Month: March 2022

జత

జత జత కలిసింది అంటే జరిగిన వింత కథ మరి నింగి నేల కలిపితే అది ఒక భూ మండలం ప్రకృతి వికృతి కలిస్తే అది ఒక చూసే ప్రపంచం సూర్య చంద్రులు కలిస్తే అది ఒక కాంతుల దేదీప్య మే శరీరం మనస్సు కలిస్తే అది ఒక విలువైన ప్రాణం నిజం అబద్దం అనేవి అంత రంగాల అనుభవాలు కష్టం సుఖం కలిస్తే అది ఒక జీవన సమాహారం తప్పు ఒప్పు కలిస్తే అది ఒక అనుభవాల తంత్రం తోడు నీడ బంధం అది దైవం ప్రసా దిస్తే అత్యున్నత అభయ హస్తం - జి.జయ
Read More

రెండు ఒక్కటిగ మారు!!

రెండు ఒక్కటిగ మారు!! ధ్యేయ మొక్కటై, మార్గ మొక్కటై, చేరే గమ్య మొక్కటై!! చూపు ఒక్కటై, చేత ఒక్కటై, చింత ఒక్కటై!! రుచు లొక్కటై, పలుకు లొక్కటై, భావా లొక్కటై!! రెండు ఒక్కటిగ మారు. పాలను చేరిన క్షీరము పాలు యనబడును. పాళం తప్పిన సరసము నీళ్ల పాలు. - వాసు  
Read More

మెరుపు

మెరుపు అనంతమైన ఆకాశంలో మెరిసిన మెరుపుల నిను చూసిన క్షణం లిప్త కాలమైనా నా కంటి పాపలో నీ ప్రతిరూపం నిక్షిప్తమై పోగా కనులు మూసిన నీ రూపం కనులు తెరిచిన నీ రూపం కనుల యెదుట కదలాడుతుంటే నిను ఎలా మరువ గలను నిను ఎలా దరి చేరగలను అల్లంత దూరాన నీవు సూదూర తీరాన నేను ఎప్పుడైనా ఎక్కడైనా ఈ జన్మకు ఒకసారైనా కలుస్తామనే ఆశ అదే శ్వాసగా సాగిపోయే ఓ... అజ్ఞాతవాసి. - అంకుష్
Read More

నీ జత కోసం

నీ జత కోసం నువ్వు నాకు జత నీ జత కోసం ఎదురు చూస్తున్న నువ్వు నేను ఒక జత నా మనసు కోరుకుంటుంది నీ జత మనం పెళ్లి చేసుకొని అవుతాము జంట. - మాధవి కాళ్ళ
Read More

పంచాంగం 14.03.2022

పంచాంగం 14.03.2022 *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - శిశిరఋతువు* *ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం* తిధి : *ఏకాదశి* ఉ10.31వరకు తదుపరి ద్వాదశి వారం : *సోమవారం* (ఇందువాసరే) నక్షత్రం: *పుష్యమి* రా8.53వరకు తదుపరి ఆశ్రేష యోగం: *అతిగండ* తె3.18 వరకు కరణం: *భద్ర* ఉ10.31 వరకు తదుపరి *బవ* రా10.45 వరకు వర్జ్యం: *లేదు* దుర్ముహూర్తం : *మ12.33 - 1.21* & *మ2.56 - 3.43* అమృతకాలం: *మ1.54 - 3.39* రాహుకాలం : *ఉ7.30 - 9.00* యమగండ/కేతుకాలం: *ఉ10.30 - 12.00* సూర్యరాశి: *కుంభం*  చంద్రరాశి: *కర్కాటకం* సూర్యోదయం: *6.14* సూర్యాస్తమయం: *6.06* *మతత్రయ ఏకాదశి* *మీన సంక్రమణం* రా2.37 సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు 
Read More

