Month: April 2022

పంచాంగము 30.04.2022

పంచాంగము 30.04.2022  *_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*  *ఉత్తరాయణం - వసంత ఋతువు* *చైత్ర మాసం - బహళ పక్షం* తిధి : *అమావాస్య* రా1.10 వరకు వారం : *శనివారం* (స్థిరవాసరే) నక్షత్రం: *అశ్విని* రా7.47 తదుపరి భరణి యోగం: *ప్రీతి* మ3.10 తదుపరి ఆయుష్మాన్ కరణం: *చతుష్పాత్* మ12.57 వరకు తదుపరి *నాగవం* రా1.10 వరకు వర్జ్యం: *మ3.37 - 5.17* దుర్ముహూర్తం : *ఉ5.39 - 7.19* అమృతకాలం: *మ12.17 - 1.57* రాహుకాలం : *ఉ9.00 - 10.30* యమగండ/కేతుకాలం: *మ1.30 - 3.00* సూర్యరాశి: *మేషం* చంద్రరాశి: *మేషం* సూర్యోదయం: *5.39* సూర్యాస్తమయం: *6.14*  *సర్వ అమావాస్య* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు 
Read More

పిడుగు

పిడుగు 1) ఉక్కపోత పోసి ఉరుములు మెరుపులు     పిక్కటిల్లి పగలు పిడుగు రాలె     పిడుగు పాటు వల్ల పిల్లజెల్లా జచ్చె     చెలకలోన ఎడ్లు చేష్ట లుడిగె 2) ఆక్సిడెంట్ వల్ల అయిన వారూ పోతె     హాస్పిటలున చేర్చిరపరిచితులు     ఫోను చేసి చెప్పె పోయిన వార్తను     పిడుగు వార్తను విని పీనుగయ్యె 3) పంచభూతములను బాధించు మనిషిని      పట్టు బట్టి పిడుగు మట్టుబెట్టె      పిడుగు వార్త విన్న పిల్లలు పెద్దలు      గుండెపోటు వచ్చి గుటుకు మనిరి - కోట
Read More

అమ్మా-నాన్నలు

అమ్మా-నాన్నలు ఏమయ్యోవ్.. బారెడు పొద్దెక్కే దాకా లేవకపోతే పనికొప్పుడు పోయేదీ? ఏమయ్యా.. పొద్దు పోయేదాకా పనిచేస్తూ ఉంటే ఆరోగ్యం పాడైపోదా? కష్టపడే వారి జీవితాలు ఇలాగే ఉంటాయి కదా! ఐతే పై రెండు సందర్భాల్లో మనం పనిని గమనించాం.. మనం గమనించాల్సింది ఇంకొకటి లేకపోలేదు సుమా! బారెడు పొద్దెక్కింది, పొద్దు పోయింది.. ఇవి నిత్యమూ జరిగేవే కదా....! ఆ… కదా! అంచేత, ప్రతిరోజు అలసిపోకుండా, ఇన్నాళ్ళూ మనకోసం, ఈ భూమికోసం ఓ ఇద్దరు అమ్మానాన్నల్లా మనకోసం ప్రతిరోజూ పనిచేస్తున్నారు కదా!! సూర్యుడేమో అమ్మంటః ఎందుకంటే పొద్దంతా మనతోనే ఉంటూ ఇంట్లో పనులు చూస్కుంటూ, రాత్రి నాన్నకి వెలుగునివ్వడానికి తను మాయమౌతుందంట.. చంద్రుడేమో నాన్నంటః పగలంతా ఎక్కడ పనిచేసి వచ్చారో ఏమో, రాతిరి చల్లగా నిదర పుచ్చడానికి వచ్చేస్తారుగా! ఈ ప్రయాణంలో వారిరువురికీ గ్రహణాలు, అమావాస్యలూ ఉన్నా కొంత కాలానికి చక్కగా సర్దుకుపోతుంటారు....  కనిపించే ప్రత్యక్షదైవాలు అమ్మానాన్నలు, వారే సూర్యచంద్రులు.. వారే కార్మికులు,…
Read More

వనశోభ

వనశోభ ఆ.వె. కనుల విందు చేయు కమనీయ వనజాక్షి సూర్య రశ్మి సోకి సొగసు లంది పచ్చ చీరగట్టి పైట కొంగును వేసి చూచు వారి మనసు చూరగొనెను - కోట
Read More

కావ్య నాయిక

కావ్య నాయిక అలరించే అభినయం ఆమె సొంతం తళ తళ లాడే సౌందర్యం ఆమె సొంతం ప్రదర్శించే పటిమ ఆమెసొంతం జీవంపోసే పాత్రలో ఆమె సొంతం నవరస భరిత నటన ఆమె సొంతం కదిలించే దృశ్యాల రూపం ఆమె సొంతం తలపించే కథాంశం ఆమె సొంతం కథ లోని కల్పిత అభినయం ఆమె సొంతం రక్తి కట్టే సన్నివేశాలు ఆమె సొంతం నడేసొచ్చే నాయికలో ఇమిడేది ఆమె సొంతం అందరి కంటికి ఆస్వాదించే నటన ఆమె సొంతం సన్నివేశాల సమాహారం ఆమె సొంతం వీనుల విందైన సంగీతం ఆమె సొంతం అభిమానించేఅభిమానుల పరిపూర్ణ నాయిక హోయాలోలికించే అందాలు ఆమె సొంతం చమత్కారాల హాస్యాలు ఆమె సొంతం పరిచయాలు లేని పాత్రలో ఒడిగే కళ ఆమె సొంతం రంగుల ప్రపంచంలో అంతులేని అభిమానుల వెండితెర ల అభినేత్రి కావ్య నాయిక - జి జయ
Read More

