Month: September 2021

విజయ దశమి

విజయాన్ని అందించే విజయదశమి కోసం మీ అక్షరలిపి కథలకు ఆహ్వానం పలుకుతుంది. మీ జీవితం లో మీరు అందుకున్న విజయాలు, వాటి కోసం మీరు కోల్పోయిన విలువైన వ్యక్తుల గురించి కాని, లేదా మీరు పడిన కష్టాల గురించి కాని రాసి మాకు పంపండి.   ప్రతి రచనను ప్రచురిస్తాం. ప్రేరణ కలిగించే రచనలకు ప్రశంసా పత్రాలు అందజేయడం జరుగుతుంది. మీరు మీ రచనలు పంపాల్సిన చిరునామా aksharalipi.official@gmail.com . షరతులు వర్తిస్తాయి. రచనలు తిప్పి పంపడం కుదరదు. అన్ని ప్రచురిస్తాం. మీరు పంపిన వాటిలో ప్రేరణ కలిగించే వాటికి మాత్రమే ప్రశంసా పత్రాలు అందజేయడం జరుగుతుంది. మిగిలిన వాటిని సాధారణ రచనలుగా ప్రచురించడం జరుగుతుంది. ఇందులో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు. మా న్యాయ నిర్ణేతలు సెలక్ట్ చేసినవి మాత్రమే ప్రచురిస్తాం. సందేహాలకు పైన పేర్కొనబడిన మెయిల్ కి మెయిల్ చేయండి. మీ రచనలు అందాల్సిన ఆఖరు తేది 10-10-2021
Read More

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ గొప్పతనాన్ని, పండగ విశిష్టతను తెలుపుతూ కథలు, కవితలకు ఆహ్వానం పలుకుతుంది మీ అక్షరలిపి. కవితలు, కథలు మాకు పంపాల్సిన ఆఖరు తేది 12-10-2021. పంపిన ప్రతి రచనకు ప్రశంసా పత్రాలు అందజేయబడతాయి. ఒక్కరు ఎన్ని రచనలు అయినా పంపవచ్చు, అలాగే రచనలు తిరిగి పంపబడవు, తిరిగి పంపగోరే వారు మెయిల్ లో స్పష్టంగా పేర్కొనాలి. మీ రచన పై "బతుకమ్మ సంబరాలు" అని స్పష్టంగా పేర్కొనాలి. షరతులు వర్తిస్తాయి. రచనలు పంపాల్సిన మెయిల్ aksharalipi.official@gmail.com . 
Read More

ఎదురుచూపులు

ఎదురుచూపులు కనుకొలనులోనుండి జాలువారుతున్న కన్నీటికేం తెలుసు! తాను ఇకరాడని.... అలిసిసొలసినమనస్సుకేం తెలుసు తనను వాడేసుకున్నాడని.... అయినా ఎదురుసూపులు ఎదో ఓమూలఆశ తాను వస్తాడని..... ఆశా, నిరాశలో ముప్పై వసంతాలు ముగిసినా ఎదో ఆశా తాను....వస్తాడని.... కాలం కరుగుతున్నా, కన్నీటిలో తడిసిముద్దవుతున్నా తానంటే ఎందుకో ఆపేక్షా..... ప్రేమ అనే ముసుగులో వంచించబడ్డానని తెలిసినా ఏదో మిణుకు మిణుకుమంటున్న ఆశా..... కాలం కరుగుతున్నా కన్నేళ్ళుఇంకి చారలు కడుతున్నా.. చకోరపక్షిలా ఎదురుచూస్తూనే ఉంటా....
Read More

టీచర్ చీటర్

టీచర్-చీటర్ మొన్ననే గురువుల గురించి చాలా గొప్పగా మాట్లాడుకున్నాం. చాలా మంచి గురువులకు శతకోటి వందనాలు తెలుపుకున్నాము. కానీ ఈ కాలం లో ఉన్న కొందరు టీచర్స్, అదేనండి చీటర్ల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం .. గురువు అంటే విద్యాబుద్దులు నేర్పేవారు. మంచి ,చెడూ చెప్పేవారు. విద్యార్ధిని ఒక దారిలో తీసుకుని వెళ్ళేవారు. గురువుకు చాలా అర్ధాలు ఉన్నాయి. మంచి నేర్పు గురువులు కోకొల్లలు గా ఉన్నారు. కానీ అదే సమయంలో చెడు మార్గాన వెళ్ళేవారు ఉన్నారు. ఒకప్పుడు టీచర్ అంటే పిల్లలకు మార్గదర్శం గా, ఆదర్శంగా నిలిచారు. టీచర్స్ ను చూస్తూ తాము కూడా అంతగా పేరు తెచ్చుకోవాలని , అంత ఉన్నతంగా ఉండాలని కోరుకునేవారు. తాము కూడా టీచర్స్ లా ముస్తాబు అవుతూ, వారిని అనుకరిస్తూ ఉండేవారు . కానీ ఇప్పుడు గురువు అనే పదానికి మచ్చ తెచ్చేవారు ఎందరో.. పిల్లల్ని తమ పిల్లలుగా భావించి, వారు చెడు…
Read More

