Month: February 2022

జ్వాల

జ్వాల ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ కంటికి కనబడని వైరస్ కొన్ని వేల ప్రాణాలను కనుమరుగయ్యే లాగా చేసింది. ముఖానికి ముసుగు, చేతికి కడుగు, బంధాలకు తెంపు లాంటి నీతి సూత్రాలను వెలుగులోకి తెచ్చింది. అసలు కంటికి కనబడని ఈ వైరస్ కి మానవ లోకం కుంచె తో ఎంతో అందమైన రంగులు పూసింది. ధర్మ సంరక్షణార్థం వచ్చింది ఈ వైరస్ అని కొందరు మానవ విలువల్ని పెంచింది అని మరికొందరు బంధాలను దగ్గర చేర్చింది అని ఇలా ఈ క్రిమిని, క్రీమ్ గా మార్చేశారు. ఈ సాంఘిక దూరం అనే అద్భుతమైన సంప్రదాయం ఈ క్రీం వల్ల వచ్చినది ఏమీ కాదు. అనాదిగా తాతల కాలం నుండి ఇది శిక్షించ బడని నేరం గా మన్ననలు సంఘంలో అందుకుంటోంది. వృద్ధులైన తల్లిదండ్రులను వారసులు దూరం నెట్టేస్తున్నారు. పక్కింటి పొరిగింటి ఓడు మనకి కొన్ని వేల మైళ్ల దూరం.…
Read More

పంచాంగం 27.02.2022

పంచాంగం 27.02.2022 *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - శిశిరఋతువు* *మాఘ మాసం - బహళ పక్షం* తిధి : *ఏకాదశి* ఉ6.46 వరకు & తదుపరి *ద్వాదశి* తె4.38 వరకు వారం : *ఆదివారం* (భానువాసరే) నక్షత్రం: *పూర్వాషాఢ* ఉ7.40 వరకు & తదుపరి *ఉత్తరాషాఢ* తె6.14 వరకు యోగం: *వ్యతీపాతం* సా4.53 వరకు కరణం: *బాలువ* ఉ6.46 & తదుపరి *కౌలువ* సా5.42 ఆ తదుపరి *తైతుల* తె4.38 వర్జ్యం: *మ3.11 - 4.41* దుర్ముహూర్తం : *సా4.28 - 5.14* అమృతకాలం: *రా12.13 - 1.43* రాహుకాలం : *సా4.30 - 6.00* యమగండ/కేతుకాలం: *మ12.00 - 1.30* సూర్యరాశి: *కుంభం* చంద్రరాశి: *ధనుస్సు* సూర్యోదయం: *6.24* సూర్యాస్తమయం: *6.01* 👉 *మతత్రయ ఏకాదశి* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు 
Read More

మన్నింపు

మన్నింపు భావం బావుంటే భవిష్యత్తు బావుంటుంది మన్నించే గుణముంటే మంచే జరుగుతుంది అంటారు. మన్నించే మనసుసున్నవాడు దేవుడి కన్నా గొప్ప వాడట మనసు నొచ్చిన మాటను మన్నింపూ కడుతుంది జారిపోయిన కాలాన్ని కటినంగా శిక్షించకు మనసుకు నచ్చినది ఒప్పు ఎదురువచ్చింది తప్పు కాదు అని తెలుసుకో దయ జాలి కరుణ నవ్వు దేవుడిచ్చిన వరాలు. అహంకారము నీవు నేర్చిన అభ్యాసము అందుకే ఒక్కసారి మన్నించి చూడు నీకే తెలుస్తుంది ఆ శాంతత. అది ఒక కనువిప్పుగా మిగులుతుంది నిన్ను నమ్మిన  వారిలో. - జి.జయ
Read More