సాయిచరితము

సాయిచరితము పల్లవి నీచూపేగా మాకు వేదము నీరూపేగా ఎంతో అందము నీ తలపేమో ఎంతో మధురము నీవేనయ్యా మాకు దైవము చరణం నినుకొలిచినచో భయమే ఉండదు కష్టమునందున వెంటే ఉండి వేదనతీర్చీ వేడుకచూపే దత్తగురువువు నీవయ్యా కాలము మాపై పగబడుతుంటే నీ నామముతో గెలిచేమయ్య సద్గురుసేవే కాపాడునుగా నిత్యము మమ్ము చరణం పేదా గొప్ప తేడాలొదిలి మనిషిగ బతుకు అనిచెప్పితివి కులము మతము భేదములొద్దని బోధించితివి ఎన్నడో నీవు నీపై నమ్మిక ఉంచిన చాలు అదియే మాకు ఎంతో మేలు దైవము ఒకడే మార్గాలెన్నో బాటలు ఎన్నో గమ్యము ఒకటే చరణం సాయిని వేడితే సాధ్యము అన్నీ ఆకలిదప్పులు అసలే ఉండవు తన చరితమునే చదివితిమంటే మనసుకు కలుగును ఎంతో హాయి మమతల పందిరి వేయును సాయి అందరి హృదిలో నిండెను సాయి సాయి తత్వమే తెలిసిన నాడు కోపము క్రౌర్యము వీడును చూడు - సి.యస్.రాంబాబు
Read More

ప్రకృతి

ప్రకృతి   ప్రకృతి ముచ్చటపడి చిత్రించిన అద్భుతం పచ్చటి చీరతో పరువాలను దాచుకున్న తరువుల సింగారం చూసిన కనులేమో ఆనందాన్ని నింపుకుంటే...మనసేమో మూగదై ..ఆమె(ప్రకృతి)లో లీనమైంది - బీ ఆర్ నాయక్
Read More

రాము- సీత

రాము- సీత ఆటవెలదిః: పచ్చ చీర గట్టు పడతి మన ధరణి మెచ్చిరెల్ల సురలు మొక్కెరపుడు నచ్చి చేరి నాయి నదులన్ని వరుసగా రాగమాలపించె రాము, సీత   - సత్యసాయి బృందావనం  
Read More

పంచాంగము 29.04.2022

పంచాంగము 29.04.2022 *_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - వసంత ఋతువు* *చైత్ర మాసం - బహుళ పక్షం* తిధి : *చతుర్దశి* రా12.44 వరకు వారం : *శుక్రవారం* (భృగువాసరే) నక్షత్రం: *రేవతి* సా6.49 వరకు తదుపరి అశ్వినిpanchangam యోగం: *విష్కంభం* సా6.02 వరకు తదుపరి ప్రీతి కరణం: *భద్ర* మ12.47 వరకు తదుపరి *శకుని* రా12.44 వరకు వర్జ్యం: *ఉ6.34 - 8.12* దుర్ముహూర్తం : *ఉ8.10 - 9.01* & *మ12.22 - 1.12* అమృతకాలం: *సా4.21 - 5.59* రాహుకాలం : *ఉ10.30 - 12.00* యమగండ/కేతుకాలం: *మ3.00 - 4.30* సూర్యరాశి: *మేషం* చంద్రరాశి: *మీనం* సూర్యోదయం: *5.40*  సూర్యాస్తమయం: *6.14*  *మాసశివరాత్రి* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు
Read More

వదులైన బొందు వేసెను బంధానికి పీఠముడి!!! (భాగం -5)

వదులైన బొందు వేసెను బంధానికి పీఠముడి!!! (భాగం -5) వీరిద్దరూ ఆ శాల్తీ తో క్రికెట్ ఆడుతున్నప్పుడు అగుపించిన పోలీసు జీపు నేరుగా వచ్చి అదే గుడిసె ముందు ఆగింది. ********** జీపు ఆపి, " రేయ్, బాబు, ఇటు రా " అని పిలిచాడు డ్రైవింగ్ సీట్లో ఉన్న ఆఫీసర్. "గుడ్ ఈవినింగ్ సర్" అంటూ దగ్గరికి వచ్చాడు ఆ నల్లని శాల్తీ. "నీ పేరు ఏమిటి? నువ్వు, ఆ బండి మీద వెళ్లిన ఇద్దరూ ఫైటింగ్ చేశారు కదూ.....!" అని అడిగాడు అధికారి. "నా పేరు లక్ష్మణ్ సార్. మేము బచపన్ కా దోస్తులం సార్. వొట్టిగానే మజాకులాడినం, సార్. నేను వాడి వీపు మీద ఒకటి గట్టిగా సర్సిన నవ్వులాటలో. ఎండకి సుర్రు అన్నట్టుంది వాడి వీపు పాపం." చెప్పాడు లక్ష్మణ్. "మరి, నీ పెదవిపై ఆ రక్తం ఏంటి?" అడిగాడు అధికారి. "గదే సార్, నేను…
Read More