తనువు

తనువు   ఒకర్ని ఇష్టపడితే జీవితాంతం వారి తోనే కలిసి నడవాలి. మంచి ఎప్పుడూ గెలుస్తూనే ఉంటుంది నీ అంతరాత్మను అడుగు నువ్వు తప్పు చేయలేదు అని అదెప్పుడు అబద్దం చెప్పదు, తనువులు కలిసే చోట మనసు కూడా కలవాలి లేదంటే తేడాలు వస్తూ ఉంటాయి, తనువుల వేడి చల్లార్చు కోవడానికి వేరే దారులు వెతికినా అది నిన్నెప్పుడు కాల్చేస్తూ ఉంటుంది.   - ఐశ్వర్య
Read More

నిజంగా నిజం

నిజంగా నిజం   అద్దం లో నా జడ పొడవుగా కనిపిస్తుంది కానీ నిజంగా చూసుకుంటే పిలక లాగా ఉంటుంది అలాగే కంటికి కనిపించేవి, వినిపించేవి , అన్ని నిజాలు కాదు అవెప్పుడూ అద్దం లాగే అబద్ధాలు చెప్తూ ఉంటాయి, అందుకే ఏదన్నా తెలిసినప్పుడు నిజంగా నిజమేనా అని వెళ్లి తెలుసుకోవాలి... అద్దం ఎప్పుడూ అబద్దం చెప్పదు అంటారు కానీ అది ఎప్పుడూ నిజం కాదు నీ మనసే నీకు నిజం ఏంటో చూపిస్తుంది.
Read More

గుణం

గుణం మంచి బట్టలతో మంచి మేకప్ తో మనిషి రూపం మారవచ్చు కానీ మనిషి గుణం మారుతుందనే నమ్మకం లేదు బట్టలు మాసినా, అందం గా లేకపోయినా ఆ మనిషికి మంచి గుణం ఉండవచ్చు....   - భవ్య చారు
Read More

నాన్నా నీవెక్కడ

నాన్నా నీవెక్కడ   సత్ ప్రవర్తన కలిగిన తండ్రి బ్రతికివుండగా తన తల్లికి మళ్ళీ ఎందుకుపెళ్లి చేయలనుకుంది కూతురు?                    ****** ఇక చదవండి..... ఏంటి? నవ్య అన్నాన్ని అలా కెళుకుతున్నావ్! ఏమైంది ఆరోగ్యం బాలేదా? అని ప్రశ్నించింది అనిత. ఏం లేదు ఆంటీ, ఫ్రెండ్స్ అందరు కాలేజ్ లో మీ డాడీ ఏం చేస్తారు అని అడుగుతున్నారు, ఎప్పుడడిగిన మీరు కాని, అమ్మకాని ఏం చెప్పరూ, ఎదో విషయం చెప్పి దాటవేస్తారు, అసలు నాకు డాడీ ఉన్నాడా? చచ్చాడా అని అన్నం పళ్లెంలో చెయ్యి కడిగి విసురుగా లేచి రూమ్ లోకి వెళ్లి పెద్దశబ్దం వచ్చేలా తలుపులు మూసి, మంచం పై బోర్లాపడుకొని ఏడుస్తూ ఆలోచించ సాగింది డిగ్రీ చదువుతున్న నవ్య. పుట్టి బుద్ది ఎరిగినప్పటి నుండి అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటుంది నవ్య, ఎన్ని సార్లు తండ్రి గూర్చి అడిగిన ఎదో ఒకటి చెప్పి దాట వేయడంతో మళ్ళీ…
Read More

పుస్తక ముఖం

పుస్తక ముఖం Hai Hai How are you Ya fn tq What about you yes i am fine tq Mi name please Sri Mi name Uday Mi profile pic bagundi Hmm TX Miru ekkada untaru Y Cheppandi Ongole Mari miru Hmm Nenu hyd Oh Avuna Hyd lo ekkada Are, avuna a pakkane ma attayya vallu untaru Oh avuna it's ok Mi pic pettara Y Just akkadiki vachinappudu chuddam ani Ha ha ha Abba mi navvu chala bagundi, inko sari navvara Ha ha ha tq Pls pic pettandi Hmm Repu pedatanu Pls pls pls pls ippude pettandi Hmmm Oka 5 minuets lo…
Read More

అన్నా నీ అనురాగం..అన్న ప్రేమ

అన్నా నీ అనురాగం..అన్న ప్రేమ నాకు చిన్నప్పుడే తల్లి, తండ్రి చనిపోయారు . అన్నయ్య నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు. ఆడపిల్లకు తల్లి లేకుంటే ఎన్ని కష్టాలు ఉంటాయో అన్ని నాకు తెలుసు. అమ్మ లేకపోతే ఆడపిల్ల కనీస అవసరాలు చూసే దిక్కు ఉండదు. కానీ మా అన్నయ్య నాకు అమ్మ లేని లోటు తెలియకుండా చూసుకున్నాడు. నాకు ఎలాంటి అవసరాలు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా , అమ్మ కన్నా ఎక్కువ నాకు చెప్పేవాడు , అంతకన్నా ప్రేమగా చూసుకునేవాడు. అన్నయ్య కు నేను ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమి రోజు రాఖీ కట్టేదాన్ని. కానీ అది బయట నుండి తేకుండా నాకు నచ్చిన విధంగా తయారు చేసి కట్టేదాన్ని. అన్నయ్య ప్రతి సంవత్సరం నేను కట్టిన రాఖీ ని జాగ్రత్తగా దాచుకునే వాడు.  ఒక బాక్స్ లో పెట్టీ అది నాకు సంతోషాన్ని ఇచ్చేది. నేను రజస్వల అయినప్పుడు…
Read More