పరుగులే నా నడకలు

పరుగులే నా నడకలు నా పరుగు లాయే  నిత్య నడకలు. నిన్ను చేరగా నదే గమ్యం మాయే. ఈ భౌతిక, మానసిక పరుగు నన్ను మన్నించమని అడుగుట కై సఖి! నీ పైన నా తీక్షణ చూపులు మరలించెను నీవి గగనము వైపు. నా ప్రేమ బిందువులు కురిపించగ.. ఛత్రి మాటున దాచితివి నీ శిరమును. నా బాధ కన్నీరై కార, వర్షము దానిని తడుపు చుండెను. కాలం కలిసి రాలేదు లే! ఈ పరుగు నే ఆ పనులే  !   - వాసు
Read More

పంచాంగం 26.02.2022

పంచాంగం 26.02.2022 శ్రీ ప్లవ నామ సంవత్సరం ఉత్తరాయణం - శిశిరఋతువు మాఘ మాసం - బహళ పక్షం తిథి:దశమి ఉ9.07 వరకు వారం:శనివారం(స్థిరవాసరే) నక్షత్రం:మూల ఉ9.18 వరకు యోగం:సిద్ధి రా7.56 వరకు  కరణం:భద్ర ఉ9.07 & బవ రా7.57 వర్జ్యం:ఉ7.48 - 9.18 & సా6.15 - 7.45 దుర్ముహూర్తం:ఉ6.25 - 7.57 అమృతకాలం:తె3.12 - 4.42 రాహుకాలం:ఉ9.00 - 10.30 యమగండ/కేతుకాలం:మ1.30 -3.00 సూర్యరాశి:కుంభం చంద్రరాశి:ధనుస్సు సూర్యోదయం:6.26 సూర్యాస్తమయం:6.01 సర్వేజనా సుఖినో భవంతు
Read More

చెలి

చెలి విరిసిన సుమాల మాలవో అరివిరిదిన రంగుల హరవిల్లువో మణి కాంతులు  ఎగజిమ్మే తారవో వసంతాల మందారమాలవో పూరి విప్పిన నెమలి పింఛం అంచువో కల హంసల నడకల వయ్యారి భామవో కమ్మని కావ్యంపు పాటవో కదిలే మది ఊహావో మెరిసే మెరుపుల మురిసే నవ్వుల అందానివో నా ఊహల సామ్రాజ్య రాణివో నా హృదయ నెచ్చెలివో .. నా బిగి కౌగిలిలో ఒదిగిపోయే మనసైన నా చెలివో.... - అర్చన
Read More

నీ కౌగిలి లో…

నీ కౌగిలి లో... తను నన్ను చూస్తున్నాడని  నాకు తెలుసు. కానీ తెలియనట్టు నటిస్తున్నా, అసలు గమనించనట్టు ఉన్నా, కానీ అదేంటో మనల్ని ఎవరైనా చూస్తే ఆ చూపులు వీపు కు గుచ్చుకుంటాయి. మనసైన వారు ఎక్కడ ఉన్నా అలా తెలిసిపోతుంది. అందుకే తనను తప్పించుకుంటూ తిరుగుతున్నా లేదంటే ఊరుకుంటాడా అసలే చిలిపి. ఆపై అతని ఆశలకు, కోరికలకు హద్దే లేదు. ఇంతలో ఫోన్ లో మెసేజ్ టోన్ ఏంటా అని చూస్తే ఇంకెవరు తానే ఎంటా అని చదివి, నన్ను తప్పించుకుని తిరుగుతున్నావు కదా నీ పని చెప్తా, అందరి ముందు నిన్ను కౌగిలించుకోకపోతే నా పేరు వేరే గా పెట్టేసుకుంటా అని. అమ్మో ఏంటి అంత ధైర్యం అనుకున్నా, ఛా నిజమా అన్నాను. హా నిజమే అంటూ రిప్లై సర్లే చూద్దాం అన్నాను. హా మరి నన్ను పట్టించుకోకుండా వెళ్తవా అన్నాడు. ఏంటి నాకదే పని అనుకున్నావా అన్నాను.…
Read More

