మొదలుపెట్టారు. "హాయ్ శ్రుతి.. ఐ యాం "ఏసిపి రంజిత్". థిస్ ఈస్ మై టీమ్. వి ఆర్ ఫ్రమ్ సీ బి ఐ. ఐ యాం ది చీఫ్." అంటూ తన చేతిలో ఉన్న ఐడీ కార్డ్ చూపిస్తూ తమని తాము శృతికి పరిచయం చేసుకున్నాడు రంజిత్. "ఓహ్..!" అంటూ తలాడించింది శ్రుతి. అప్పటికే వాడిపోయిన మొహంతో, దేనికో దిగులుగా ఉన్నట్టుంది శ్రుతి!. CBI టీమ్ అని, వాళ్ళు తమకు తాము తమని పరిచయం చేసుకున్నా, ఏ బెరుకు లేని శృతిని చూస్తుంటే, అసలు ఈ కేసులకు సంబంధించి తనకి విషయం తెలుసో…
Read More

లైఫ్ కొటేషన్

లైఫ్ కొటేషన్ ఆగిపొమ్మంటున్న ప్రాణం కడిలిపొమ్మంటున్న కాలం ఈ రెండిటికీ పొత్తు కుదరక పగిలిపోతున్న జీవితం - భరద్వాజ్
Read More

భారతదేశ గొప్పదనం

భారతదేశ గొప్పదనం కులాలు మతాలు వేరైనా,,, మనుషులు మాత్రం ఒకటే... భాషలు, ప్రాంతాలు వేరైనా అందరూ ఒకటే అందరూ ఒకేలా కలిసి మెలగాలి... అందరినీ భారత మాత ఒకేలా చూస్తుంది కన్న తల్లి ఎలా అయితే చూస్తుందో అచ్చం అలాగే... భారతదేశంలో అనేక దేశాలు రకరకాలైన రాజకీయాలు చేస్తున్నారు... ఆచారాలు సంప్రదాయాలు పాటిస్తూ మన ప్రాణాలను అడ్డుగా ఉన్న జావాన్లుకు మనం ఎప్పుడూ తోడుగా ఉండాలి... భిన్నత్వంలో ఏకత్వంగల దేశం మనది.. భారతదేశంలో అనేక భౌతిక, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక తారతమ్యాలున్నాయి... భారతదేశంలో ఆనాది నుంచి అనేక మతాలు, జాతులు ఉన్నాయి... భారతదేశం ఎప్పుడు గొప్పదే.. ఇలాంటి దేశంలో మనం పుట్టడం ఎంతో గర్వకారణంగా ఉంటుంది... భారతదేశం గురించి ఎంత చెప్పినా తక్కువే... భరత మాతకి జై జైలు.. ⁠- మాధవి కాళ్ల
Read More

ప్రకృతి అందాలు

ప్రకృతి అందాలు ప్రకృతి అందానికి పరవశించని వారు ఉండరు ప్రకృతిని పలకరిస్తే వర్ణాలు వలకబోస్తుంది మనసుని ఆహ్లాద పరుస్తుంది హాయిగా వీచే చిరుగాలులు అల్లంత దూరంలో ఆకాశపు వినువీదులు ఆసక్తిని పెంచే కొండాకోనలు స్వచ్ఛతకే మారుపేరు గా సెలయేళ్ల ధారలు ప్రశాంతతను నింపే పచ్చిక బయళ్ళు వినసొంపైన పక్షుల కిలకిలా రావాలు కనువిందు చేసే పూల తోటలు పచ్చని పాడి పంటలు నోరూరించే ఫలాలు అమూల్యమైన జీవరాశుల సంపద సరికొత్త అనుభూతులను పంచే ప్రకృతమ్మ వరం మనసును కట్టిపడేసి మదిని మురిపించి మరిపింప చేస్తాయి ప్రకృతి అందాలు సుడిగాలులు జడివానలు ఉప్పెనలు ఉత్పాతాలు అన్నీ ఉన్నా ప్రకృతిలో జీవరాశి మనుగడ కోసం ఇప్పుడు మన ముందున్న ప్రయత్నం ప్రకృతిని కాపాడుకోవడం ప్రకృతిలోని అందాలను ఆస్వాదిస్తూనే చేటు చేసే పరిణామాలను కూడా అడ్డగించాలి అప్పుడే అనునిత్యం ప్రకృతి ప్రసాదించిన అందాలుపరిరవిల్లుతాయి ధరణిలో..... - జి జయ
Read More

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి ఎంతగ వేడితే అంతటి కరుణను చూపేవాడవు నీవు నమ్మకముంటే దారిని చూపే స్వామివి నీవే కాదా చరణం బాటను విడచి బాధ్యత మరచి ఐహిక సుఖమే ఒకటే చాలని తలచితిమయ్యా తప్పేనయ్యా తప్పదు నీకు మార్గము చూపగ చరణం తనివేతీరదు ఆకలి ఉండదు నిను దర్శించిన మాకు నీ నామముతో బతుకే మారును నీ చిరునవ్వును ఎదలో నింపి సాగెదమయ్యా మేము చరణం బంధాలన్నీ ఛేదించుకుని నిను వెతికెదము మేము సాయము చేసి మార్గము చూపి కరుణించవయా స్వామి - సీ.యస్.రాంబాబు
Read More