తారా చరణీయం రెండో భాగం

తారా చరణీయం రెండో భాగం ఈ సీరియల్ మొదటి భాగం తారా చరణియం పరిచయం చదవండి తర్వాత ఇది చదవండి అప్పుడే మీకు అర్థమవుతుంది. అమ్మాయ్ జ్యోతి నువ్వు బడికెళ్ళే ముందు నాన్నగారికి కొట్టులో టిఫిన్ బాక్స్ ఇచ్చి వెళ్ళమ్మా పొద్దుననగా వెళ్ళారు ఏమీ తినలేదు. పాపం ఎంత ఆకలిగా ఉన్నారో.... అసలే అంతంత మాత్రం ఆరోగ్యం అంటూ బాక్స్ పట్టుకుని అద్దం ముందు తయారవుతున్న కూతురి దగ్గరికి వచ్చింది జయమ్మ. అబ్బా అమ్మా నేను వెళ్లనే నాకు అక్కడికి వెళ్లాలి అంటే అదోలా అనిపిస్తుంది. అందరూ పిచ్చి చూపులు చూస్తారు అంది జ్యోతి కొంచం నీరసంగా.... అయ్యో అలా అనుకుంటే ఎలా తల్లి... నువ్వు వెళ్ళేది మీ నాన్న కోసం కదా, అవ్వన్నీ పట్టించుకుంటే మనం వ్యాపారం చేయలేం చూసి చూడనట్టు వదిలేయాలి. అక్కడే ఉండవు కదా బాక్స్ ఇచ్చి తొందరగా వెళ్ళిపో.... మనం బతికేది అదే వ్యాపారంతో కదమ్మా…
Read More

ఆకు+ముళ్ళు= అద్వైత పార్ట్ 2

ఆకు+ముళ్ళు= అద్వైత పార్ట్ 2 వాళ్లిద్దరూ జగన్ గదికి వెళ్ళారు. ఏదో కావాలనే కోరికతో కాలిపొతున్న అద్వైత అతని వెంట బలికాబోతున్న మేకలా వెళ్ళింది. జగన్ తన గదిలో ఎవరితోనో చెప్పి ఏర్పాట్లు చేయించాడు. అవేవీ తెలియని అద్వైత అతనితో జరగబోయే సంగమం గురించి ఆలోచనలతో వెళ్ళింది. ఇద్దరూ గది దగ్గరకు వెళ్ళగానే జగన్ తనకు అనుమానం రాకుండా తాళం తీశాడు. అంతకు ముందే జగన్ దగ్గర పనిచేసే కుర్రాడు చెప్పుల కింద పెట్టిన తాళం చెవిని తీసుకుంటూ చుట్టూ ప్రక్కల ఎవరు లేని ఆ ఏకాంత ప్రదేశంలో ఉన్న తన గదిలోకి అద్వైతము ఆహ్వానించాడు. చుట్టూ ఎవరున్నారో, అసలు ఆ గది ఎక్కడ ఉందో, తనకేం జరుగుతుంది కూడా గమనించే స్థితిలో లేదు అద్వైత. ఏదో కావాలని మాత్రం చాలా బలంగా అనిపించసాగింది. వయసు వేడి ఏమీ ఆలోచించకుండా ఏమీ పట్టించుకోకుండా చేసింది. చిన్న గదిలో ఒక సింగిల్ బెడ్…
Read More

క్షణ భంగురం

క్షణ భంగురం మానుకందం విరులు, విరుల కందం మగువ  మగువ కందం భంధం  బంధనికందం ప్రేమ  ప్రేమకందం అనురాగం అనురాగానికందం ఆప్యాయత  ఆప్యాయత కందం తోలి రాత్రి  రాత్రికదం సుమాల మాలలు. మాలల కందం సిగ్గులు  సిగ్గులకందం మొగ్గలు  మొగ్గ పువ్వై ఫలాన్ని ఇస్తే  ఆ ఇల్లే ఆనందాల మకరందం  ఆ మకరందం తేనే తుట్టగా మారి  గ్రోలిన మలి వయసందం,  మలి వయసు లోని అందాలన్నీ మృగ్యమై  ఆప్యాయత అందని ద్రాక్షై, వృద్దాప్యo నరకమైతే , అందరాని అందమంతా నీరై నింగిలోకి జారితే  నీ అంతిమ యాత్ర కట్టే పై విరిసిన సుమాలు  కన్నీళ్ళ కవితలు రాస్తే.. ఇంతేనా క్షణ భంగుర జీవనందం  అనిపించక మానునా ఎవరికైనా...  - శారద దేవి
Read More

పోటీ

పోటీ పోటీ అనేది ఎదుటి వారితో కాదు నీతో నువ్వు పోటీపడి గెలవాలి. అప్పుడే ఎదుటి వారితో పాటు వారి మనసుని కూడా గెలవగలవు... - రాంబంటు  
Read More

తోడు

తోడు ఎవరికి నచ్చినట్టు వారితో మసులుకుంటే అందరు మన వారే.. నీలా నువ్వు ఉంటే నీ నీడే నీకు తోడుగా మిగులుతుంది.. - రాంబంటు
Read More