గుంభన

గుంభన కుడి చేత్తో ఇచ్చినది ఎడమ చేతి కి కూడా తెలియకూడదు అనే గొప్ప నైతిక సూత్రాన్ని మనం నిత్యం నెమరు వేస్తూ ఉంటాం. అయితే మనం ఏది దానం చేస్తే దాన్ని అన్ని దానాల్లోకెల్లా గొప్ప దానమని చెప్పుతూ తృప్తిని పొందుతాము. చదువు అయితే అన్ని దానాల్లోకెల్లా విద్యా దానం గొప్పది అని, భోజనం అయితే అన్నదానం గొప్పదని, నీరైతే ఉదకదానం గొప్పదని చెప్పేస్తాము. కారణం ఆ సమయంలో మనము ఇచ్చేదానికి గొప్ప రంగును పులిమెస్తాము. అవి ప్రపంచాన్ని వణికిస్తున్న రోజులు.ఆ రోజుల్లో మీడియా ప్రచారం లేకపోయినా చీమ సైతం తల దాచుకునేది.. ఈ అలజడికి కారణం స్కైలాబ్.అది ఏ క్షణనం లో అయినా భూమండలం మీద పడవచ్చు. జనావాసాల పై పడే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే జన నష్టం తప్పదు. ఇలా జనాలు చిగురుటాకులా వణికి పోతున్నారు. ఆయన మొహంలో ఏదో ఆందోళన కనిపిస్తోంది. సాయంత్రం 6…
Read More

వాగ్దానం

వాగ్దానం సంతోషంలో వాగ్దానం చేయొద్దు కోపంలో మాట మాట్లాడవద్దు అంటారు అతి తేలికైన విషయంగా కనిపించినా అది ఒక పెద్ద బూతద్దం లాంటిది కోరికతో చేసే పని అయినా వినడానికి బానేవున్నా  ఫలితానికి దూరంగా కనిపిస్తుంది నిజానికి ఎదుటి వారు చేసే వాగ్దానం బాణం లా వెలుతుందట ముందుచూపు లేని మాట ఆచరణ లేని అవకాశము ఒక్కటే కొన్నిసార్లు భ్రమ కల్పించే వాగ్దానాలు పశ్చాతాపం స్నేహ బంధాలు అనుబంధాలలో కూడా ప్రతిబంధకంగా నిలుస్తాయి వాగ్దానాలు ప్రమాణం లేని స్వప్నం కాకుండా ఫలితాన్ని ఇచ్చే ఆచరణలో ఉండాలి, కానిచో వర మిచ్చిన వాగ్ధానినికే శాపమవుతుంది. - జి. జయ
Read More

మాట

మాట నారాయణ కు ముగ్గురు పిల్లలు ఇద్దరూ ఆడపిల్లలు, ఒక అబ్బాయి. నారాయణ ముగ్గుర్నీ బాగానే చదివిస్తున్నారు. ఆయనకు పిల్లలు అంటే చాలా ఇష్టం. ఉన్నంతలో బాగానే ఉన్నారు. ఒకరికి అన్నం పెట్టే స్థోమత కలిగిన నారాయణ అప్పుడప్పుడు అన్నదానం లాంటివి చేస్తూ ఉంటాడు. అలాంటి ఒకరోజు గుళ్ళో అన్నదానం జరుగుతున్న సమయంలో గుడి మెట్ల పైన ఉన్న అందరినీ మండపం లోకి రమ్మని పిలవాలని వచ్చాడు. అందర్నీ బాబు నేను ఈ రోజు అన్నదానం చేస్తున్నా రండి వచ్చి భోజనం చేయండి అన్నాడు. ధర్మ ప్రభువులు అంటూ అందరూ లోపలికి వెళ్ళారు. అందరితో పాటు లోపలికి వెళ్లబోతుంటే నారాయణ కు చివరి మెట్టు పై తల పై కొంగు వేసుకుని ఉన్న ఒక నలభై ఏళ్ళ ఆవిడ అలాగే కూర్చుని ఉండడం గమనించి, ఆమెకు వినిపించ లేదేమో అనుకుంటూ, ఆమె దగ్గరగా వచ్చాడు. ఆమెతో నారాయణ, అమ్మా మీకు వినిపించనట్లు…
Read More